Pre-Wedding Shoot in hospital : ఆపరేషన్​ థియేటర్​లో ప్రీ- వెడ్డింగ్​ షూట్​.. ‘ఇదేందయ్యా.. ఇది!’-karnataka pre wedding shoot inside operation theatre goes viral ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pre-wedding Shoot In Hospital : ఆపరేషన్​ థియేటర్​లో ప్రీ- వెడ్డింగ్​ షూట్​.. ‘ఇదేందయ్యా.. ఇది!’

Pre-Wedding Shoot in hospital : ఆపరేషన్​ థియేటర్​లో ప్రీ- వెడ్డింగ్​ షూట్​.. ‘ఇదేందయ్యా.. ఇది!’

Sharath Chitturi HT Telugu
Feb 10, 2024 06:45 AM IST

Karnataka Pre-Wedding Shoot viral video : ఓ డాక్టర్​.. తన కాబోయే భార్యతో కలిసి, ఓ ఆసుపత్రిలో ప్రీ- వెడ్డింగ్​ షూట్​ నిర్వహించాడు. అతడిని అధికారులు తొలగించారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

ఆపరేన్​ థియేటర్​లో ప్రీ- వెడ్డింగ్​ షూట్​..
ఆపరేన్​ థియేటర్​లో ప్రీ- వెడ్డింగ్​ షూట్​..

Pre-Wedding Shoot in Karnataka hospital : కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ వైద్యుడు.. తన కాబోయే భార్యతో కలిసి.. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్​ థియేటర్​లో ప్రీ- వెడ్డింగ్​ షూట్​ నిర్వహించాడు!

ఇదీ జరిగింది..

కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగింది ఈ ఘటన. సంబంధింత వ్యక్తి.. కాంట్రాక్ట్​ నిమిత్తం చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అతనికి త్వరలోనే పెళ్లి జరగబోతోంది. కాగా.. ఇటీవలి కాలంలో ఫేమస్​ అవుతున్న 'ప్రీ- వెడ్డింగ్​ షూట్​' సంప్రదాయాన్ని వాళ్లు కూడా పాటించాలని అనుకున్నారు. కానీ వైద్యుడు కదా! కాస్త కొత్తగా ఆలోచించాడు.

Karnataka hospital Pre wedding photo shoot : తన కాబోయే భార్యను, కెమెరామెన్​లను ఆసుపత్రికి పట్టికెళ్లాడు. ఆపరేషన్​ థియేటర్​లో ఓ వ్యక్తిని పడుకోబెట్టి.. అతడికి ఆపరేషన్​ చేస్తున్నట్టుగా, ఇద్దరు నటిస్తుండగా, ఆ దృశ్యాలను కెమెరామెన్​లు వీడియో తీశారు. ఇవన్నీ.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

త్వరలోనే పెళ్లి జరగబోతున్న జెంట.. ఫేక్​ ఆపరేషన్​ చేస్తుంటే, వాటిని వీడియో తీస్తున్న వారు.. నవ్వుకుంటున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో రికార్డు అయ్యాయి. చివరికి.. ఆపరేషన్​ చేయించుకుంటున్న వ్యక్తి లేచి.. నవ్వడం మొదలుపెట్టాడు.

ఈ వీడియో వెంటనే సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. జిల్లా యాంత్రాంగం దృష్టికి వెళ్లింది. సదరు వైద్యుడిని విధుల నుంచి తొలగించింది.

Pre wedding photo shoot viral video : "నేషనల్​ హెల్త్​ మిషన్​ కింద అతడిని మేము నియమించుకున్నాము. నెల రోజుల క్రితమే.. మెడికల్​ ఆఫీసర్​గా కాంట్రాక్ట్​ ఉద్యోగంలో చేరాడు. వీడియో కనిపిస్తున్న ఆపరేషన్​ థియేటర్​ని ప్రస్తుతం ఎవరు వాడట్లేదు. రిపేరులో ఉంది. డిసెంబర్​ నుంచి ఎవరు వాడట్లేదు," అని చిత్రదుర్గ జిల్లా హెల్త్​ ఆఫీసర్​ తెలిపారు.

ఈ ఘటన.. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి వెళ్లింది.

"ఇలాంటి వాటిని మేము సహించబోము. ఆసుపత్రి ఆపరేషన్​ థియేటర్​లో ప్రీ-వెడ్డింగ్​ షూట్​ నిర్వహించిన వైద్యుడిని, వెంటనే విధుల నుంచి తొలగించాము," అని దినేశ్​ గుండు ట్వీట్​ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నద్ది ప్రజల ఆరోగ్యాలను సంరక్షించడం కోసమేనని, వ్యక్తిగత పనుల కోసం కాదని ఉద్ఘటించారు. వైద్యులు క్రమశిక్షణతో లేకపోతే.. సహించమని తేల్చిచెప్పారు.

Karnataka latest news : "ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తగా ఉండాలని నేను ఇప్పటికే డాక్టర్లు, సిబ్బందికి ఆదేశాలిచ్చాను," అని దినేశ్​ గుండు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వసతులను ఉపయోగించుకుని విధులను సరిగ్గా నిర్వహించుకోవడంపై మాత్రమే అందరు దృష్టిపెట్టాలని అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం