Salaar 2: సలార్ పార్ట్ 2 షూటింగ్‍ మొదలయ్యేది ఎప్పుడో చెప్పిన నటుడు-prabhas prashanth neel salaar part 2 shouryaanga parvam shooting will start in april says bobby simha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar 2: సలార్ పార్ట్ 2 షూటింగ్‍ మొదలయ్యేది ఎప్పుడో చెప్పిన నటుడు

Salaar 2: సలార్ పార్ట్ 2 షూటింగ్‍ మొదలయ్యేది ఎప్పుడో చెప్పిన నటుడు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 03, 2024 09:06 PM IST

Salaar Part 2: Shouryaanga Parvam: సలార్ పార్ట్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలుకానుందో నటుడు బాబీ సింహా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Salaar 2: సలార్ పార్ట్ 2 షూటింగ్‍ మొదలయ్యేది ఎప్పుడో చెప్పిన నటుడు
Salaar 2: సలార్ పార్ట్ 2 షూటింగ్‍ మొదలయ్యేది ఎప్పుడో చెప్పిన నటుడు

Salaar Part 2 Shooting: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్’ సినిమా బ్లాక్‍బస్టర్ అయింది. గత డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ భారీ వసూళ్లను సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సుమారు రూ.750కోట్ల వసూళ్లతో సత్తాచాటింది. సలార్ క్లైమాక్స్‌లో ఆసక్తికరమైన ప్రశ్నలను మేకర్స్ మిగిల్చారు. దీంతో పార్ట్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సలార్ పార్ట్ 2 చిత్రానికి ‘శౌర్యాంగ పర్వం’ అని టైటిల్‍ను కూడా మూవీ టీమ్ ఇప్పటికే ఖరారు చేసింది. తాను శౌర్యంగ అని దేవ (ప్రభాస్)కు తెలుసా లేదా అనేది ప్రేక్షకుల్లో పెద్ద ప్రశ్న మిగిలి ఉంది. ప్రాణ స్నేహితులైన దేవ, వరదరాజ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య యుద్ధం కూడా రెండో భాగంలో ఉండనుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. దీంతో సలార్ పార్ట్-2 ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంపై కీలక అప్‍డేట్ వెల్లడించారు నటుడు బాబీ సింహా.

షూటింగ్ అప్పటి నుంచే..

తాను చేస్తున్న సినిమాలు ఏవనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో బాబీ సింహాకు ఎదురైంది. దీంతో ఆయన లైనప్ చెప్పారు. దీంతో సలార్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలుకావొచ్చనే క్వశ్చన్ వచ్చింది. దీంతో.. ఈ ఏడాది ఏప్రిల్‍లోనే సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలుపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వెల్లడించారు.

సలార్ పార్ట్ 2 షూటింగ్ ఏప్రిల్‍లో మొదలవుతుందని బాబీ సింహా చెప్పడంతో ప్రభాస్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఇలా అయితే వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కావడం పక్కా అని భావిస్తున్నారు. శౌర్యంగ తెగకు చెందిన భారవ పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు బాబీ.

సలార్ మూవీలో శృతి హాసన్, జగపతి బాబు, శ్రీయారెడ్డి, టిన్నూ ఆనంద్, దేవరాజ్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవిబస్రూర్ సంగీతం అందించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సలార్ పార్ట్ 2 సినిమా షూటింగ్ ఏప్రిల్‍లో మొదలైనా షూటింగ్‍లో కొన్ని రోజుల తర్వాతే ప్రభాస్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ మూవీని కూడా ప్రభాస్ చేస్తున్నారు.

ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం మే 9వ తేదీన రిలీజ్ కానుంది. భారీ వీఎఫ్‍ఎక్స్‌తో గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు నాగ్‍అశ్విన్. ఈ సినిమాపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. చెప్పిన సమయానికే రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవల బలమైన సంకేతాలు కూడా ఇచ్చారు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ కీలకపాత్రలు పోషించారు.

WhatsApp channel