Om Bheem Bush: రెండు వందల శాతం పిచ్చిపిచ్చిగా నవ్వుతారు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్-sree vishnu comments on om bheem bush movie at trailer launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sree Vishnu Comments On Om Bheem Bush Movie At Trailer Launch Event

Om Bheem Bush: రెండు వందల శాతం పిచ్చిపిచ్చిగా నవ్వుతారు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Mar 16, 2024 12:54 PM IST

Sree Vishnu Om Bheem Bush Trailer Launch: శ్రీ విష్ణు హీరోగా నటించిన మరో సినిమా ఓం భీమ్ బుష్. ఇందులో శ్రీ విష్ణుతోపాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర హీరోలుగా చేశారు. తాజాగా ఓం భీమ్ బుష్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు శ్రీ విష్ణు,

రెండు వందల శాతం పిచ్చిపిచ్చిగా నవ్వుతారు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్
రెండు వందల శాతం పిచ్చిపిచ్చిగా నవ్వుతారు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్

Sree Vishnu Om Bheem Bush: హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు మరోసారి కొలబరేట్ అయిన సినిమా ఓం భీమ్ బుష్. దీనికి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకుముందు హుషారు సినిమా తెరకెక్కించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి నిర్మించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగిల్‌తో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ ఓం భీమ్ బుష్ ట్రైలర్ మార్చి 15న విడుదలైంది.

ఓం భీమ్ బుష్ ట్రైలర్ విడుదల చేస్తూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "మార్చి 22న థియేటర్స్‌కి రండి. మీరు నవ్విన నవ్వులకు థియేటర్స్ బద్దలైపోతాయి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూప్స్‌తో వెళితే ఇంక బాగా ఎంజాయ్ చేస్తారు. 22న ఎవరూ మిస్ అవ్వదు. మిమ్మల్ని నవ్వించాలనే ఉద్దేశంతోనే సినిమా చేశాం. రెండు వందల శాతం పిచ్చిపిచ్చిగా నవ్వుతారు" అని హీరో శ్రీ విష్ణు అన్నాడు.

శ్రీ విష్ణు ఇంకా కొనసాగిస్తూ "కేవలం ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన యూవీ వంశీ అన్నకి, సునీల్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు హర్ష చాలా హిలేరియస్‌గా సినిమాని తీశారు. సినిమా యూనిట్ అందరికీ ధన్యవాదాలు" అని తెలిపారు. "మార్చి 22 తప్పకుండా అందరూ థియేటర్స్‌కి రండి. డబుల్ డోస్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. నిర్మాతలు వంశీ గారు, సునీల్ గారు చాలా సపోర్ట్ చేశారు. వారి ప్రోత్సాహం వల్లే ఇంత క్రేజీ సినిమా చేయగలిగాం. తప్పకుండా సినిమా మీ అందరినీ అలరిస్తుంది" అని ప్రియదర్శి చెప్పాడు.

"ట్రైలర్‌లో ఉండే ఎనర్జీ కంటే సినిమాలో వందరెట్ల ఎనర్జీ ఉంటుంది. మార్చి 22న అందరూ గ్యాంగ్స్‌తో రండి. టెన్ టైమ్స్ ఎంటర్‌టైన్ అవుతారు. అది మా గ్యారెంటీ. మార్చి 22న కలుద్దాం" అని డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి అన్నారు. సినిమాను థియేటర్లలో తప్పకుండా చూడాలని నిర్మాత సునీల్ బలుసు కోరారు. ఇకపోతే సినిమాలో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతోపాటు ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు నటించారు.

ఓం భీమ్ బుష్ సినిమాలో ప్రియా వడ్లమాని గెస్ట్ రోల్ చేశారు. ఆమె ఒక పాటలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందని తెలుస్తోంది. ప్రియా వడ్లమాని హుషారు సినిమాతో చాలా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మూవీ తర్వాత ముఖచిత్రం అనే మరో మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు గెస్ట్ రోల్‌తో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది.

ఇక ఓం భీమ్ బుష్ ట్రైలర్ విషయానికొస్తే.. ముగ్గురు ఫ్రెండ్స్ భైరవపురం గ్రామంలోకి వచ్చాక, బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సొల్యూషన్స్‌ను ఎస్టాబెల్స్ చేస్తారు. ఈ ముగ్గురు వివిధ సమస్యలకు పరిష్కారంగా ట్యాబ్లెట్లతో పౌడర్ తయారు చేసి గ్రామస్తులకు అమ్ముతుంటారు. వారి వ్యాపారం పుంజుకున్నప్పుడు, అఘోరాల సమూహం గ్రామాల్లోకి ప్రవేశించి, రహస్యమైన సంపంగి మహల్‌లో నిధిని కనుగొనమని సవాలు విసురుతారు.

దాంతో ఆ ముగ్గురు హాంటెడ్ హౌస్‌లో నిధిని కనుగొనడానికి వెళ్తారు. అక్కడ విచిత్ర సంఘటనలతోపాటు కామెడీతో ఆకట్టుకుంటారు. ఓం భీమ్ బుష్‌లో ట్రెజర్ హంట్, హారర్, థ్రిల్లర్ మొదలైన ఇతర అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point