Ashish Vidyarthi On Suhas : సుహాస్‌ను ఆ స్టార్ హీరో పోల్చిన ఆశిష్ విద్యార్థి-ashish vidyarthi comments on writer padma bhushan actor suhas ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ashish Vidyarthi Comments On Writer Padma Bhushan Actor Suhas

Ashish Vidyarthi On Suhas : సుహాస్‌ను ఆ స్టార్ హీరో పోల్చిన ఆశిష్ విద్యార్థి

Anand Sai HT Telugu
Jan 22, 2023 10:36 AM IST

Writer Padma Bhushan : రైటర్ పద్మభూషణ్‌ సినిమా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. సుహాస్ లీడ్ రోల్ లో వస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు ఆశీష్ విద్యార్థి కీలక పాత్ర పోషించాడు. సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నాడు.

ఆశీష్ విద్యార్థి
ఆశీష్ విద్యార్థి

సుహాస్ హీరోగా వస్తున్న చిత్రం ‘రైటర్ పద్మభూషణ్‌. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి.మనోహర్ సమర్పిస్తున్నారు. రైటర్ పద్మభూషణ్‌ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి చిత్ర విశేషాలని పంచుకున్నారు.

రైటర్ పద్మభూషణ్‌ జర్నీ గురించి చెప్పండి ?

మనం ఎక్కడో దూరంగా ఆలోచించి మన దగ్గరే వుండే సింపుల్ గా వుండే విషయాలని సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోతాం. ఛాయ్ బిస్కెట్ ప్రయాణం కూడా ఇలా సింపుల్ గా గానే మొదలైయింది. ఈ సినిమాలో పనిచేసిన వారంతా ముందు యుట్యూబ్ లో వీడియోలు చేశారు. అక్కడే నేర్చుకున్నారు. అవకాశాలు ఇచ్చి, నేర్పించేవారు వారంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో పని చేయడం చాలా గర్వంగా వుంది. మంచి హ్యుమర్ వున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఫిబ్రవరి3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

రైటర్ పద్మభూషణ్‌ లో మీ పాత్ర గురించి చెప్పండి ?

రైటర్ పద్మభూషణ్‌ లో ఒక మధ్యతరగతి తండ్రిగా కనిపిస్తా. ప్రతి తండ్రిలానే తన కొడుకు ఎదో సాధిస్తాడనే ఆశ పడే తండ్రి పాత్ర. తనకి ఒక ఫిక్స్ లైఫ్ స్టయిల్ వుంటుంది. ప్రతి రూపాయిని లెక్కపెట్టుకునే తండ్రి. అయితే తన జీవితంలో ఎదో డిఫరెంట్ గా జరుగుతుంది. చివర్లో ఒక అద్భుతమైన ట్విస్ట్ వుంటుంది. సినిమా చూసిన వారు రివ్యూ ఇవ్వండి కానీ దయచేసి ఆ ట్విస్ట్ ని మాత్రం రివిల్ చేయొద్దు. చాలా మంచి హ్యుమర్, ఎమోషన్ వుంటుంది. చాలా నిజాయితీగా తీసిన చిత్రమిది.

కొత్తవాళ్ళతో చేయడం ఎలా అనిపించింది ?

నేను ఎప్పుడూ పెద్ద సినిమా, చిన్న సినిమ అని చూడను. వచ్చిన పాత్రని, నచ్చిన పాత్రని చేసుకుంటూ వెళ్ళడమే తెలుసు. నా వరకూ తోటి నటులతో యాక్ట్ చేస్తున్నపుడు నా పాత్రని ఎంత వరకూ న్యాయం చేస్తున్నాననే దానిపైనే దృష్టి ఉంటుంది. చిన్నా పెద్ద ఆలోచన వుండదు.

సుహాష్ లో మీరు పరిశీలించిన విషయాలు ?

సుహాస్ చాలా సింపుల్. చాలా సహజంగా ఉంటాడు. తనకి మంచి భవిష్యత్ వుంటుంది. నాని, సుహాస్ లో చాలా సిమిలారిటీస్ కనిపించాయి.

ఛాయ్ బిస్కెట్ తో పని చేయడం ఎలా అనిపించింది ?

అనురాగ్, శరత్ చాలా క్లియర్ విజన్ ఉన్న నిర్మాతలు. సినిమా అంటే వాళ్ళకి ప్యాషన్. మోడరన్ మైండ్ సెట్ తో వుంటారు. వాళ్లతో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. నా సోషల్ మీడియా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కూడా నాకు చాలా విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు.

మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా ?

డ్రీం రోల్ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. తర్వాత చేయబోయే పాత్రే డ్రీమ్ రోల్ గా భావిస్తాను. సినిమా అనేది దర్శకుడు, రచయితకి సంబధించినది. నిర్మాత ఆ కలని నిజం చేస్తాడు. దీనికి నటులు తోడు అవుతారు. మంచి పాత్ర రావాలంటే అది దర్శకుడు, రచయితపైనే ఆధారపడి వుంటుంది. నా వరకూ అన్ని రకాల పాత్రలు చేయాలనీ వుంది. మొదట్లో చాలా వరకూ విలన్ రోల్స్ చేశాను. ఇప్పుడు నేను కోరుకునే పాత్రలు, సెంట్రల్ రోల్స్ చేయాలని వుంది. దర్శక రచయితలకు ఓ మంచి పాత్రని అడగడానికి నాకు మొహమాటం వుండదు. వాళ్ళు మంచి పాత్రని ఇవ్వాలన్నా అది మనం చేయగలమని నమ్మకం కల్పించడం కూడా మన బాధ్యతే.

రోహిణి కాంబినేషన్ లో కామెడీ సీన్స్ చేయడం ఎలా అనిపించింది ?

నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఇందులో పాత్రలన్నీ చాలా అందంగా వుంటాయి. అందుకే ప్రేక్షకులకు చూపించాలని చాలా ఎక్సయిటెడ్ గా వుంది.

IPL_Entry_Point