Sriranga Neethulu OTT: ఓటీటీలోకి ఆలస్యంగా సుహాస్ శ్రీరంగనీతులు.. రిలీజ్ డేట్ ఇదే! స్ట్రీమింగ్ ఎక్కడంటే?-suhas sriranga neethulu ott streaming on sony liv ott movies ott releases ruhani sharma sriranga neethulu ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sriranga Neethulu Ott: ఓటీటీలోకి ఆలస్యంగా సుహాస్ శ్రీరంగనీతులు.. రిలీజ్ డేట్ ఇదే! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sriranga Neethulu OTT: ఓటీటీలోకి ఆలస్యంగా సుహాస్ శ్రీరంగనీతులు.. రిలీజ్ డేట్ ఇదే! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
May 20, 2024 01:34 PM IST

Sriranga Neethulu OTT Streaming: కలర్ ఫొటో హీరో సుహాస్, బేబి హీరో విరాజ్, కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం ప్రధాన పాత్రల్లో నటించిన అంథాలజీ సినిమా శ్రీరంగనీతులు ఓటీటీలోకి కాస్తా ఆలస్యంగా రానుంది. శ్రీరంగనీతులు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవేనని సమాచారం.

ఓటీటీలోకి ఆలస్యంగా సుహాస్ శ్రీరంగనీతులు.. రిలీజ్ డేట్ ఇదే! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ఆలస్యంగా సుహాస్ శ్రీరంగనీతులు.. రిలీజ్ డేట్ ఇదే! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sriranga Neethulu OTT Release: ఇటీవలే ప్రసన్నవదనం సినిమాతో ప్రేక్షకులను అలరించాడు హీరో సుహాస్‌ (Suhas). ఫేస్ బ్లైండ్‌నెస్ కాన్సెప్ట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్నే అందుకుంది. రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఓటీటీ విడుదల తేదిని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

ప్రసన్నవదనం (Prasanna Vadanam OTT) సినిమా ఆహా ఓటీటీలో (Aha OTT) మే 24 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా కంటే ముందు అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ మూవీ తర్వాత సుహాస్ నటించిన మరో చిత్రమే శ్రీరంగనీతులు. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఆహా ఓటీటీలోనే (Ambajipeta Marriage Band OTT) స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

త్వరలో అదే ఆహా ఓటీటీలో ప్రసన్నవదనం కూడా స్ట్రీమింగ్ కానుంది. కానీ, ఏప్రిల్ 11న ఈ రెండు సినిమాల మధ్యలో విడుదలైన సుహాస్ శ్రీరంగనీతులు (Sriranga Neethulu 2024) మాత్రం ఇంకా ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. అంథాలజీ సినిమాగా వచ్చిన ఈ మూవీలో సుహాస్‌తోపాటు బేబి ఫేమ్ విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), కేరాఫ్ కంచెరపాలెంతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నంతోపాటు హాట్ అండ్ హిట్ హీరోయిన్ రుహానీ శర్మ (Ruhani Sharma) నటించారు.

టాలెంటెడ్ యాక్టర్స్ నటించిన శ్రీరంగనీతులు సినిమా విడుదలై నెలకుపైగా కావొస్తున్న ఓటీటీ రిలీజ్ కాలేదు. ఈ సినిమా ఒకటి వచ్చింది.. పోయింది అనేది కూడా ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. అలాంటి ఈ సినిమా కాస్తా ఆలస్యంగా ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

శ్రీరంగనీతులు ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ సోనీ లివ్ (SonyLIV OTT) మంచి ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ మూవీని ఈ మే నెలలో కాకుండా వచ్చే నెలలో జూన్ 7న ఓటీటీ స్ట్రీమింగ్ (Sriranga Neethulu OTT Date) చేయనున్నారట. అంటే, థియేట్రికల్ రిలీజ్ తర్వాత రెండు నెలలకు ఓటీటీలోకి రానుందన్నమాట. అయితే, దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ప్రసన్నవదనం సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. అలాంటిది వచ్చి పోయిందనే తెలియని సినిమా రెండు నెలలకు ఓటీటీలోకి రావడం ఏంటని ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఓటీటీ లవర్స్. ఏది ఏమైనా అంథాలజీ (Anthology Film) సినిమాగా వచ్చిన శ్రీరంగనీతులు సోనీ లివ్ ఓటీటీలో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు. కాగా శ్రీ‌రంగనీతులు సినిమాకు ప్ర‌వీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించారు. రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ మూవీని నిర్మించారు. శ్రీరంగనీతులు చిత్రాన్ని ప్ర‌ముఖ పంపిణీదారుడు, నిర్మాత ధీర‌జ్ మొగిలినేని వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేశారు.

Whats_app_banner