TS AP Weather Updates : దిగొచ్చిన ఉష్ణోగ్రతలు, చల్లబడిన వాతావరణం..! తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు
- Telangana AP Weather Updates : తెలంగాణలో ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉండగా… మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana AP Weather Updates : తెలంగాణలో ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉండగా… మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
(1 / 7)
భానుడి ఉగ్రరూపంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు బెంబెలేత్తిపోయారు. ఏప్రిల్ మాసంలోనే ఎండల తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులుగా పరిస్థితి మారింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
(Photo Source From https://unsplash.com/)(2 / 7)
తెలంగాణతో పాటు ఏపీకి వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. వచ్చే నాలుగైదు రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
(Photo Source From https://unsplash.com/)(3 / 7)
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(Photo Source From https://unsplash.com/)(4 / 7)
ఎల్లో అలర్ట్ జారీ అయిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం చాలా ప్రాంతాల్లో గాలులు వీచాయి.
(Photo Source From https://unsplash.com/)(5 / 7)
తెలంగాణలో సోమవారం సాయంత్రం నుంచే వాతావరణం చల్లబడింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఈదురుగాలులు వీచాయి. ఆదివారం వరకు కూడా 45 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు… మంగళవారం 40 డిగ్రీలలోపు దిగొచ్చాయి
(Photo Source From https://unsplash.com/)(6 / 7)
వర్ష సూచనతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ పంట నష్టం వాటిల్లుతుందో అని భయపడుతున్నారు.
(Photo Source From https://unsplash.com/)ఇతర గ్యాలరీలు