OTT: ఓటీటీలో హవా చూపిస్తున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా.. ఇంగ్లిష్, హిందీ చిత్రాలను దాటేసి..-anweshippin kandethum getting huge response on netflix ott beats damsel and merry christmas to most watched title in thi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anweshippin Kandethum Getting Huge Response On Netflix Ott Beats Damsel And Merry Christmas To Most Watched Title In Thi

OTT: ఓటీటీలో హవా చూపిస్తున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా.. ఇంగ్లిష్, హిందీ చిత్రాలను దాటేసి..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 10, 2024 09:06 PM IST

Anweshippin Kandethum OTT Streaming: అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా ఓటీటీలోనూ దూసుకుపోతోంది. మలయాళంతో పాటు తెలుగు సహా ఇంకొన్ని భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

OTT: ఓటీటీలో హవా చూపిస్తున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా.. ఇంగ్లిష్, హిందీ చిత్రాలను దాటేసి..
OTT: ఓటీటీలో హవా చూపిస్తున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా.. ఇంగ్లిష్, హిందీ చిత్రాలను దాటేసి..

Anweshippin Kandethum OTT: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్ర పోషించిన అన్వేషిప్పిన్ కండేతుమ్ చిత్రం సూపర్ హిట్ అయింది. ఫిబ్రవరి 9న మలయాళంలో ఈ మూవీ రిలీజ్ అయింది. రూ.10 కోట్ల లోపు బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ట్విస్టులతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు డార్విన్ కురియకోస్. థియేటర్లలో దుమ్మురేపిన ఈ చిత్రం.. ఓటీటీలోనూ మరింత హవా చూపిస్తోంది.

ఓటీటీలో ఐదు భాషల్లో..

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి మార్చి 8న అన్వేషిప్పిన్ కండేతుమ్ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల డబ్బింగ్‍లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. దీంతో నేషనల్ వైడ్‍గా నెట్‍ఫ్లిక్స్‌లో ఈ సినిమా హవా చూపిస్తోంది.

ఓటీటీలో అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా చూసిన చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో సస్పెన్స్, ట్విస్టులు అద్భుతంగా ఉన్నాయని పోస్టులు చేస్తున్నారు. తప్పకుండా చూడాలని ఇతరులకు రెకమెండ్ చేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఈ చిత్రానికి వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి.

ఈ వారం మోస్ట్ వాచ్డ్ మూవీగా..

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈవారం ఎక్కువ మంది చూసిన సినిమాగా అన్వేషిప్పిన్ కండేతుమ్ నిలిచింది. మార్చి 8నే ఆ ఓటీటీలో ఇంగ్లిష్ సినిమా డామ్‍షెల్, హిందీ మూవీ మేరీ క్రిస్మస్ కూడా వచ్చింది. అయితే, ఈ రెండింటి కంటే అన్వేషిప్పిన్ కండేతుమ్‍కే ఇప్పటి వరకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వారం నెట్‍ఫ్లిక్స్‌లో ఇండియాలో మోస్ట్ వాచ్డ్ మూవీగా సత్తాచాటింది. ఈ వారం రెండు, మూడు స్థానాల్లో డామ్‍షెల్, మేరీ క్రిస్మస్ నిలిచాయి. డంకీ, యానిమల్, గుంటూరు కారం హిందీ వెర్షన్ కూడా ఈ వారం నెట్‍ఫ్లిక్స్ మోస్ట్ వాచ్డ్ టాప్-10 జాబితాలో ఉన్నాయి.

అన్వేషిప్పిన్ కండేతుమ్ చిత్రంలో ఎస్‍ఐ ఆనంద్ నారాయణన్‍గా టోవినో థామస్‍ నటించారు. థామస్, సిద్ధిఖీ, బాబురాజ్, సాధిక్, షమ్మి తిలకన్, వినీత్ తత్తిల్, రాహుల్ రాజగోపాల్, ఆర్థన భాను, మనూ, అనఘ రవి కీలకపాత్రలు పోషించారు. యూల్డీ ఫిల్మ్స్, థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

అన్వేషిప్పిన్ కండేతుమ్ స్టోరీ బ్యాక్‍డ్రాప్ ఇవే

రెండు హత్యల ఇన్వెస్టిగేషన్ చుట్టూ అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా తిరుగుతుంది. ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనంతో ఈ చిత్రం సాగుతుంది. ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) ఎస్‍ఐగా పని చేస్తుంటారు. ఓ అమ్మాయి మిస్సింగ్ కేసులో అరెస్ట్ చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో అతడు సస్పెండ్ అవుతాడు. అయితే, కొన్నాళ్లకు నారాయణన్ చేతికి ఓ అమ్మాయి మర్డర్ కేసు వస్తుంది. తిరిగి విధుల్లో చేరి ఇన్వెస్టిగేషన్ చేపడతాడు నారాయణన్. ఈ హత్య చేసిన నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తాడు. మరి ఆ హత్య చేసిందెవరు? ఈ కేసును నారాయణన్ సాల్వ్ చేశాడా? విచారణలో ఎదురైన సవాళ్లు, మలుపులు ఏంటి? అనేదే అన్వేషిప్పిన్ కండేతుమ్ కథగా ఉంది.

IPL_Entry_Point