Kalki 2898 AD Trailer: ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేది ఆరోజే.. బిగ్ సర్‌ప్రైజ్.. ఇంకెంత టైమ్ ఉందంటే?-prabhas kalki 2898 ad trailer released on june 10 and release new poster kalki 2898 ad trailer date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad Trailer: ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేది ఆరోజే.. బిగ్ సర్‌ప్రైజ్.. ఇంకెంత టైమ్ ఉందంటే?

Kalki 2898 AD Trailer: ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేది ఆరోజే.. బిగ్ సర్‌ప్రైజ్.. ఇంకెంత టైమ్ ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Jun 05, 2024 10:57 AM IST

Kalki 2898 AD Trailer Release Date: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇది అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ కానుంది. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత కల్కి 2898 ఏడీ ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించడం విశేషంగా మారింది.

ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేది ఆరోజే.. బిగ్ సర్‌ప్రైజ్.. ఇంకెంత టైమ్ ఉందంటే?
ప్రభాస్ కల్కి 2898 ఏడీ ట్రైలర్ వచ్చేది ఆరోజే.. బిగ్ సర్‌ప్రైజ్.. ఇంకెంత టైమ్ ఉందంటే?

Kalki 2898 AD Trailer: రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న డార్లింగ్ ప్రభాస్ నుంచి రానున్న మరో క్రేజీ సినిమా కల్కి 2898 ఏడీ. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఎలక్షన్స్ ఫలితాల రోజున (జూన్ 4) కల్కి 2898 ఏడీ నుంచి అప్డేట్ రానుందని మేకర్స్ ట్విటర్ వేదికగా ప్రకటించారు.

జూన్ 5న ఉదయం పది గంటలకు కల్కి 2898 ఏడీ నుంచి అప్డేట్ రానుంది అని ఎక్స్ వేదికగా తెలిపారు. చెప్పినట్లుగానే ఇవాళ బుధవారం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఎప్పటి నుంచో ఊరిస్తున్న కల్కి 2898 ఏడీ ట్రైలర్‌ రిలీజ్ డేట్‌పై అధికారికంగా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్‌ను జూన్ 10న అంటే సోమవారం రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, ఇందులో టైమ్ మాత్రం చెప్పలేదు.

ఈ ట్రైలర్ విడుదలకు భారీ ఈవెంట్ పెట్టి బిగ్ సర్‌ప్రైజ్ చేస్తారా.. లేదా సోషల్ మీడియాలో నార్మల్‌గా విడుదల చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసే వీడియోకే అంతపెద్ద ఈవెంట్ నిర్వహించి వైజయంతీ మూవీస్ సంస్థ కోట్లాది ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ ట్రైలర్‌కు భారీ ఎత్తునే కార్యక్రమం నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఇకపోతే ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఎత్తైన ఇసుక దిబ్బపై ప్రభాస్ నిల్చున్నాడు. ఓవైపు తీక్షణంగా చూస్తున్నాడు. ప్రభాస్ చూసేది సినిమాలో భైరవ డ్రీమ్ అయిన కాంప్లెక్స్ సిటీ అని తెలుస్తోంది. ఇక వెనుకాల ఎత్తైన బిల్డింగ్‌లతో పోస్టర్ చాలా క్రేజీగా ఉంది. ఈ పోస్టర్, కల్కి ట్రైలర్ రిలీజ్ డేట్ నెట్టింట్లో అప్పుడే వైరల్ అయిపోయింది.

అయితే, ఈపాటికే కల్కి 2898 ఏడీ మూవీ విడుదల కావాల్సింది. ఇప్పటికే ఎన్నోసార్లు కల్కి విడుదల తేది వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నికల ముందు కూడా సినిమా విడుదల చేస్తామని ఓ డేట్ కూడా ఇచ్చినప్పటికీ అదే ఎలక్షన్స్ వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఎన్నికలు ముగిశాక జూన్ 27న సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ఎలక్షన్ ఫలితాలు రావడంతో సినిమా ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు.

ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత కల్కి 2898 ఏడీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం విశేషంగా మారింది. ఎందుకంటే ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీతో గెలుపొందింది. గతంలో కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వనీదత్ అనేకసార్లు కూటమికి సపోర్ట్‌గా కామెంట్స్ చేశారు. ఇప్పుడు కూటమి విజయం సాధించడంతో కల్కి ట్రైలర్ అనౌన్స్‌మెంట్ చేశారు.

కల్కి 2898 ఏడీ ట్రైలర్ విడుదలకు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. మరి ఈ ట్రైలర్ సినిమాపై ఇంకెన్ని అంచనాలు పెంచుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్స్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ విలన్‌గా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో అలరించేందుకు రెడీగా ఉన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024