Krishna Role In Kalki: కల్కి మూవీలో కృష్ణుడిగా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా?
Kalki 2898 AD Krishna Role Actor Krishna Kumar Aka KK: ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీలో కృష్ణుడుగా ఎవరు నటించారనే విషయం విశేషంగా మారింది. ఈ నేపథ్యంలో కల్కిలో కృష్ణుడిగా నటించింది తమిళ యాక్టర్ అయిన కృష్ణ కుమార్ అకా కేకే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు.

Krishna Role Actor In Kalki 2898 AD: ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డ్స్ మినహా మిగతా సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేసింది. దాంతో అత్యధిక భారీ ఓపెనింగ్స్ అందుకున్న మూడో సినిమాగా కల్కి 2898 ఏడీ నిలిచింది.
ఎన్నో అంచనాలతో జూన్ 27న విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా ఫుల్ పాజిటివ్ టాక్ అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అగ్ర తారలు నటించిన ఈ సినిమాకు ప్రశంసలు వస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల నెగెటివ్ టాక్ కూడా వస్తోంది. కానీ, ఈ సినిమాలో మహాభారతంకు సంబంధించిన సీన్స్ అదిరిపోయాయని, విజువల్స్ చాలా రిచ్‌గా, అట్రాక్టివ్‌గా ఉన్నాయని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, కల్కి సినిమాలో మహాభారతానికి సంబంధించిన సీన్స్ బాగానే పడ్డాయి 3 గంటల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాలో మహాభారతం సన్నివేశం అరగంటపాటు చూపించారు. ఇందులో అశ్వత్ధామ, అర్జునుడు, కర్ణుడు పాత్రలతోపాటుగా కృష్ణుడి పాత్రను కూడా చూపించారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటిస్తే.. అర్జునుడిగా విజయ్ దేవరకొండను చూపించారు. కానీ, కృష్ణుడు ఎవరనేది మాత్రం చూపించలేదు.
కృష్ణుడి పాత్రలో చేసిన నటుడు శరీరాన్ని చూపించారు. కానీ, ఆయన మొహన్ని మాత్రం సరిగా చూపించలేదు. దాన్ని ఒక నీడల చూపించారు. దీంతో ఆ పాత్ర ఎవరు చేశారనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కల్కిలో కృష్ణుడిగా చేసిన నటుడు ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
కల్కి 2898 ఏడీ సినిమాలో కృష్ణుడిగా నటించింది. తమిళ నటుడు అయిన కృష్ణకుమార్ సుబ్రమణియమ్. అతన్నే కేకే అని కూడా పిలుస్తుంటారు. ఇతను సూర్య బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆకాశమే హద్దురాలో నటించారు. ఇందులో సూర్యకు స్నేహితుడుగా కృష్ణకుమార్ నటించారు. కృష్ణకుమార్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీతదర్శకుడుగా పాపులర్.
ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కల్కి సినిమాలో కృష్ణ పరమాత్ముడి పాత్రలో నటించడంతో కృష్ణ కుమార్ మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అయితే, ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టా గ్రామ్ హ్యాండిల్‌లో చెప్పుకొచ్చారు. కల్కిలో కృష్ణుడిగా నటించడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.
కాగా కృష్ణుడిగా నటించిన కృష్ణ కుమార్‌కు తెలుగులో ప్రముఖ నటుడు అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పారు. అర్జున్ దాస్ పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, కల్కి విడుదలకు ముందు కృష్ణుడిగా స్వర్గీయ నందమూరి తారకరామారావును చూపించనున్నారని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
డీప్ ఫేక్, ఏఐ టెక్నాలజీని వాడి కృష్ణుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్‌ను చూపించాలనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ, అనుకోని కారణాల వల్ల ఆ పాత్ర మొహన్ని చూపించకుండా నీడలాగా చూపించేశారు. అయితే, కల్కి నిర్మాత సి అశ్వనీదత్ సీనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. అంతేకాకుండా ఆయన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పేరును అశ్వనీదత్‌కు సజెస్ట్ చేసింది కూడా ఎన్టీఆరే.
అలాగే వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ఎన్టీఆర్ కృష్ణుడిగా ఉన్న ఫొటోనే ఉంటుంది. ఈ గౌరవం, అభిమానంతోనే కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్‌ను చూపించాలని మొదట అనుకున్నారు. కానీ, అది కుదరలేదు. కృష్ణుడిగా ఎన్టీఆర్‌ను తప్పా ఇంకెవరినీ ఊహించుకోవడం ఇష్టంలేకే అలా ముఖం చూపించకుండా నీడతో మేనేజ్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది.