Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్-prithviraj sukumaran says shiv mannar has cross over with another universe and fans exiting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Chatakonda Krishna Prakash HT Telugu
May 07, 2024 10:50 PM IST

Prithviraj Sukumaran: సలార్‌లో తాను పోషిస్తున్న పాత్ర గురించి మరో ఆసక్తికర విషయాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ వెల్లడించారు. ఇది అభిమానులను మళ్లీ గెస్ చేసేలా చేస్తోంది. ఆ వివరాలివే..

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్
Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Prithviraj Sukumaran: ‘సలార్ పార్ట్-1: సీజ్‍ఫైర్’ సినిమా గతేడాది డిసెంబర్‌లో రిలీజై బంపర్ హిట్ అయింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘సలార్ పార్ట్ 2: శౌర్యాంగపర్వం’ షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకానుందని తెలుస్తోంది. సలార్ చిత్రాల్లో వరదరాజ మన్నార్, శివమన్నార్ అనే రెండు పాత్రలను పృథ్విరాజ్ పోషిస్తున్నారు. అయితే, పార్ట్ 2 షూటింగ్‍కు ముందు సలార్ విషయంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు పృథ్విరాజ్.

శివమన్నార్ వేరే యూనివర్స్‌లో..

శివ మన్నార్ పాత్రను మరింత చూడాలనుకుంటున్నామని ఓ యూజర్ ట్వీట్ చేశారు. అయితే, దీనికి పృథ్విరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ రిప్లే ఇచ్చారు. శివ మన్నార్ పాత్ర సలార్ మాత్రమే కాకుండా వేరే యూనివర్స్‌లోనూ ఉంటుందని పృథ్వి చెప్పారు. దీంతో సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ వేరే చిత్రంలో లింక్ ఉండనుందని హింట్ ఇచ్చేశారు.

శివమన్నార్ కథ కూల్‍గా ఉంటుందని పృథ్విరాజ్ పేర్కొన్నారు. “ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన అన్ని కథల్లో.. శివమన్నార్ స్టోరీ కూలెస్ట్ అనిపించింది. మరొక యూనివర్స్‌తో నమ్మశక్యం కానీ విధంగా క్రాస్ ఓవర్ ఉంటుంది” అని పృథ్విరాజ్ ట్వీట్ చేశారు.

సలార్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ వేరే సినిమాలకు లింక్ ఉంటుందనేలా పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పేశారు. ఈ విషయం అభిమానులను చాలా ఎగ్జైట్ చేస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చలు మొదలైపోయాయి.

కేజీఎఫ్‍తోనా.. ఎన్టీఆర్ మూవీతోనా!

సలార్‌లోని శివమన్నార్ పాత్రకు ఊహించిన విధంగా ప్రశాంత్ నీల్ యూనివర్స్‌లో క్రాస్ ఉంటుందని పృథ్విరాజ్ చెప్పడంతో.. నెటిజన్లు తమ ఊహలకు ఇప్పటికే పని చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‍లో రానున్న చిత్రంతోనే సలార్‌కు లింక్ ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో కేజీఎఫ్‍తో ఈ లింక్ ఉంటుందని పోస్టులు చేస్తున్నారు. రకరకాల థియరీలో చెబుతున్నారు. మొత్తంగా పృథ్విరాజ్ చేసిన ఈ ట్వీట్‍తో ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‍మెంట్ పెరిగిపోయింది.

పార్ట్ 2 షూటింగ్ అప్పటి నుంచేనా!

సలార్ పార్ట్ 2 షూటింగ్‍పై సమాచారం బయటికి వచ్చింది. మే నెలాఖరు నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ప్రభాస్ లేకుండానే ముందుగా చిత్రీకరణ జరుగుతుందనే టాక్ ఉంది. జూలై చివరి వారంలో సలార్ 2 షూటింగ్‍కు ప్రభాస్ వెళతారని తెలుస్తోంది. 2025లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.

సలార్ మూవీల్లో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్‍తో పాటు శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరిరావు, టిన్నూ ఆనంద్, బాబి సింహా, దేవరాజ్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాలను హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు. సలార్ పార్ట్ 1 చిత్రం రూ.700కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. క్లైమాక్స్ చాలా ప్రశ్నలను మిగల్చటంతో సలార్ 2 కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

IPL_Entry_Point