Ramcharan: అంబానీ కొడుకు వెడ్డింగ్‌ సెల‌బ్రేష‌న్స్‌- ఆర్ఆర్ఆర్ హీరోకు అందిన ఆహ్వానం-ram charan and upasana will be attending anant ambani and radhika merchants pre wedding celebrations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ramcharan: అంబానీ కొడుకు వెడ్డింగ్‌ సెల‌బ్రేష‌న్స్‌- ఆర్ఆర్ఆర్ హీరోకు అందిన ఆహ్వానం

Ramcharan: అంబానీ కొడుకు వెడ్డింగ్‌ సెల‌బ్రేష‌న్స్‌- ఆర్ఆర్ఆర్ హీరోకు అందిన ఆహ్వానం

Nelki Naresh Kumar HT Telugu
Mar 01, 2024 01:13 PM IST

Ramcharan: ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక‌ల‌లో రామ్‌చ‌ర‌ణ్ సంద‌డిచేయ‌బోతున్నాడు. స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి చ‌ర‌ణ్ అనంత్‌, రాధిక మ‌ర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు అటెండ్ కాబోతున్నాడు.

రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌
రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌

Ramcharan: ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక‌ల‌కు టాలీవుడ్ నుంచి మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ అటెండ్ కాబోతున్నాడు. ఇండియాలోని కుబేరుల‌లో ఒక‌రైన ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ...రాధికా మ‌ర్చంట్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. అనంత్‌, రాధిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఫిబ్ర‌వ‌రి 28 నుంచి గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో మొద‌ల‌య్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న టాప్ బిజినెస్‌మెన్స్‌తో పాటు సినీ సెల‌బ్రిటీలు, పొటిలిటిక‌ల్‌, స్పోర్ట్స్ స్టార్స్ అటెండ్ అవుతోన్నారు. మొత్తం మూడు రోజ‌లు పాటు వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుగ‌బోతున్నాయి.

రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌...

అనంత్ అంబానీ, రాధికా మ‌ర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు రామ్‌చ‌ర‌ణ్ అటెండ్ కాబోతున్నాడు. త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఈ పెళ్లి వేడుక‌ల్లో పాల్గొన‌నున్నాడు. శుక్ర‌వారం ఈ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ కోసం శుక్ర‌వారం రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న జామ్ న‌గ‌ర్ వెళ్ల‌నున్న‌ట్లు తెలిసింది. టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే అనంత్ పెళ్లి వేడుక‌ల‌కు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు షారుఖ్‌ఖాన్ త‌న భార్య పిల్ల‌ల‌తో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో మార్క్ జుకెర్‌బ‌ర్గ్‌, బాబ్ ఇగ‌ర్‌, బిల్‌గేట్స్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న టాప్ బిజినెస్‌మెన్స్ హాజ‌రుఅవుతార‌ని అంటున్నారు. అనంత్ అంబానీ, రాధికా మ‌ర్చంట్ పెళ్లి లండ‌న్‌లో జూలై 12న జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం.

గేమ్ ఛేంజ‌ర్‌తో బిజీ...

ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. డైరెక్టర్ శంకర్ మార్కు సందేశానికి పొలిటిక‌ల్ యాక్ష‌న్ అంశాల‌ను మేళ‌వించి ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్‌తో దిల్‌రాజు గేమ్ ఛేంజ‌ర్ మూవీని నిర్మిస్తున్నాడు. డిసెంబ‌ర్‌లో గేమ్ ఛేంజ‌ర్ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో న‌వీన్‌చంద్ర‌, సునీల్‌, శ్రీకాంత్‌, అంజ‌లి కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

స్పోర్ట్స్ డ్రామా మూవీ...

గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయ‌బోతున్నాడు రామ్‌చ‌ర‌ణ్.రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 16వ సినిమా ఇది.

ప్రొడ్యూస‌ర్‌గా...

హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై చ‌ర‌ణ్ ఫోక‌స్ పెడుతున్నాడు. ఆచార్య, ఖైదీ నంబ‌ర్ 150 వంటి భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించాడు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో కూడిన చిన్న సినిమాల‌ను నిర్మిచండానికి వీ మెగా పిక్చ‌ర్స్ పేరుతో మ‌రో కొత్త నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాడు రామ్‌చ‌ర‌ణ్‌.

ఈ బ్యాన‌ర్ ద్వారా ది ఇండియా హౌజ్ పేరుతో ఓ దేశ‌భ‌క్తి మూవీని రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాలో నిఖిల్ హీరోగా న‌టిస్తోన్నాడు. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌ను గెలుచుకొని చ‌రిత్ర‌ను సృష్టించింది. ఎన్టీఆర్ మ‌రో హీరోగా న‌టించిన ఈ మూవీకి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

టాపిక్