Trivikram on Samantha: రజినీకాంత్ తర్వాత సమంతనే: త్రివిక్రమ్.. ఇద్దరితో ఓ మూవీ చేయాలని అడిగిన ఆలియా భట్-samantha after rajinikanth in equal fanbase across parts of india says trivikram at alia bhatt jigra pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Trivikram On Samantha: రజినీకాంత్ తర్వాత సమంతనే: త్రివిక్రమ్.. ఇద్దరితో ఓ మూవీ చేయాలని అడిగిన ఆలియా భట్

Trivikram on Samantha: రజినీకాంత్ తర్వాత సమంతనే: త్రివిక్రమ్.. ఇద్దరితో ఓ మూవీ చేయాలని అడిగిన ఆలియా భట్

Trivikram on Samantha: జిగ్రా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍లో సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు డైరెక్టర్ త్రివిక్రమ్. సమంతకు ఏ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉందో చెప్పారు.

Trivikram on Samantha: రజినీకాంత్ తర్వాత సమంతనే: త్రివిక్రమ్.. ఇద్దరితో ఓ మూవీ చేయాలని అడిగిన ఆలియా భట్

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో జిగ్రా చిత్రం వస్తోంది. అక్టోబర్ 11వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అవుతోంది. ఈ తరుణంలో తెలుగు కోసం నేడు (అక్టోబర్ 8) ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లో జరిగింది. డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టార్ హీరోయిన్ సమంత, హీరో రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రజినీ తర్వాత సమంత

ఈ ఈవెంట్‍లో సమంతపై త్రివిక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లలో రజినీకాంత్ తర్వాత సమంతనే అని చెప్పారు. “తెలుగు, తమిళం, మలయాళం అన్ని చోట్ల కూడా ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లు నాకు తెలిసి.. రజినీకాంత్.. తర్వాత సమంత అనే నేను అనుకుంటున్నా” అని త్రివిక్రమ్ అన్నారు.

సమంతకు అల్లు అర్జున్ ఫ్యాన్

సమంతకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ అని త్రివిక్రమ్ చెప్పారు. ఏం మాయ చేసావే సినిమా చూడాలని అల్లు అర్జున్ తనకు అప్పట్లో చెప్పారని గుర్తు చేశారు. “సమంత అని కొత్త హీరోయిన వచ్చింది చూశారా అని ఏం మాయ చేశావే సినిమా సమయంలో అల్లు అర్జున్ ఫోన్ చేసి చెప్పారు. సమంత కోసం సినిమా చూడాలని చెప్పారు. అప్పుడు సమంతకు బన్నీ పెద్ద ఫ్యాన్” అని త్రివిక్రమ్ అన్నారు. స్త్రీలు ఎప్పుడైనా హీరోలేనని చెప్పారు.

హైదరాబాద్‍కు కూడా రండి

ముంబైలోనే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి.. మళ్లీ తెలుగు సినిమాలు చేయాలని సమంతను త్రివిక్రమ్ అడిగారు. దీంతో కథ రాస్తే తప్పకుండా చేస్తానని సమంత సైగ చేశారు. చేయరేమోనని భయంతో రాయడం లేదని త్రివిక్రమ్ అన్నారు. “బాంబేలోనే కాకుండా అప్పుడప్పుడు హైదరాబాద్‍లో జరిగే వాటికి కూడా రండి. మేం రాస్తే మీరు చేస్తారా? మీరు చేయరేమోననే భయంతో నేను రాయడం లేదు” అని త్రివిక్రమ్ అన్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అత్తారింటికి దారేది చిత్రాల్లో సమంత నటించారు.

మా ఇద్దరితో ఓ సినిమా చేయండి: ఆలియా

త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత, తాను కలిసి ఓ మూవీ చేయాలని ఉందని ఆలియా భట్ అడిగారు. “నేను ఈ విషయం ప్రమోషన్ కోసం చెప్పడం లేదు. నిజంగా అంటున్నా. త్రివిక్రమ్ మీరు రాసి, దర్శకత్వం వహించే సినిమాలో సమంత, నేను కలిసి నటించాలని అనుకుంటున్నాం” అని ఆలియా అన్నారు. సినిమాలతో పాటు బయట కూడా తనకు సమంత అంటే చాలా ఇష్టమని ఆలియా చెప్పారు.

జిగ్రా మూవీలో ఆలియా భట్ యాక్షన్ సీక్వెన్సులు కూడా చేశారు. ఈ మూవీకి వాసన్ బాలా దర్శకత్వం వహించారు. విదేశాల్లో జైలు పాలైన తమ్ముడిని కాపాడుకునేందుకు పోరాడే అక్క పాత్రను ఈ చిత్రంలో ఆలియా పోషించారు. ఈ చిత్రంలో ఆలియాతో పాటు వేద్‍నాగ్ రైనా, ఆదిత్య నంద, శోభితా దూళిపాళ్ల, మనోజ్ పహ్వా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ నిర్మాణంలోనూ ఆలియా భాగస్వామిగా ఉన్నారు.