Kalki Day 4 Collection: 4వ రోజు ప్రభాస్ ప్రభంజనం.. రూ. 500 కోట్లు కొల్లగొట్టిన కల్కి మూవీ-prabhas kalki 2898 ad 4 days worldwide box office collection and reached to 500 cr kalki box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki Day 4 Collection: 4వ రోజు ప్రభాస్ ప్రభంజనం.. రూ. 500 కోట్లు కొల్లగొట్టిన కల్కి మూవీ

Kalki Day 4 Collection: 4వ రోజు ప్రభాస్ ప్రభంజనం.. రూ. 500 కోట్లు కొల్లగొట్టిన కల్కి మూవీ

Sanjiv Kumar HT Telugu
Jul 01, 2024 11:37 AM IST

Kalki 2898 AD Box Office Collection Day 4: ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీలా విరుచుకుపడుతుంది. కల్కి 2898 ఏడీ సినిమాకు 4వ రోజున ఇండియాతోపాటు వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో ఇక్కడ తెలుసుకుందాం.

4వ రోజు ప్రభాస్ ప్రభంజనం.. రూ. 500 కోట్లు కొల్లగొట్టిన కల్కి మూవీ
4వ రోజు ప్రభాస్ ప్రభంజనం.. రూ. 500 కోట్లు కొల్లగొట్టిన కల్కి మూవీ

Kalki 2898 AD 4 Days Collection: ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర తారలు నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది.

పెరిగిన కలెక్షన్స్

ఇక నాలుగో రోజైన ఆదివారం నాడు గత రెండు మూడు రోజుల కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. భారతదేశంలో కల్కి సినిమాకు 4వ రోజున రూ. 85 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి. అంటే తొలి రోజున వచ్చిన 95 కోట్లతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ 2, 3 రోజుల కంటే ఎక్కువగా ఉంది. అంటే ఆదివారం రోజున కల్కికి కలెక్షన్స్ మరింతగా పెరిగినట్లు అర్థం చేసుకోవచ్చు.

4వ రోజు భాషల వారీగా

ఈ 85 కోట్లల్లో తెలుగు నుంచి రూ. 36.8 కోట్లు, తమిళంలో 5.5 కోట్లు, హిందీ నుంచి ఎక్కువగా రూ. 39 కోట్లు, కర్ణాటక నుంచి 70 లక్షలు, మలయాళం నుంచి రూ. 3 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఇక 4 రోజులకు కలిపి ఇండియాలో మొత్తంగా రూ. 302.4 కోట్ల వరకు నెట్ ఇండియా కలెక్షన్స్ రాబట్టింది కల్కి 2898 ఏడీ మూవీ.

కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్

ఈ 302 కోట్లల్లో తెలుగు భాషలో రూ. 162.1 కోట్లు, తమిళం-18 కోట్లు, హిందీ-110.5 కోట్లు, కర్ణాటక-1.8 కోట్లు, మలయాళం నుంచి 9.7 కోట్ల కలెక్షన్స్ వసూలు అయ్యాయి. సో కల్కికి ఇండియా డొమెస్టిక్ కలెక్షన్స్ రూ. 300 కోట్లకుపైగా వచ్చాయి. అలాగే కల్కి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 4 రోజుల్లో రూ. 500 కోట్ల వరకు వచ్చినట్లుగా ప్రముఖ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు.

మరి వీక్ డేస్‌లో

కల్కి 2898 ఏడీ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 415 కోట్లు కొల్లగొట్టగా.. 4 రోజుల్లో రూ. 500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. వీకెండ్స్ కాబట్టి కలెక్షన్స్ అదిరిపోయాయి. మరి వీక్ డేస్‌లో కూడా ఈ సినిమా సక్సెస్ ఫుల్ రన్‌ను కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి. కాగా కల్కి 2898 ఏడీ దక్షిణాది భాషలన్నింటిలోనూ, హిందీలోనూ 2డీ, 3డీలో విడుదలైంది.

డే బై డే కలెక్షన్స్

ఇదిలాఉంటే, కల్కి సినిమాకు ఇండియాలో తొలి రోజు రూ. 95.3 కోట్లు, 2వ రోజున రూ. 57. 6 కోట్లు, 3వ రోజున రూ. 64.5 కోట్లు వచ్చాయి. ఇక నాలుగో రోజున ఈ చిత్రానికి తెలుగులో 84.24 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ పాత్ర చేయగా అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టారు.

WhatsApp channel