Love Mouli: అమ్మాయిలు బాగా కనెక్ట్ అయ్యారు.. లస్ట్ కోసం కాదు.. రాజమౌళి శిష్యుడు కామెంట్స్-ss rajamouli disciple avaneendra about navdeep love mouli movie and says its not about lust love mouli connected to girl ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Love Mouli: అమ్మాయిలు బాగా కనెక్ట్ అయ్యారు.. లస్ట్ కోసం కాదు.. రాజమౌళి శిష్యుడు కామెంట్స్

Love Mouli: అమ్మాయిలు బాగా కనెక్ట్ అయ్యారు.. లస్ట్ కోసం కాదు.. రాజమౌళి శిష్యుడు కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jun 06, 2024 07:04 AM IST

Director Avaneendra About Love Mouli Movie: స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి శిశ్యుడు అవనీంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్న సినిమా లవ్ మౌళి. నవదీప్ హీరోగా నటిస్తున్న లవ్ మౌళి మూవీ అమ్మాయిలకు బాగా కనెక్ట్ అయిందని అవనీంద్ర చెప్పారు.

అమ్మాయిలు బాగా కనెక్ట్ అయ్యారు.. లస్ట్ కోసం కాదు.. రాజమౌళి శిష్యుడు కామెంట్స్
అమ్మాయిలు బాగా కనెక్ట్ అయ్యారు.. లస్ట్ కోసం కాదు.. రాజమౌళి శిష్యుడు కామెంట్స్

Rajamouli Avaneendra Navdeep Love Mouli: దర్శక దిగ్గజం రాజమౌళి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అవనీంద్ర డైరెక్టర్‌గా మారిన సినిమా లవ్ మౌళి. చాలా కాలం గ్యాప్ తర్వాత నవదీప్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు అవనీంద్ర. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

జూన్ 7న శుక్రవారం లవ్ మౌళి మూవీ విడుదల కానుంది. కానీ, విడుదలకు మూడు రోజుల ముందుగానే వైజాగ్‌లో లవ్ మౌళి మూవీ ప్రీవ్యూ షో వేశారు. ఈ ప్రీవ్యూ షోలపై వచ్చే స్పందనపై, లవ్ మౌళి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను డైరెక్టర్ అవనీంద్ర మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

వైజాగ్‌లో ల‌వ్‌ మౌళి ప్రీమియ‌ర్స్‌కు ఎలాంటి స్పంద‌న వ‌చ్చింది?

ఇటీవల వైజాగ్‌లో లవ్ మౌళి ప్రత్యేక షో వేయడం జరిగింది. ఈ షోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా వాళ్లకు షో వేస్తే.. అందరూ బాగుందనే అంటారు. బాలేదని ఎవరూ చెప్పలేదు. అందుకే కొంతమంది చెప్పేదే నేను నమ్ముతాను. కీరవాణిగారి బ్రదర్ కాంచీగారు ఏమున్నా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. అలాంటి వారి ఓపెనియన్‌ని నేను బాగా నమ్ముతాను.

విడుద‌ల‌కు మూడు రోజుల ముందే ప్రివ్యూ వేయడం రిస్క్ అనిపించ‌లేదా?

వైజాగ్‌లో ప్రివ్యూ వేయడానికి కూడా ముందు ఆలోచించాం. టాక్ బయటికి వెళ్లిపోతుందేమో అని అనుకుని కూడా.. టెస్ట్ చేద్దామని అనుకున్నాం. అలా అనుకుని బుకింగ్ ఓపెన్ చేస్తే.. వెంటనే అయిపోయాయి. అప్పుడర్థమైంది జనాలు కూడా సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నారని. సినిమా చూసిన వారంతా ఎంజాయ్ చేశారు. నేను ఊహించని చోట కూడా వారు ఎంగేజ్ అయి ఎంజాయ్ చేయడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ క‌థ‌లో న‌చ్చే ఎలిమెంట్స్ ఏమిటి?

ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంతమందికి లొకేషన్స్, కొంతమందికి హీరోయిన్ క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.

ఇంత బోల్డ్ క‌థ‌తోనే మీరు ద‌ర్శ‌కుడికి ప‌రిచయం కావ‌డానికి కార‌ణం ఏమిటి?

ఈ కథ అనుకున్నప్పుడు నేను ‘ఆర్ఆర్ఆర్’ రైటింగ్‌లో ఉన్నాను. నేను ఆ సినిమాకు అసోసియేట్ రైటర్‌ని. అప్పుడే మా టీమ్ అంతా నువ్వు డైరెక్ట్ చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు. అయితే నేను కమర్షియల్ కథలు ఎన్నో అప్పటికే రాసేశాను.

ఏ కథ రాస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తూ కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు రిఫ్రెష్ అనిపించేలా ఉండాలని అనుకున్నాను. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రాస్తున్నప్పుడే పేరలల్‌గా ఈ పాయింట్ అనుకున్నాను. ఆర్ఆర్ఆర్‌తో అప్పటికే ఓకే చేసిన కథలన్నీ పూర్తి చేసి ఈ కథపై కూర్చున్నా.

ఈ సినిమా బ‌డ్జెట్ లిమిట్ దాటిందా?

లాక్‌డౌన్ టైమ్‌లో షూటింగ్ నిమిత్తం చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవమే కానీ.. దాని వల్ల బడ్జెట్ పెరగడం అంటూ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ని కూడా నేనే. ముందుగానే అన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నా.

టీ20 వరల్డ్ కప్ 2024