AP Heat Waves: నేడు ఏపీలో 63 మండలాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు… 44డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు-severe hail warnings for 63 mandals in ap today temperatures near 44 degrees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Heat Waves: నేడు ఏపీలో 63 మండలాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు… 44డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

AP Heat Waves: నేడు ఏపీలో 63 మండలాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు… 44డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు

Sarath chandra.B HT Telugu

AP Heat Waves: ఏపీలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. మంగళవారం 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఏపీలో మంగళవారం 63 మండలాలకు తీవ్రమైన వడగాల్పుల హెచ్చరికలు (Photo Source From unsplash.com)

AP Heat Waves: ఆంధ్రప్రదేశ్‌Andhra pradesh లో మంగళవారం 63 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు Severe heat waves,130 మండలాల్లో వడగాల్పులు heat waves వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ SDMA అలర్ట్‌ జారీ చేసింది. .

బుధవారం 38 మండలాల్లో తీవ్రవడగాల్పులు,135 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

మంగళవారం తీవ్ర వడగాల్పులలపై అలర్ట్…

మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 63 మండలాల్లో Mandals తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తీవ్రమైన వేడిగాలులు వీచే ప్రాంతాల్లో పార్వతీపురంమన్యం 13, శ్రీకాకుళం 15, విజయనగరం 22, అల్లూరి 3, అనకాపల్లి 4, కాకినాడ 3, తూర్పుగోదావరి 2, ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలాలు ఉన్నాయి.

మంగళవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు దాదాపు 130 ఉన్నాయి. శ్రీకాకుళం 14 , విజయనగరం 5, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 11, విశాఖపట్నం 3, అనకాపల్లి 12, కాకినాడ 16, కోనసీమ 9, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 13, కృష్ణా 7, ఎన్టీఆర్ 7, గుంటూరు 7, పల్నాడు 4 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

సాలూరులో 43.9 డిగ్రీలు…

సోమవారం పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 43.9°C, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3°డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 0 అల్లూరి జిల్లా యెర్రంపేటలో 43.1°C, పల్నాడు జిల్లా విజయపూరిలో(మాచెర్ల),విజయనగరం జిల్లా రాజాంలో 42.8°C, అనకాపల్లి గడిరైలో 42.7°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 38 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 75 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు.

వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.