Ram Charan: విమానంలో భార్య పాదాలకు మసాజ్ చేసిన రామ్‍చరణ్.. ఫ్యాన్స్ ఫిదా: వీడియో వైరల్-ram charan massages upasana feet on flight while going to anant ambani radhika marchant wedding video goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan Massages Upasana Feet On Flight While Going To Anant Ambani Radhika Marchant Wedding Video Goes Viral

Ram Charan: విమానంలో భార్య పాదాలకు మసాజ్ చేసిన రామ్‍చరణ్.. ఫ్యాన్స్ ఫిదా: వీడియో వైరల్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 02, 2024 03:48 PM IST

Ram Charan - Upasana: తన భార్య ఉపాసన పాదాలకు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ మసాజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. నెటిజన్లు స్పందిస్తున్నారు.

Ram Charan: విమానంలో భార్య పాదాలకు మసాజ్  చేసిన రామ్‍చరణ్.. ఫ్యాన్స్ ఫిదా
Ram Charan: విమానంలో భార్య పాదాలకు మసాజ్  చేసిన రామ్‍చరణ్.. ఫ్యాన్స్ ఫిదా

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍కు విపరీతమైన స్టార్ డమ్ ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్‍బాస్టర్ అవడంతో ఏకంగా ఆయన గ్లోబల్ స్టార్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తనయుడు అంటూ ప్రశంసలు తెచ్చుకుంటున్నారు. తన భార్య ఉపాసన అంటే ఎంత ప్రేమో గతంలో చాలాసార్లు చెప్పారు చరణ్. కాగా, రామ్ చరణ్, ఉపాసన ఎంత అన్యూన్యంగా ఉంటారో తాజాగా మరోసారి నిరూపితమైంది.

దేశంలోనే అత్యంత ధనవంతుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకలు గుజరాత్‍లోని జామ్‍నగర్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా చాలా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. రామ్‍చరణ్, ఉపాసన కూడా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకకు వెళ్లారు. ప్రత్యేక విమానంలో రామ్‍చరణ్ దంపతులు జామ్‍నగర్ చేరుకున్నారు.

పాదాలకు మసాజ్

అయితే, విమానంలో ఉపాసన పాదాలకు రామ్‍చరణ్ తన చేతులతో మసాజ్ చేసిన వీడియో బయటికి వచ్చింది. విమానంలో తన సీట్లో నిద్రించిన ఉపాసన.. తన ఎదురుగా ఉన్న రామ్‍చరణ్‍పై కాలు మోపారు. ఆ సమయంలో రామ్‍చరణ్ ఉపాసన పాదాన్ని నొక్కారు. ఉపాసన అలసటగా ఉందని గుర్తించి.. పాదానికి మసాజ్ చేశారు చెర్రీ.

ఉపాసన పాదానికి రామ్‍చరణ్ మసాజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బయటికి వచ్చింది. దీంతో విపరీతంగా వైరల్ అవుతోంది. భార్యపై అమితమైన ప్రేమ చూపిన రామ్‍చరణ్‍ను అభిమానుల అభినందిస్తున్నారు. వారిద్దరూ బెస్ట్ దంపతులు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చెర్రీకి బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇవ్వాల్సిందనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచానికి గ్లోబల్ స్టార్ అయినా.. భార్యకు భర్తేగా అంటూ మరికొందరు సరదాగా ఈ వీడియోకు స్పందిస్తున్నారు. రామ్‍చరణ్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు. తమకు ఇలాంటి భర్తే రావాలని కొందరు అమ్మాయిలు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా నెట్టింట ఈ వీడియోలో వైరల్ అవుతోంది.

రామ్‍చరణ్, ఉపాసనకు 2012 జూన్‍లో వివాహం అయింది. గతేడాది వీరికి కుమార్తె జన్మించారు. ఆమెకు కొణిదెల క్లీంకార అని పేరు పెట్టారు ఈ దంపతులు.

కాగా, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం అత్యంత ఘనంగా జరుగుతోంది. మార్చి 1 నుంచి మార్చి 3వ తేదీన వరకు వేడుకలు జరగనున్నాయి. మెటా (ఫేస్‍బుక్) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‍గేట్స్ సహా అనేక రంగాలకు చెందిన చాలా మంది ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. సినీ సెలెబ్రిటీలు, వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు.. ఇలా చాలా మంది స్టార్లు ఈ వివాహ వేడుకల్లో పాల్గొంటున్నారు.

గేమ్ చేంజర్ కోసం నిరీక్షణ

రామ్‍చరణ్ అభిమానులు ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చెర్రీ చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు బోలెడు ఉన్నాయి. అయితే, గేమ్ చేంజర్ మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, షూటింగ్ మాత్రం వేగంగా సాగడం లేదు. దీంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఇంకా స్పష్టత లేదు. గేమ్ చేంజర్ సినిమా నుంచి ఇంకా ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు. అయితే, ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. గేమ్ చేంజర్ మూవీకి దిల్‍రాజు నిర్మాతగా ఉండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు.

IPL_Entry_Point