OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?-ott release this week on netflix amazon prime hotstar aha ott prasanna vadanam ott release aadujeevitham ott movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movies This Week: ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?

OTT Movies This Week: ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?

Sanjiv Kumar HT Telugu
May 20, 2024 10:20 AM IST

OTT Movies On This Week: ఓటీటీలోకి ఈ వారం సినిమాల పండుగ జరగనుంది. మొత్తంగా ఈ వీక్ ఓటీటీలోకి 21 సినిమాలు, వెబ్ సిరీసులు రానున్నాయి. ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, జియో సినిమా తరహా ఇతర ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?
ఓటీటీలో ఈ వారం సినీ పండుగ.. ఏకంగా 21 సినిమాలు.. కానీ 2 మాత్రమే చూడదగినవి.. ఏంటంటే?

This Week OTT Movies: ఎప్పటిలానే కొత్త వారం వచ్చేసింది. న్యూ వీక్ వచ్చేసిందంటే కొత్త ఓటీటీ సినిమాల లిస్ట్ వచ్చేసినట్లే. దీనికోసం ఓటీటీ లవర్స్, సినీ ప్రియులు కాచుకుని కూర్చుంటారు. థియేటర్లలో పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడూ పడతాయా అని ఎంతలా ఎదురుచూస్తారో డిఫరెంట్ కంటెంట్ ఉన్న ఓటీటీ మూవీస్ కోసం కూడా అంతే వెయిట్ చేస్తుంటారు.

కొంతమంది సినిమాలను ఇష్టపడితే.. మరికొంతమంది వెబ్ సిరీసులను వీక్షిస్తారు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం అంటే మే 20 నుంచి 26 వరకు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో సినిమా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాంటి సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయో లుక్కేద్దాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

షిన్ చాన్ సీజన్ 16 కిడ్స్ (యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 20

డోరామ్యాన్ సీజన్ 19 కిడ్స్ (యానిమేటెడ్ వెబ్ సిరీస్)- మే 20

మార్వెల్ స్టూడియోస్: అసెంబుల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎక్స్‌మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 22

పాలైన్ (జర్మన్ మూవీ)- మే 22

ది కర్దాషియన్స్ 5వ సీజన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 23

ది బీచ్ బాయ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 24

ఆడు జీవితం ది గోట్ లైఫ్ (మలయాళ చిత్రం)- మే 26 (ప్రచారంలో ఉన్న తేది)

రోలాండ్ గారోస్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ మూవీ)- మే 26

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది వన్ పర్సెంట్ క్లబ్ సీజన్ 1- (వెబ్ సిరీస్)- మే 23

ది బ్లూ ఎంజెల్స్ (డాక్యుమెంటరీ మూవీ)- మే 23

డీఓఎం సీజన్ 2 (వెబ్ సిరీస్)- మే 24

బాంబ్‌సెల్- మే 25 నుంచి స్ట్రీమింగ్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్

ఇల్లూజన్స్ ఫర్ సేల్ (డాక్యుమెంటరీ సినిమా)- మే 23

గారోడెన్న్ ది వే ఆఫ్ ది లోన్ ఉల్ఫ్ (యానిమేషన్)- మే 23

ఇన్ గుడ్ హ్యాండ్స్ 2 (ఇంగ్లీష్ సినిమా)- మే 23

ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- మే 23

అట్లాస్ (సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)- మే 24

ముల్లిగన్ పార్ట్ 2 (యానిమేషన్ సిట్ కామ్)- మే 24

మై ఓని గర్ల్ (యానిమేషన్ సినిమా)- మే 26

ట్రైయింగ్ సీజన్ 4 (వెబ్ సిరీస్)- యాపిల్ టీవీ ప్లస్- మే 22

ప్రసన్నవదనం (తెలుగు చిత్రం)- ఆహా ఓటీటీ- మే 24

ఇలా ఈ వారం ఓటీటీలోకి సినిమాలు వెబ్ సిరీసులు కలుపుకుని మొత్తంగా 21 విడుదల కానున్నాయి. వీటిలో ఎక్కువగా కిడ్స్‌కు సంబంధించిన యానిమేషన్ చిత్రాలు, వెబ్ సిరీసులు ఉండటం విశేషం. 21లో 5 యానిమేషన్‌కు సంబంధించినవే ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ వారం 21 సినిమాలు రిలీజ్ అవుతున్న వాటిలో రెండు మాత్రమే స్పెషల్ కానున్నాయి. అవి సుహాస్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ప్రసన్నవదనం, మరొకటి మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితం. ఈ రెండు ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదం పంచనున్నాయి.

Whats_app_banner