Mahesh Babu Movie: మహేష్ బాబు రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ చెప్పిన సుధీర్ బాబు.. అంతవరకు చిన్న పెగ్ ఇస్తానంటూ!-sudheer babu reveals mahesh babu rajamouli ssmb 29 movie release date in harom hara pre release event telugu movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu Movie: మహేష్ బాబు రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ చెప్పిన సుధీర్ బాబు.. అంతవరకు చిన్న పెగ్ ఇస్తానంటూ!

Mahesh Babu Movie: మహేష్ బాబు రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ చెప్పిన సుధీర్ బాబు.. అంతవరకు చిన్న పెగ్ ఇస్తానంటూ!

Sanjiv Kumar HT Telugu
Jun 14, 2024 10:50 AM IST

Sudheer Babu About Mahesh Babu Rajamouli SSMB 29 Release Date: మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ రిలీజ్ డేట్‌కు ఎన్నేళ్లు పడుతుందో హీరో సుధీర్ బాబు చెప్పాడు. అంతవరకు ఫుల్ బాటిల్ కిక్ కాకుండా ఒక్కో సినిమాతో చిన్న పెగ్ ఇస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సుధీర్ బాబు.

మహేష్ బాబు రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ చెప్పిన సుధీర్ బాబు.. అంతవరకు చిన్న పెగ్ ఇస్తానంటూ!
మహేష్ బాబు రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ చెప్పిన సుధీర్ బాబు.. అంతవరకు చిన్న పెగ్ ఇస్తానంటూ!

Sudheer Babu On Mahesh Babu Rajamouli Movie: హీరో సుధీర్ బాబు నటించిన మరో డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రం హరోం హర. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చిత్రానికి సెహరి మూవీ డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు.

అతిథులుగా యంగ్ హీరోలు

హరోం హర సినిమా శుక్రవారం అంటే జూన్ 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ విడుదలకు ముందు హరోం హర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంగ్ హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు-రాజమౌళి ఎస్ఎస్ఎంబీ29 సినిమా రిలీజ్ డేట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు సుధీర్ బాబు.

తుపాకీతో వచ్చి

"డైరెక్టర్ జ్ఞానసాగర్ ఓ తుపాకీ పట్టుకొచ్చి ఈ కథని నెరేట్ చేశాడు. తను ఊహించిన వరల్డ్ ఎలా ఉంటుందో క్లియర్‌గా అర్థమయింది. సుబ్రహ్మణ్యం క్యారెక్టర్‌పై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్‌కి థాంక్స్. ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్స్‌కి వెళ్లినా ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అయ్యేలా ఉంటుంది. ప్రొడ్యూసర్స్ సుమంత్, సుబ్రహ్మణ్యం ఈ కథకు ఫుల్‌గా జస్టిస్ చేశారు. ఈ సినిమాతో ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్‌గా నిలబడతారు" అని సుధీర్ బాబు అన్నారు.

సుబ్రమణ్యంలా ఫీల్ అవుతారు

"డివోపీ అరవింద్ అదరగొట్టాడు. చేతన్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్. మ్యూజిక్ అదిరిపోయింది. సినిమా చూసిన ప్రతి ఆడియన్ సుబ్రమణ్యంలా ఫీలౌతాడు. దీనికి ముఖ్య కారణం చేతన్ ఇచ్చిన మ్యూజిక్. తన ఫ్యూచర్‌లో పెద్ద హీరోలతో పని చేస్తాడనే నమ్మకం ఉంది. ఆర్ట్ డైరెక్టర్ రాము గారు ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఎడిటర్ రవితేజ గారు ఎక్సలెంట్‌గా చేశారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను" అని సుధీర్ బాబు చెప్పారు.

ఫుల్ బాటిల్ కిక్ ఇస్తుంది

"సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి థాంక్స్. ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా సపోర్ట్ ఇచ్చారు. మహేష్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎట్ లీస్ట్ త్రీ ఇయర్స్ పట్టొచ్చు. ఆ స్పెస్ నేను పూర్తి చేస్తానని చెప్పడం లేదు. అది ఏ హీరో వల్ల సాధ్యం కాదు. మహేష్ సినిమా ఫుల్ బాటిల్ కిక్ ఇస్తుంది. కానీ, నేను ఒక్కటి చెప్పగలను. నేను ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్ కిక్ ఇవ్వలేను. కానీ, చిన్నపెగ్ అయితే ఇస్తాను. మహేష్ సినిమా విడుదలయ్యే లోపల ప్రతి సినిమాతో చిన్న పెగ్, చిన్న పెగ్ ఇస్తూ ఫుల్ బాటిల్ ఇస్తాననే నమ్మకం ఉంది. అది హరోం హరతో మొదలవుతుంది" అని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

ఇలాంటిది పడితే

"జూన్ 4న రిజల్ట్స్ వచ్చాయి. కుప్పం నుంచి చంద్రబాబు గారు గెలిచారు. జూన్ 14న సుబ్రహ్మణ్యం హరోం హర నుంచి వస్తున్నాడు. వాడూ గెలుస్తాడు. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ అంతా కాలర్ లేపుకుంటూ వెళ్తారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాకపోయినా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు మా హీరోకి కూడా ఇలాంటిది పడితే బావుటుందని ఫీలౌతారు. హరోం హర అలాంటి సినిమా అవుతుంది. జూన్ 14 హరోం హర ప్లీజ్ డూ వాచ్" అని సుధీర్ బాబు కామెంట్స్ చేశారు.

ఫుల్ లెంత్ రోల్

"హీరోయిన్ మాళవిక చాలా స్ట్రాంగ్ రోల్ చేసింది. తనకి గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. సునీల్ గారు ఫుల్‌ లెంత్ రోల్‌లో కనిపిస్తారు. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అర్జున్, లక్కీ లక్ష్మణ్.. అందరికీ పేరు పేరున థాంక్స్" అని సుధీర్ బాబు పేర్కొన్నారు.

WhatsApp channel