Ram Charan Daughter Name: రామ్‍చరణ్ కూతురు పేరు ఇదే.. ప్రకటించిన ఉపాసన-ramcharan tej upasana names their daughter klin kara konidela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Daughter Name: రామ్‍చరణ్ కూతురు పేరు ఇదే.. ప్రకటించిన ఉపాసన

Ram Charan Daughter Name: రామ్‍చరణ్ కూతురు పేరు ఇదే.. ప్రకటించిన ఉపాసన

Ram Charan Daughter Name: తమ కూతురికి పెట్టిన పేరును ప్రకటించారు రామ్‍చరణ్, ఉపాసన. మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక నేడు ఘనంగా జరిగింది.

కూతురితో రామ్‍చరణ్, ఉపాసన, ఇరువురి కుటుంబాల పెద్దలు

Ram Charan Daughter Name: స్టార్ హీరో రామ్‍చరణ్ తేజ్, ఉపాసన దంపతుల కూతురు బారసాల వేడుక నేడు ఘనంగా జరిగింది. తమ కూతురికి ‘క్లీంకార కొణిదెల’ (Klin Kaara Konidela) అని నామకరణం చేశారు రామ్‍చరణ్, ఉపాసన. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. లలితా సహస్ర నామం నుంచి ఈ పేరును ఎంపిక చేసుకొని తమ కూతురికి పెట్టినట్టు పేర్కొన్నారు. జూన్ 20వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చారు ఉపాసన. నేడు బారసాల వేడుక జరిగింది. మెగా ప్రిన్సెస్‍కు 'క్లీం కార' అని పేరు పెట్టినట్టు ట్వీట్ చేశారు ఉపాసన. మెగాస్టార్ చిరంజీవి, పాప తాతయ్య కూడా తన మనువరాలి పేరు గురించి ట్వీట్ చేశారు.

క్లీంకార పేరును లలితా సహస్రనామం నుంచి తీసుకున్నట్టు పేర్కొన్నారు ఉపాసన. “ ఈ పేరును లలితా సహస్రనామం నుంచి తీసుకున్నాం. ఆధ్యాత్మికతను మేలుకొలిపే పరివర్తనను, స్వచ్ఛమైన శక్తిని ఈ పేరు సూచిస్తుంది” అని ఉపాసన ట్వీట్ చేశారు. అలాగే.. తమ కూతురితో తమ ఇరు కుటుంబాల పెద్దలు దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. క్లీంకార పేరు ప్రకృతి స్వరూపాన్ని, అమ్మవారి శక్తిని సూచిస్తుందని చిరంజీవి ట్వీట్ చేశారు. 

జూన్ 20వ తేదీన జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చారు ఉపాసన. దీంతో మెగా కుటుంబంతో పాటు సంబరాలు మొదలయ్యాయి. తమ కూతురికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నామో ఇప్పటికే నిర్ణయించుకున్నామని ఉపాసన డిశ్చార్జ్ సమయంలోనే రామ్‍చరణ్ చెప్పాడు. కాగా, నేడు మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కొణిదెల, కామినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూతురు పేరును ఉపాసన ప్రకటించారు. రామ్‍చరణ్ - ఉపాసనకు 2012లో వివాహమైంది. 

కాగా, రామ్‍చరణ్ కూతురు బారసాల కోసం ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ బంగారు ఊయలను ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఇది నిజం కాదని రామ్‍చరణ్ టీమ్ వెల్లడించింది. ప్రజ్వల ఫౌండేషన్ తయారు చేసిన చెక్క ఊయతోనే బారసాల చేసినట్టు పేర్కొంది.