Trp Ratings: బుల్లితెర రిజల్ట్ రివర్స్ - నాగార్జున మూవీ సూపర్ హిట్టు - ధనుష్ సినిమా అట్టర్ ఫ్లాప్
Trp Ratings: నాగార్జున నా సామిరంగతో పాటు ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలు ఇటీవల టీవీలో టెలికాస్ట్ అయ్యాయి. వీటిలో టీఆర్‌పీ రేటింగ్‌లో నా సామిరంగ అదరగొట్టగా కెప్టెన్ మిల్లర్ అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్నది.
స్టార్ మా ఛానెల్‌లో నాగార్జున మూవీ...
నా సామిరంగ సినిమా ఇటీవల స్టార్ మా ఛానెల్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అర్బన్ ఏరియాలో 8.08 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. అర్బన్ ప్లస్ రూరల్‌లో కలిసి 6.93 టీఆర్‌పీ రేటింగ్ ను ఈ మూవీ దక్కించుకున్నది. నాగార్జున గత సినిమాలు బంగార్రాజు, ది ఘోస్ట్ సినిమాలకు మించి నా సామిరంగ మూవీ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
మలయాళంలో విజయవంతమైన పురింజు మరియం జోస్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీతో కొరియోగ్రాపర్ విజయ్ బిన్నీ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ హీరోలుగా నటించారు.
35 కోట్ల కలెక్షన్స్...
నాగార్జునకు జోడీగా ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. మిర్నా మీనన్, రుక్సర్ థిల్లాన్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. దాదాపు 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమాకు 35 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. కథ, కథనాలు రొటీన్ అనే విమర్శలొచ్చిన కూడా సంక్రాంతి జోష్‌లో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఈ సినిమాలో కిష్టయ్యగా మాస్ రోల్‌లో నాగార్జున అభిమానులను మెప్పించాడు.
కెప్టెన్ మిల్లర్...
ధనుష్ కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ జెమిని టీవీ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ఫస్ట్ ప్రీమియర్‌కు అర్బన్ ఏరియాలో 1.20 మాత్రమే టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 1.11 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. ధనుష్ తెలుగు డబ్బింగ్ మూవీస్‌లో అతి తక్కువ టీఆర్‌పీ రేటింగ్ దక్కించుకున్న మూవీగా ధనుష్ కెప్టెన్ మిల్లర్ నిలిచింది. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ధనుష్‌తో పాటు సందీప్‌కిషన్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు.
కులవివక్షపై పోరాటం...
బ్రిటీష్ కాలంలో కులవివక్షకు వ్యతిరేకంగా అగ్నీశ్వర అలియాస్ అగ్ని (ధనుష్) అనే నిమ్న కులానికి చెందిన యువకుడుఎలాంటి పోరాటం చేశాడు. కెప్టెన్ మిల్లర్ పేరుతో బ్రిటీష్ ఆర్మీలో జాయిన్ అయిన అతడు అక్కడి నుంచి బయటకు వచ్చి దొంగగా ఎలా మారాడు? తమ ఊరిని గుడి బ్రిటీష్ వారి దోపడి నుంచి ఎలా కాపాడాడు అన్నదే ఈ మూవీ కథ. తమిళంలో వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ తెలుగులో మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది.
ప్రస్తుతం ధనుష్, నాగార్జున కలిసి ఓ సినిమా చేస్తోన్నారు. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.