Sree Vishnu: కామెడీ, హారర్ కాదు ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌తో శ్రీవిష్ణు కొత్త సినిమా.. సామజవరగమన హీరోయిన్‌తో రెండోసారి!-sree vishnu new movie as investigation thriller with reba monica john ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sree Vishnu: కామెడీ, హారర్ కాదు ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌తో శ్రీవిష్ణు కొత్త సినిమా.. సామజవరగమన హీరోయిన్‌తో రెండోసారి!

Sree Vishnu: కామెడీ, హారర్ కాదు ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌తో శ్రీవిష్ణు కొత్త సినిమా.. సామజవరగమన హీరోయిన్‌తో రెండోసారి!

Sanjiv Kumar HT Telugu
Apr 18, 2024 03:21 PM IST

Sree Vishnu New Movie: టాలీవుడ్‌ ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు వరుస విజయాలతో మంచి సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్‌లో శ్రీ విష్ణు హీరోగా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

కామెడీ, హారర్ కాదు ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌తో శ్రీవిష్ణు కొత్త సినిమా.. సామజవరగమన హీరోయిన్‌తో రెండోసారి!
కామెడీ, హారర్ కాదు ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌తో శ్రీవిష్ణు కొత్త సినిమా.. సామజవరగమన హీరోయిన్‌తో రెండోసారి!

Sree Vishnu New Movie: వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు. ఆయన రీసెంట్‌గా సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌, ఓం భీమ్ బుష్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ విష్ణు త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఏప్రిల్ 17న ప్ర‌క‌టించారు. హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న శ్రీ విష్ణు కొత్త సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ జోనర్‌గా రానుంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై సందీప్ గుణ్ణం, విన‌య్ చిల‌క‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సామజవరగమన చిత్రంలో శ్రీవిష్ణుకి జంట‌గా న‌టించిన రెబా జాన్ ఈ చిత్రంలో కూడా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ ఎగ్జ‌యిటింగ్ థ్రిల్ల‌ర్ మూవీ ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. మేక‌ర్స్ వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వీర్ ఆర్య‌న్‌, అయ్య‌ప్ప శ‌ర్మ‌, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

హీరో శ్రీవిష్ణు కెరీర్ ప్రారంభం నుంచి డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూ వ‌స్తున్నారు. ఇప్పుడు లైట్ బాక్స్ మీడియా, పిక్చ‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ జోనర్‌లో తెరకెక్కనుంది. అలాగే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తెర‌కెక్కుతోంది.

ఈ సినిమాకు విద్యాసాగ‌ర్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. కాల భైర‌వ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా,మ‌నీషా ఎ.ద‌త్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

ఇప్పటివరకు శ్రీ విష్ణు సామజవరగమన వంటి కామెడీ సినిమాతో అలరించారు. అలాగే కామెడీ హారర్ మిక్స్ చేసి ఓం భీమ్ బుష్ మూవీతో మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు పూర్తి కామెడీ కాకుండా, హారర్ కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ ఉండే జోనర్ అయినటువంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో శ్రీవిష్ణు రావడం అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.

సినిమాల్లో శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. అలాంటి శ్రీ విష్ణు కామెడీకి ఇన్వెస్టిగేషన్ జోనర్ తోడు అయితే మరో లెవెల్‌లో ఉంటుందని చెప్పవచ్చు. డైలాగ్స్ పూర్తిగా అర్థం కాకుండా వినిపించి వినిపించనట్లుగా చెప్పి కామెడీని పండించడం శ్రీ విష్ణు స్టైల్. మరి ఈసారి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీతో శ్రీ విష్ణు ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

ఇదివరకు శ్రీ విష్ణు, రెబా మోనిక జాన్ కలిసి నటించిన సామజవరగమన సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమాలో వీరిద్దరు యాక్టింగ్ అండ్ పెయిర్ అదిరిపోయింది. ముఖ్యంగా శ్రీ విష్ణు, రెబా మోనిక మధ్య వచ్చే రొమాంటిక్ అండ్ కామెడీ సీన్స్ బాగా పేలాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది.

ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాలో రెండోసారి రెబా మోనిక జాన్‌తో శ్రీ విష్ణు రొమాన్స్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికీ సక్సెస్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట కొత్త సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

IPL_Entry_Point