Tillu Square: టిల్లు స్క్వేర్‌కు ఆ టార్గెట్ ఇక సులువే! ఎందుకంటే..
Tillu Square Collections: టిల్లు స్క్వేర్ చిత్రానికి భారీ ఓపెనింగ్ దక్కింది. అంచనాలకు మించి తొలి రోజు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు మేకర్స్ పెట్టుకున్న రూ.100 కోట్ల టార్గెట్ సునాయాసంగా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణాలేంటంటే..
Tillu Square Collections: రెండేళ్ల కిందట వచ్చిన డీజే టిల్లుతో టిల్లు క్యారెక్టర్‌కు ఓ కల్ట్ స్టేటస్ వచ్చేసింది. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్, మేనరిజమ్స్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆ పాత్రకు యూత్‍లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. రెండేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‍గా ఇప్పుడు మార్చి 29న టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ అయింది. ఫుల్ క్రేజ్, భారీ అంచనాల మధ్య థియేటర్లలో అడుగుపెట్టింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కింది. పలుసార్లు వాయిదాలు పడినా టిల్లు స్క్వైర్ మూవీకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ట్రైలర్ అదిరిపోవడంతో ఎక్స్‌పర్టేషన్స్ మరింత పెరిగాయి. అందుకు తగ్గట్టే భారీగా బుకింగ్స్ జరగడంతో తొలిరోజు అదిరే ఓపెనింగ్ వచ్చింది.
టిల్లు స్క్కేర్ మూవీకి తొలిరోజు అంచనాలకు మించి వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ డే ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రూ.23.7 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఈ చిత్రానికి రూ.100 కోట్ల కలెక్షన్లను టార్గెట్‍గా పెట్టుకున్నట్టు నిర్మాత నాగవంశీ చెప్పేశారు. అయితే, ఈ చిత్రం ఆ లక్ష్యాన్ని సులువుగానే చేరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే..
పాజిటివ్ టాక్.. మరింత జోష్
టిల్లు స్క్వేర్ మూవీ చాలా అంచనాలతో రిలీజ్ అయింది. అయితే, వాటిని పూర్తిస్థాయిలో ఈ చిత్రం నిలుపుకుంది. సిద్ధు జొన్నలగడ్డ షో, వన్ లైనర్స్ డైలాగ్‍లు, అనుపమ గ్లామర్, చిన్న ట్విస్టులు.. ఇలా ఈ చిత్రంలో చాలా అంశాలు వర్కౌట్ అయ్యాయి. ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ వచ్చింది. అందులోనూ రివ్యూలు కూడా ఎక్కువ శాతం సానుకూలంగానే బయటికి వచ్చాయి. దీంతో టిల్లు స్క్వేర్ చిత్రానికి వీకెండ్‍లో మరింత వసూళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ శని, ఆదివారాల్లో కలెక్షన్ల జోరు మరింత ఊపందుకునేలా ఉంది. బుకింగ్స్ ట్రెండ్స్ చూస్తే అది స్పష్టంగా అర్థమవుతోంది.
సమ్మర్ హాలీడేస్.. నో కాంపిటిషన్
టిల్లు స్క్వేర్ మూవీ కొన్నిసార్లు వాయిదా పడినా.. ఇప్పుడు సరైన సమయానికి రిలీజ్ అయింది. సరిగ్గా వేసవి సెలవుల టైమ్‍కు వచ్చింది. యూత్‍లో మంచి క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి ఇది పెద్ద ప్లస్ అయింది. అందులోనూ ప్రస్తుతం ఈ మూవీకి బాక్సాఫీస్ పెద్దగా పోటీ లేదు. ఏప్రిల్ 5వ తేదీన ఫ్యామిలీ స్టార్ వచ్చే వరకు టిల్లుకు పోటీ లేదు. ఫ్యామిలీ స్టార్ వచ్చినా.. టిల్లు స్క్వేర్ బాగానే పర్ఫార్మ్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏప్రిల్ రెండో వారంలో ఉగాది కూడా కలిసి రానుంది. దీంతో టిల్లు స్క్వేర్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రంలో యాక్టింగ్‍తో పాటు డైలాగ్ రైటింగ్‍లోనూ అదరగొట్టారు. మరోసారి తన డైలాగ్స్ మ్యాజిక్ చూపించారు. వాటిపైనే మూవీని ఎంటర్‌టైనింగ్‍గా నడిపారు. అనుపమ పర్ఫార్మెన్స్ కూడా ఈ చిత్రానికి మంచి బూస్ట్ ఇచ్చింది. టిల్లు స్క్వేర్ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి పాటలు ఆకట్టుకోగా.. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.