Tillu Square 8 Days Collections: మైల్‍స్టోన్‍కు చేరువలో టిల్లు స్క్వేర్.. 8 రోజుల కలెక్షన్లు-tillu square 8 days box office collections siddu jonnalagadda movie nears 100 crore mark ntr will attend success meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tillu Square 8 Days Collections: మైల్‍స్టోన్‍కు చేరువలో టిల్లు స్క్వేర్.. 8 రోజుల కలెక్షన్లు

Tillu Square 8 Days Collections: మైల్‍స్టోన్‍కు చేరువలో టిల్లు స్క్వేర్.. 8 రోజుల కలెక్షన్లు

Tillu Square 8 Days Box Office Collections: టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుడుతోంది. రూ.100 కోట్ల మైలురాయికి చేరువైంది. అలాగే, ఈ మూవీ సక్సెస్ మీట్‍కు స్టార్ హీరో ఎన్టీఆర్ హాజరుకానున్నారు. ఆ వివరాలివే..

Tillu Square 8 Days Collections: మైల్‍స్టోన్‍కు చేరువలో టిల్లు స్క్వేర్.. 8 రోజుల కలెక్షన్లు: సిద్ధు కోసం ఎన్టీఆర్ ఖరారు

Tillu Square 8 Days Collections: టిల్లు స్క్వేర్ సినిమాకు వసూళ్ల హవా కొనసాగుతోంది. రెండో వారంలోనూ కలెక్షన్లను జోరు కనిపిస్తోంది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ కామెడీ రొమాంటిక్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు.. అంచనాలను బీట్ చేస్తూ ముందుకు సాగుతోంది. మార్చి 29న రిలైజన ఈ మూవీ మొదటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని దుమ్మురేపుతోంది. రూ.100 కోట్ల మైల్‍స్టోన్‍కు అత్యంత సమీపంలోకి వచ్చింది. ఈ మూవీకి 8 రోజుల వసూళ్ల వివరాలివే..

8 రోజుల కలెక్షన్లు

టిల్లు స్క్వేర్ సినిమా వారం దాటినా బాక్సాఫీస్ వద్ద స్టడీగా కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఈ చిత్రం 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.96.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. స్టార్ బాయ్ రికార్డులను బద్దలుకొడుతున్నాడంటూ ఈ లెక్కలను మూవీ టీమ్ వెల్లడించింది. 8వ రోజు ఈ చిత్రానికి రూ.2.6 కోట్లు వచ్చాయి.

మరొక్క రోజులోనే..?

టిల్లు స్క్వేర్ చిత్రం 9 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నారు. 9వ రోజు శనివారం కావడంతో వసూళ్లలో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అందులోనూ ఫ్యామిలీ స్టార్ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం, పోటీలో ఇతర చిత్రాలు పెద్దగా లేకపోవడం బాక్సాఫీస్ వద్ద టిల్లుకు కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. దీంతో 9 రోజుల్లోనే ఈ మూవీ రూ.100 కోట్ల మైల్‍స్టోర్ దాటుతుందనే అంచనాలు ఉన్నాయి.

సిద్దు జొన్నలగడ్డ.. టిల్లు మార్క్ డైలాగ్స్, యాక్టింగ్, మేనరిజమ్స్ టిల్లు స్క్వేర్ మూవీ పూర్తిగా వర్కౌట్ అయ్యాయి. దీంతో డీజే టిల్లుకు సీక్వెల్‍గా వచ్చిన ఈ చిత్రం క్రేజ్‍ను నిలుపుకొని.. అంతకు మించి వసూళ్లను రాబడుతోంది. అనుపమ పరమేశ్వన్ గ్లామర్ కూడా ఈ చిత్రానికి మరో పెద్ద ప్లస్ అయింది. టిల్లు స్క్వైర్ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూజ్ చేశారు. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి, భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు.

టిల్లు కోసం దేవర

టిల్లు స్క్వేర్ బంపర్ హిట్ అవడంతో సక్సెస్ మీట్‍ను గ్రాండ్‍గా నిర్వహించేందుకు మూవీ టీమ్ రెడీ అయింది. ఏప్రిల్ 8న జరిగే ఈ మీట్‍కు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీని సిద్ధు, విశ్వక్‍సేన్, నిర్మాత నాగవంశీతో కలిసి చూశారు ఎన్టీఆర్. ఇందుకు సంబంధించి వీరి సెల్ఫీ కూడా బయటికి వచ్చింది. సర్‌ప్రైజ్ రాబోతోందని కూడా సిద్దు పోస్ట్ చేశారు. అయితే, సక్సెస్ ఈవెంట్‍కు ఎన్టీఆర్ రావడమే ఆ సర్‌ప్రైజ్ అని అప్పట్లోనే సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా ఖరారు చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.