Mahesh Babu: మహేశ్ బాబును కలిసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు: ఫొటోలు-sunrisers hyderabad players met tollywood superstar mahesh babu srh captain cummins to nitish kumar reddy ipl 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mahesh Babu: మహేశ్ బాబును కలిసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు: ఫొటోలు

Mahesh Babu: మహేశ్ బాబును కలిసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు: ఫొటోలు

Apr 22, 2024, 11:14 PM IST Chatakonda Krishna Prakash
Apr 22, 2024, 11:14 PM , IST

  • SRH Players with Mahesh Babu - IPL 2024: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును సన్‍రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు కలిశారు. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా మరికొందరు ప్లేయర్లు మహేశ్‍ను మీట్ అయ్యారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) భీకరంగా ఆడుతోంది. బ్యాటింగ్‍లో విధ్వంసాలు సృష్టిస్తూ రికార్డుల మోత మోగిస్తోంది. కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు కలిశారు. ఈ ఫొటోలను హైదరాబాద్ ఫ్రాంచైజీ నేడు (ఏప్రిల్ 22) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

(1 / 5)

ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) భీకరంగా ఆడుతోంది. బ్యాటింగ్‍లో విధ్వంసాలు సృష్టిస్తూ రికార్డుల మోత మోగిస్తోంది. కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు కలిశారు. ఈ ఫొటోలను హైదరాబాద్ ఫ్రాంచైజీ నేడు (ఏప్రిల్ 22) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (Photo: Sunrisers Hyderabad)

సన్‍రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో మహేశ్ బాబు సరదాగా మాట్లాడారు. ఈ ఫొటోలో మయాంక్ యాదవ్ కూడా ఉన్నారు. మహేశ్‍తో కమిన్స్ ఉన్న ఈ ఫొటో వైరల్‍గా మారింది. 

(2 / 5)

సన్‍రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో మహేశ్ బాబు సరదాగా మాట్లాడారు. ఈ ఫొటోలో మయాంక్ యాదవ్ కూడా ఉన్నారు. మహేశ్‍తో కమిన్స్ ఉన్న ఈ ఫొటో వైరల్‍గా మారింది. 

మహేశ్ బాబుతో తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దిగిన ఫొటో ఇది. ఈ సీజన్‍లో నితీశ్ అదరగొడుతున్నారు. 

(3 / 5)

మహేశ్ బాబుతో తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి దిగిన ఫొటో ఇది. ఈ సీజన్‍లో నితీశ్ అదరగొడుతున్నారు. (Photo: Sunrisers Hyderabad)

ఎస్‍ఆర్‌హెచ్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి కూడా మహేశ్‍తో ఫొటో దిగారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు తదుపరి మూవీ (SSMB 29) చేయనున్నారు. 

(4 / 5)

ఎస్‍ఆర్‌హెచ్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి కూడా మహేశ్‍తో ఫొటో దిగారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు తదుపరి మూవీ (SSMB 29) చేయనున్నారు. (Photo: Sunrisers Hyderabad)

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‍ల్లో ఐదు గెలిచి సన్‍రైజర్స్ హైదరాబాద్ ఫుల్ ఫామ్‍లో ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును రెండుసార్లు ఇదే సీజన్‍లో బద్దలుకొట్టింది. ఇక, తదుపరి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 25న సన్‍రైజర్స్ తలపడనుంది. హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. 

(5 / 5)

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‍ల్లో ఐదు గెలిచి సన్‍రైజర్స్ హైదరాబాద్ ఫుల్ ఫామ్‍లో ఉంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును రెండుసార్లు ఇదే సీజన్‍లో బద్దలుకొట్టింది. ఇక, తదుపరి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 25న సన్‍రైజర్స్ తలపడనుంది. హైదరాబాద్‍లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. (PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు