SS Rajamouli: కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్‌పై స్పందించిన దర్శక ధీరుడు రాజమౌళి.. 'ఆయన లుక్‍తో ఆశ్చపోయా'
SS Rajamouli on Kalki 2898 AD Trailer: కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్‌పై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని ట్వీట్ చేశారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ రాసుకొచ్చారు.
SS Rajamouli: ప్రస్తుతం అంతటా ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఫీవర్ ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మరో ఐదు రోజుల్లో జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ శుక్రవారం రాగా.. అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ తరుణంలో ఈ ట్రైలర్‌పై నేడు (జూన్ 22) స్పందించారు దర్శక ధీరుడు రాజమౌళి.
పవర్ ప్యాక్డ్ ట్రైలర్
కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్‌లో కమల్ హాసన్ లుక్ చూసి తాను ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నానని రాజమౌళి నేడు ట్వీట్ చేశారు. అమితాబ్, ప్రభాస్, దీపికా పాత్రల్లో చాలా లోతు ఉన్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. “ఇది పవర్ ప్యాక్డ్ ట్రైలర్. ఫస్ట్ డే ఫస్ట్ షోనే ఈ మూవీని చూసేందుకు ఇది మూడ్, టోన్‍ను సెట్ చేసింది” అని రాజమౌళి రాసుకొచ్చారు.
“అమితాబ్ జీ, డార్లింగ్ (ప్రభాస్), దీపికా పాత్రల్లో చాలా రహస్యాలు, లోతు ఉన్నట్టు కనిపిస్తోంది. కమల్ సర్ లుక్ చూసి ఇప్పటికీ ఆశ్చర్యంలోనే ఉన్నా. ఎప్పుడూ ఇంత ఆశ్చర్యం ఎలా కలిగిస్తారు. నాగీ (నాగ్ అశ్విన్).. 27వ తేదీన నీ అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్లేందుకు ఎదురుచూడలేకున్నా” అని రాజమౌళి ట్వీట్ చేశారు. రిలీజ్ ట్రైలర్ వచ్చిన ఒక రోజు తర్వాత ఆయన స్పందించారు.
అదిరిపోయే రెస్పాన్స్
కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అద్భుతమైన విజువల్స్, యాక్షన్‍తో పాటు ఎమోషన్‍తో ఉన్న ఈ ట్రైలర్ అంచనాలను మరింత భారీగా పెంచేసింది. ప్రమోషన్లు పెద్దగా చేయకున్నా హైప్‍ను తీసుకొచ్చింది.
కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించి ముంబైలో ఇటీవల ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ నిర్వహించడంపై సందిగ్ధత నెలకొంది. ఇక మరే ఈవెంట్ ఉండదనే అంచనాలు కూడా ఉన్నాయి. అందుకు తగ్గట్టే మూవీ టీమ్ కూడా సైలెంట్‍గానే ఉంది. ముంబై ఈవెంట్ తర్వాత ప్రభాస్ కూడా ప్రమోషన్స్ హోగయా అనే కామెంట్ చేశారు.
కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపికాతో పాటు దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, సస్వత ఛటర్జీ, శోభన మాళవిక నాయర్ కీలకపాత్ర చేశారు. అయితే, ఈ సినిమాలో క్యామియో రోల్స్ చాలా ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి సహా మరికొందరు క్యామియో పాత్రల్లో కనిపిస్తారనే రూమర్లు ఉన్నాయి. దీంతో ఈ విషయంపై చాలా ఆసక్తి నెలకొంది.
కల్కి 2898 ఏడీ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ భారీ బడ్జెట్‍తో నిర్మించారు. ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రం అద్భుతంగా ఉందంటూ.. సెన్సార్ సభ్యులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారని రిపోర్టులు బయటికి వచ్చాయి. అన్ని పురాణాలకు ముగింపులా ఈ చిత్రం ఉంటుందని, అలా ఊహించి కల్కి మూవీ కథను తాను రాసుకున్నానని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. ఈ చిత్రం విడులయ్యే జూన్ 27 కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తదుపరి సూపర్ స్టార్ మహేశ్ బాబుతో గ్లోబల్ రేంజ్‍లో చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.
టాపిక్