Kalki 2898 AD OTT: ఓటీటీలో గ్లోబల్ ట్రెండింగ్ టాప్‍లో కల్కి 2898 ఏడీ.. దూసుకెళుతున్న ప్రభాస్ సినిమా
Kalki 2898 AD OTT: కల్కి 2898 ఏడీ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఆరంభం నుంచి భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. ఇంకా అదరగొడుతోంది. ఇప్పుడు ఏకంగా గ్లోబల్ లిస్టులో టాప్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా భారీ హిట్ సాధించింది. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఈ మూవీ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమా అద్భుతంగా ఉందనే పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపింది. ఇప్పుడు ఓటీటీలోనూ కల్కి 2898 ఏడీ సినిమా దూసుకెళుతోంది. గ్లోబల్ రేంజ్‍లో సత్తాచాటి టాప్ ప్లేస్‍కు చేరింది.
గ్లోబల్‍లో టాప్
కల్కి 2898 ఏడీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 22న స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ సినిమా మొదటి నుంచే భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. గ్లోబల్ రేంజ్‍లోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. భారత్ మాత్రమే కాకుండా చాలా దేశాల్లోనూ భారీగా వ్యూస్ సాధిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నాన్-ఇంగ్లిష్ సినిమాల విభాగంలో గ్లోబల్ ట్రెండింగ్‍లో కల్కి చిత్రం టాప్ ప్లేస్‍కు వచ్చేసింది.
కల్కి 2898 ఏడీ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చి రెండు వారాలైన భారీగా వ్యూస్ సాధిస్తూ దూసుకెళుతోంది. నానాటికీ గ్లోబల్‍గా రీచ్ పెరుగుతోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హిందీలో ఒక్కటే వచ్చినా అంచనాలకు మించి వ్యూస్ సాధిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా ఏకంగా గ్లోబల్‍గా ఇప్పటి వరకు 7.1మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. నాన్-ఇంగ్లిష్ కేటగిరీలో ప్రస్తుతం గ్లోబల్ టాప్‍లో ఉంది.
కల్క 2898 ఏడీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఇండియాలో ఇంకా టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఒమన్, శ్రీలంక, యూఏఈ సహా మొత్తంగా 11 దేశాల్లో ఈ చిత్రం ఇంకా టాప్-10లో ట్రెండింగ్ అవుతోంది.
ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్
కల్కి 2898 ఏడీ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలోనూ భారీ వ్యూస్ దక్కించుకుంటోంది.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. సస్వత ఛటర్జీ, దిశా పటానీ, పశుపతి, శోభన, రాజేంద్ర ప్రసాద్, అన్నా బెన్ కీలకపాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్ సహా మరికొందరు క్యామియో రోల్స్‌లో కనిపించారు.
కల్కి 2898 ఏడీ సినిమా ఈ ఏడాది జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచే పాజిటివ్ టాక్‍తో భారీ కలెక్షన్లు దక్కించుకుంది. తెలుగు, హిందీల్లో భారీ వసూళ్లు దక్కించుకుంది. తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్లు కూడా మంచి కలెక్షన్లు సాధించాయి. మొత్తంగా ఈ మూవీ సుమారు రూ.1,200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
మహాభారతం స్ఫూర్తితో డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా కల్కి 2898ఏడీని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఈ మూవీకి సంతోషన్ నారాయణ్ సంగీతం అందించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్‍తో అశ్వినీదత్ నిర్మించారు. కల్కికి సీక్వెల్ కూడా రానుంది.