Mahesh Babu: గౌతమ్ కాన్వకేషన్‍కు మహేశ్ బాబు.. సూపర్ స్టార్ కొత్త లుక్‍కు ఫ్యాన్ ఫిదా.. ఫొటోలు వైరల్-mahesh babu attends his son gautham convocation fans go crazy on super star new look photos goes viral ssmb29 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: గౌతమ్ కాన్వకేషన్‍కు మహేశ్ బాబు.. సూపర్ స్టార్ కొత్త లుక్‍కు ఫ్యాన్ ఫిదా.. ఫొటోలు వైరల్

Mahesh Babu: గౌతమ్ కాన్వకేషన్‍కు మహేశ్ బాబు.. సూపర్ స్టార్ కొత్త లుక్‍కు ఫ్యాన్ ఫిదా.. ఫొటోలు వైరల్

Chatakonda Krishna Prakash HT Telugu
May 26, 2024 08:41 PM IST

Mahesh Babu - SSMB 29: తన కుమారుడు గౌతమ్ కాన్వకేషన్‍కు మహేశ్ బాబు హాజరయ్యారు. గర్వంగా ఉందంటూ పోస్ట్ చేశారు. అయితే, సూపర్ స్టార్ నయా లుక్‍కు అభిమానులు మరోసారి ఖుషీ అవుతున్నారు. ఈ ఫొటోలు వైరల్‍గా మారాయి.

Mahesh Babu: గౌతమ్ కాన్వకేషన్‍కు మహేశ్ బాబు.. సూపర్ స్టార్ కొత్త లుక్‍కు ఫ్యాన్ ఫిదా.. ఫొటోలు వైరల్
Mahesh Babu: గౌతమ్ కాన్వకేషన్‍కు మహేశ్ బాబు.. సూపర్ స్టార్ కొత్త లుక్‍కు ఫ్యాన్ ఫిదా.. ఫొటోలు వైరల్

Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‍లో సినిమా (SSMB29) షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా నయా లుక్‍లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి వర్క్ షాప్‍ల్లో మహేశ్ పాల్గొంటున్నారు. షూటింగ్ ముందు చేయాల్సిన పనుల్లో రాజమౌళి కూడా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మహేశ్ కొత్త లుక్‍ అభిమానులకు తెగ నచ్చేస్తోంది. ఇటీవల ఆయన ఫొటోలు చాలాసార్లు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు నయా లుక్‍తో మహేశ్ బాబు మరోసారి కనిపించారు.

తన కుమారుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన సందర్భంగా కాన్వకేషన్‍కు మహేశ్ బాబు హాజరయ్యారు. మహేశ్ భార్య నమ్రత, కూతురు సితార కూడా ఈ కార్యక్రమానికి వెళ్లారు. ఈ ఫొటోలను మహేశ్, నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కొడుకును అభినందిస్తూ..

గ్రాడ్యుయేషన్ అందుకున్న కుమారుడు గౌతమ్‍ను అభినందిస్తూ ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు (మే 26) పోస్ట్ చేశారు మహేశ్ బాబు. తండ్రిగా గర్విస్తున్నానంటూ రాసుకొచ్చారు. “నా మనసు గర్వంతో ఉప్పొగుతోంది. గ్రాడ్యుయేషన్ సందర్భంగా నీకు అభినందనలు. తర్వాతి చాప్టర్ నువ్వే రాసుకోవాల్సి ఉంటుంది. ముందుకంటే ఇంకా మెరుగ్గా ఉంటావని నాకు తెలుసు. నీ కలలను ఛేదిస్తూనే ఉండు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటామని గుర్తుంచుకో. నేను నేడు గర్విస్తున్న తండ్రిని” అని కుమారుడు గౌతమ్ గురించి క్యాప్షన్ రాశారు మహేశ్ బాబు.

మహేశ్ లుక్ వైరల్

కాన్వకేషన్‍లో మహేశ్ బాబు లుక్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో మహేశ్ లుక్ సూపర్‌గా ఉంది. లాంగ్ హెయిర్ కొన్నాళ్ల నుంచి మెయింటెన్ చేస్తున్నా.. ఇప్పుడు గడ్డం కూడా పెంచుతున్నారు మహేశ్. దీంతో మరింత కొత్తగా కనిపిస్తున్నారు.

కాన్వకేషన్‍లో మహేశ్ బాబు పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ నయా లుక్‍కు అభిమానులు మరోసారి ఫిదా అవుతున్నారు. ఫొటోలను పోస్ట్ చేస్తూ ఖుషీ అవుతున్నారు.

మహేశ్ బాబు - రాజమౌళి సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్‍లో మొదలవుతుందనే రూమర్లు ఉన్నాయి. ఆ దిశగానే ముందస్తు కసరత్తులు వేగంగా సాగుతున్నాయని తెలుస్తోంది. గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందనుంది. ఈ మూవీ గురించి అప్‍డేట్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజమౌళితో మూవీ కోసం మహేశ్ ప్రత్యేకమైన ఫిజికల్ ట్రైనింగ్ చేస్తున్నారు. వర్క్ షాప్‍ల్లో పాల్గొంటున్నారు. కొత్త లుక్‍తో కనిపిస్తున్నారు. ఈ మూవీలో మరింత లాంగ్ హెయిర్, ఎక్కువ గడ్డంతోనే మహేశ్ కనిపిస్తారని అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే కొన్ని రోజులుగా కొత్త లుక్‍లోనే సూపర్ స్టార్ మారుతున్నారు.

మహేశ్ - రాజమౌళి చిత్రం ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‍తో రూపొందుతుందనే రూమర్లు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ రేంజ్‍లో రాజమౌళి పాపులర్ అయ్యారు. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్‍ను కూడా దృష్టిలో పెట్టుకొని హాలీవుడ్ రేంజ్‍లో ఈ మూవీని తెరకెక్కిస్తారని తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024