AP TS Summer Updates: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నేడు ఏపీలో 91 మండలాల్లో అలర్ట్-rising temperatures alert in 91 mandals in ap today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ap Ts Summer Updates: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నేడు ఏపీలో 91 మండలాల్లో అలర్ట్

AP TS Summer Updates: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. నేడు ఏపీలో 91 మండలాల్లో అలర్ట్

Sarath chandra.B HT Telugu
Apr 19, 2024 08:04 AM IST

AP TS Summer Updates: ఏపీ తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఏపీలో 91 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదవుతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు... 45 డిగ్రీలు దాటేసిన సగటు ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు... 45 డిగ్రీలు దాటేసిన సగటు ఉష్ణోగ్రతలు

AP TS Summer Updates: ఆంధ్రప్రదేశ్‌ భానుడి భగభగలతో ఉడికిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలు temparatures, వడగాల్పు heat wavesలతో జనం అల్లాడి పోతున్నారు. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా యెర్రంపేట, పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో 45.8°C ఉష్ణోగ్రత నమోదైంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

నంద్యాల జిల్లా నందవరం లో 45.6°C, విజయనగరం జిల్లా జామిలో 45.5°C, శ్రీకాకుళం జిల్లా కొవిలం,వైయస్సార్ జిల్లా కొంగలవీడులో 45.4°C, తిరుపతి జిల్లా రేణిగుంట, ప్రకాశం జిల్లా దరిమడుగులో తిరుపతి జిల్లా45.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పల్నాడు జిల్లా ముటుకూరులో 44.9°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, నెల్లూరు జిల్లా కసుమూరులో 44.6°C,కర్నూలు జిల్లా వగరూరు 44.2°C, అనకాపల్లి జిల్లా రావికవతం 44.1°C, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లు, చిత్తూరు జిల్లా రాయలపేటలో 44 °C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 44°Cకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. 84 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 120 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

శుక్రవారం 91 మండలాలకు వార్నింగ్…

శుక్రవారం ఏపీలోని 91 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 245 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని SDMA హెచ్చరించింది. శనివారం 39 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 215 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

శుక్రవారం ఏపీలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు ఇవే

శ్రీకాకుళంలో 11, విజయనగరంలో 21, పార్వతీపురంమన్యంలో 13, అల్లూరి సీతారామరాజులో 5 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదవుతాయి. అనకాపల్లిలో 7, కాకినాడలో 5, తూర్పుగోదావరిలో 2, ఏలూరులో 2, ఎన్టీఆర్‌లో 5, గుంటూరులో 6, పల్నాడులో 9, బాపట్లలో 1, ప్రకాశంలో 4 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు.

శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(245) :

శ్రీకాకుళం 15, విజయనగరం 4, పార్వతీపురంమన్యం 1, అల్లూరిసీతారామరాజు 11, విశాఖపట్నం 3, అనకాపల్లి 9, కాకినాడ 14, కోనసీమ 9, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 22, కృష్ణా 16, ఎన్టీఆర్ 11, గుంటూరు 10, పల్నాడు 15, బాపట్ల 14, ప్రకాశం 19, నెల్లూరు 22, వైఎస్సార్ 11, అన్నమయ్య 2, చిత్తూరు 1, తిరుపతి 16 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

తెలంగాణలో…

తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఎండలతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారైంది. గురువారం పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటిపోయాయి. ఎండ వేడిమితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండల కేంద్రాల్లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా వెల్గటూరు, మంచిర్యాల జిల్లా కొమ్మెరలో 45, పెద్దపల్లి జిల్లా కల్వచర్ల, ఖమ్మం జిల్లా పెనుబల్లిలో 44.9, సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 44.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

తెలంగాణలో పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు మండలాల్లో రెడ్‌ అలెర్ట్‌ కూడా జారీ చేశారు. గురువారం సాయంత్రానికి హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడటంతో వాతావరణం కొద్దిగా చల్లబడింది. హైదరాబాద్ శివార్లలోని నాగారం, దమ్మాయిగూడ మునిసిపాలిటీల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం