Tillu Square Box Office: టిల్లూ స్క్వేర్‌కు రూ.100 కోట్లు పక్కా.. ఐపీఎల్ ఎఫెక్ట్ ఉండదు: ప్రొడ్యూసర్ కామెంట్స్-tillu square will collect 100 crores gross says producer naga vamsi siddu jonnalagadda anupama movie gets good reviews ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Tillu Square Will Collect 100 Crores Gross Says Producer Naga Vamsi Siddu Jonnalagadda Anupama Movie Gets Good Reviews

Tillu Square Box Office: టిల్లూ స్క్వేర్‌కు రూ.100 కోట్లు పక్కా.. ఐపీఎల్ ఎఫెక్ట్ ఉండదు: ప్రొడ్యూసర్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Mar 29, 2024 06:07 PM IST

Tillu Square Box Office: టిల్లూ స్క్వేర్ అంటూ రెట్టింపు నవ్వులను తీసుకొచ్చిన తమ సినిమాకు రూ.100 కోట్లు పక్కా అని అన్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. ఐపీఎల్ ప్రభావం కలెక్షన్లపై ఉండబోదని స్పష్టం చేశాడు.

టిల్లూ స్క్వేర్‌కు రూ.100 కోట్లు పక్కా.. ఐపీఎల్ ఎఫెక్ట్ ఉండదు: ప్రొడ్యూసర్ కామెంట్స్
టిల్లూ స్క్వేర్‌కు రూ.100 కోట్లు పక్కా.. ఐపీఎల్ ఎఫెక్ట్ ఉండదు: ప్రొడ్యూసర్ కామెంట్స్

Tillu Square Box Office: సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లూ స్క్వేర్ మూవీ ఊరించి ఊరించి మొత్తానికి శుక్రవారం (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది సెప్టెంబర్ నుంచి రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నా.. సినిమాపై భారీ అంచనాల నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో తమ సినిమాకు రూ.100 కోట్లు పక్కా అంటున్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ.

టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్ కలెక్షన్లు

టిల్లూ స్క్వేర్ మూవీ చాన్నాళ్లుగా ఊరించినా అంచనాలను అందుకోవడంతో ఫ్యాన్స్ ఖుషీగా థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. దీంతో మంచి ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తోంది. దీనికితోడు తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ రివ్యూలు ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్లను భారీగా పెంచనున్నాయి.

ఈ నేపథ్యంలో మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ టిల్లూ స్క్వేర్ రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు. అంతేకాదు ఐపీఎల్ ప్రభావం కూడా తమ సినిమాపై ఉండదని స్పష్టం చేశాడు. "తొలి రోజే రూ.25 కోట్ల గ్రాస్ అంచనా వేస్తున్నాం. యూఎస్ఏ ప్రీమియర్స్ గ్రాస్ 5 లక్షల డాలర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక నైజాం ఏరియాలో ఈ సినిమాకు రూ.7 నుంచి 8 కోట్లు రావచ్చు.

ప్రతి చోటా సాధ్యమైనన్ని ఎక్కువ షోలను యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. థియేటర్ రన్ ముగిసే సమయానికి రూ.100 కోట్ల గ్రాస్ అంచనా వేస్తున్నాం. మ్యాట్నీ షోలకు డిమాండ్ పెరగడం రానున్న రోజుల్లో మూవీ ఎలా ఆడబోతోందో స్పష్టం చేస్తోంది. ఈ సమ్మర్ లో పెద్దగా రిలీజ్ లు ఏమీ లేవు. అంతేకాదు ఉగాది, రంజాన్ లాంటి పండగలు కూడా ఉన్నాయి. అవి కూడా మాకు బాగా కలిసి వస్తాయి. ఐపీఎల్ సినిమాలపై ప్రభావం చూపదని అనుకుంటున్నాను. ఐపీఎల్ కూడా వరల్డ్ కప్ లాంటిదే. మన జీవితాల్లో భాగమైంది" అని నాగవంశీ అన్నాడు.

టిల్లూ స్క్వేర్ ఎలా ఉందంటే?

డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన ఈ టిల్లూ స్క్వేర్ ఆ మూవీ కంటే నవ్వులను కూడా రెట్టింపు చేసిందని తొలి షో నుంచే రివ్యూలు వస్తున్నాయి. మూవీ మొత్తం కడుపుబ్బా నవ్వించేసిందని, సిద్దూ జొన్నలగడ్డే సినిమాను ప్రధాన బలం అని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. టిల్లు పాత్ర‌లో అత‌డి ఎన‌ర్జీ, డైలాగ్స్ న‌వ్విస్తాయి. తాను రాసుకున్న క్యారెక్ట‌ర్ కావ‌డంతో ఈజీగా ఈ క్యారెక్ట‌ర్‌ను చేసుకుంటూ వెళ్లిపోయాడు. బోల్డ్ క్యారెక్ట‌ర్‌లో అనుప‌మ స‌ర్‌ప్రైజ్ చేసింది. లిప్‌లాక్‌ల‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేసింది.

టిల్లూ స్క్వేర్ మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్ కూడా ఏకంగా రూ.35 కోట్లకు డిజిటల్ హక్కులను దక్కించుకుంది. అయితే మూవీకి వచ్చి పాజిటివ్ రివ్యూల నేపథ్యంలో టిల్లూ స్క్వేర్ బ్రేక్ ఈవెన్ అందుకోవడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు.

IPL_Entry_Point