SSMB29: మహేశ్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‍గా పృథ్విరాజ్ సుకుమారన్!-ssmb 29 update prithviraj sukumaran to play villain role in mahesh babu ss rajamouli movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ssmb29: మహేశ్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‍గా పృథ్విరాజ్ సుకుమారన్!

SSMB29: మహేశ్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‍గా పృథ్విరాజ్ సుకుమారన్!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 02, 2024 11:05 PM IST

SSMB 29: మహేశ్ బాబు - రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.

SSMB29: మహేశ్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‍గా పృథ్విరాజ్ సుకుమారన్!
SSMB29: మహేశ్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‍గా పృథ్విరాజ్ సుకుమారన్!

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన పాపులర్ అయ్యారు. తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి ఓ గ్రాండ్ స్కేల్ మూవీని (SSMB29) రూపొందించనున్నారు. అయితే, ఆర్ఆర్ఆర్ రిలీజై రెండేళ్లు పూర్తయినా ఇంకా మహేశ్ - రాజమౌళి మూవీ పట్టాలెక్కలేదు. ప్రస్తుతం షూటింగ్ ముందు చేయాల్సిన పనులు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది. అయితే, ఈ సినిమా గురించి తాజాగా ఓ ముఖ్యమైన విషయం బయటికి వచ్చింది. విలన్ పాత్ర ఎవరు చేయనున్నారో వెల్లడైంది.

విలన్‍గా పృథ్విరాజ్

మహేశ్ బాబు - రాజమౌళి చిత్రంలో విలన్‍గా మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటించనున్నారనే విషయం బయటికి వచ్చింది. ప్రభాస్ హీరోగా చేసిన సలార్‌లో ఓ ప్రధాన పాత్ర చేసిన పృథ్విరాజ్ పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా మహేశ్ - రాజమౌళి చిత్రంలోనే ఆయనకు విలన్ క్యారెక్టర్ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.

ఈ విషయంపై రాజమౌళి - పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయట. ఇప్పటికి ఓ క్లారిటీ రావటంతో ఇద్దరూ అంగీకరించారని టాక్. మహేశ్ బాబును ఢీకొట్టే విలన్ పాత్రను ఈ చిత్రంలో పృథ్విరాజ్ చేయనున్నారని సమాచారం.

ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర రెగ్యులర్ విలన్‍గా ఉండదని, చాలా బాగా రాసిన మలుపు ఉండే క్యారెక్టర్ అని సంబంధిత వర్గాలు చెప్పినట్టు పింక్‍‍విల్లా రిపోర్ట్ వెల్లడించింది. “హీరో వర్సెస్ విలన్ పోరును ఎస్ఎస్ఎంబీ 29లో రాజమౌళి చాలా కొత్తగా చూపించనున్నారు. ఓ సాధారణ విలన్ పాత్రను పృథ్విరాజ్ ఈ చిత్రంలో చేయడం లేదు. చాలా బాగా రాసిన, ఆర్క్ ఉండే క్యారెక్టర్ అది. ఆ పాత్రకు సొంతంగా బ్యాక్‍స్టోరీ ఉంటుంది. రాజమౌళి, మహేశ్ బాబుతో తొలిసారి పని చేయనుండటం పట్ల ఉత్సాహాన్ని పృథ్విరాజ్ వ్యక్తం చేశారు” అని ఆ రిపోర్ట్ వెల్లడించింది.

ఆఫ్రికన్ అడవుల బ్యాక్‍డ్రాప్‍లో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా గ్రాండ్ విజువల్స్‌తో ఈ మూవీని రూపొందించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా ఫినిష్ అయ్యాయని తెలుస్తోంది.

షూటింగ్ ప్రారంభం ఎప్పుడో?

మహేశ్ బాబు - రాజమౌళి సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఉత్కంఠ ఉంది. ఈ ఏడాది చివరి మూడు నెలల్లో లేకపోతే 2025 ప్రారంభంలో ఈ మూవీ చిత్రీకరణ మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో రాజమౌళి బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

ఎస్ఎస్ఎంబీ29 చిత్రం ఇండియానా జోన్స్‌లా అడవుల బ్యాక్‍డ్రాప్‍లో అడ్వెంచర్ యాక్షన్ చిత్రంగా ఉండనుందని సమాచారం. ఈ చిత్రాన్ని సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ ప్రొడక్షన్ హౌస్‍లతో ఆయన చర్చిస్తున్నారట. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రం తెరకెక్కడం ఖాయం. ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త లుక్‍లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే లుక్ మార్చడంతో పాటు ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా సూపర్ స్టార్ తీసుకుంటున్నారు.

WhatsApp channel