Ajith Good Bad Ugly: అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ.. పుష్ప మేకర్స్‌ నిర్మాణంలో.. సంక్రాంతికి రిలీజ్-ajith good bad ugly mythri movie makers announce new movie shooting to start in june pongal release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ajith Good Bad Ugly: అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ.. పుష్ప మేకర్స్‌ నిర్మాణంలో.. సంక్రాంతికి రిలీజ్

Ajith Good Bad Ugly: అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ.. పుష్ప మేకర్స్‌ నిర్మాణంలో.. సంక్రాంతికి రిలీజ్

Hari Prasad S HT Telugu
Mar 14, 2024 07:45 PM IST

Ajith Good Bad Ugly: తమిళ సూపర్ స్టార్ అజిత్ తో పుష్ప మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఈ మూవీ పేరు గుడ్ బ్యాడ్ అగ్లీ కాగా.. ఈ ఏడాది జూన్ లో షూటింగ్ ప్రారంభం కానుంది.

అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ.. పుష్ప మేకర్స్‌ నిర్మాణంలో.. సంక్రాంతికి రిలీజ్
అజిత్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ.. పుష్ప మేకర్స్‌ నిర్మాణంలో.. సంక్రాంతికి రిలీజ్

Ajith Good Bad Ugly: తమిళ స్టార్ హీరో అజిత్ ఇప్పుడో బైలింగ్వల్ మూవీ గుడ్ బ్యాడీ అగ్లీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ ను గుడ్ బ్యాడ్ అగ్లీగా నిర్ణయించారు. జూన్ లో మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.

అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ

మరో అరుదైన కాంబినేషన్ తెరపైకి రాబోతోంది. అల్లు అర్జున్ తో పుష్ప మూవీని తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ స్టార్ అజిత్ కుమార్ తో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేయనుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గురువారం (మార్చి 14) ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ తోపాటు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. ''దిగ్గజ స్టార్ అజిత్ కుమార్ సర్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ స్క్రిప్ట్, కథనం అద్భుతంగా వున్నాయి. అభిమానులు, సినిమా ప్రేమికులకు గ్రిప్పింగ్, ఆకట్టుకునే సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని అన్నాడు.

ఇక మరో నిర్మాత వై రవిశంకర్‌ మాట్లాడుతూ.. ''అజిత్‌ కుమార్‌ సర్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉంది. అధిక్ అద్భుత దర్శకత్వ ప్రతిభ అతని మునపటి చిత్రాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కొత్త చిత్రం నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుంది' చెప్పాడు. ఇక దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కూడా ఈ సందర్భంగా మాట్లాడాడు. ఇది తన జీవితంలో అద్భుతమైన క్షణమని అన్నాడు.

''ప్రతి ఒక్కరి జీవితంలోనూ, కెరీర్‌లోనూ అమూల్యమైన క్షణాలు ఉంటాయి. ఇది నా జీవితంలో అద్భుతమైన క్షణం. నా మ్యాట్నీ ఐడల్ ఏకే సర్‌తో కలిసి పనిచేయడం నా చిరకాల కల. ఈ సినిమాతో ఆ కల నేరవేరడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ లకు కృతజ్ఞతలు’’ అని తెలిపాడు.

ఇక ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కోసం పని చేసే సాంకేతిక నిపుణులను కూడా అనౌన్స్ చేశారు. విజయ్ వేలుకుట్టి ఎటిటర్ గా, సుప్రీం సుందర్, కలోయన్ వోడెనిచరోవ్ స్టంట్స్ డైరెక్టర్లుగా, పని చేస్తున్నారు. జూన్ లో షూటింగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళంలలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

అజిత్ వలీమై, తునివు సినిమాల్లో నటించాడు. గతేడాది పొంగల్ కు తునివుతో వచ్చి సక్సెస్ సాధించాడు. ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం అతడు విదా ముయార్చి మూవీలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ గుడ్ బ్యాడ్ అగ్లీతో తెలుగు, తమిళ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.

Whats_app_banner