Pawan - Chiranjeevi: చిరూ, పవన్‍ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న ప్రధాని.. ఎమోషనల్ అవుతున్న మెగా ఫ్యాన్స్: వీడియో-pm narendra modi greets and hugs chiranjeevi and pawan kalyan fans getting emotional ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan - Chiranjeevi: చిరూ, పవన్‍ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న ప్రధాని.. ఎమోషనల్ అవుతున్న మెగా ఫ్యాన్స్: వీడియో

Pawan - Chiranjeevi: చిరూ, పవన్‍ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న ప్రధాని.. ఎమోషనల్ అవుతున్న మెగా ఫ్యాన్స్: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 12, 2024 01:57 PM IST

Pawan Kalyan - Chiranjeevi: చిరంజీవి, పవన్ కల్యాణ్‍ను ప్రధాని మోదీ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఇద్దరినీ అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pawan Kalyan - Chiranjeevi: చిరు, పవన్‍ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న ప్రధాని.. ఎమోషనల్ అవుతున్న మెగా ఫ్యాన్స్: వీడియో
Pawan Kalyan - Chiranjeevi: చిరు, పవన్‍ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న ప్రధాని.. ఎమోషనల్ అవుతున్న మెగా ఫ్యాన్స్: వీడియో

Pawan Kalyan - Chiranjeevi: అన్నదమ్ములు మెగాస్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం అపూర్వంగా ఉంటుంది. తమ్ముడిపై చిరూ ఎనలేని ఆప్యాయత చూపితే.. అన్నపై పవన్ చాలా గౌరవం చూపిస్తుంటారు. నేడు (జూన్ 12) జరిగిన ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ అన్నదమ్ముల అపూర్వమైన అనుబంధం మరోసారి అందరినీ ఆకట్టుకుంది. కాగా.. చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‍ను ప్రధాని మోదీ ఆప్యాయంగా దగ్గర తీసుకోవడం ఈ కార్యక్రమానికి హైలైట్‍గా నిలిచింది.

చేతులు కలిపి.. అభివాదం చేస్తూ..

ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చిరంజీవి, పవన్ కల్యాణ్ చేతులు పట్టుకొని మరీ వేదిక మధ్యకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ముగ్గురూ చేతులు కలిపి ప్రేక్షకులను అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరినీ దగ్గరికి తీసుకొని మోదీ అభినందించారు. సంతోషంగా మాట్లాడారు. ఆ సమయంలో చిరంజీవి, పవన్ ఉద్వేగానికి లోనయ్యారు. పవన్‍ గడ్డంపై చేయి వేసి ఆప్యాయత చూపారు చిరూ. వేదిక కింద నుంచి చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కూడా ఈ దృశ్యాలను చూసి ఎమోషనల్ అయ్యారు.

మెగా బ్రదర్స్‌ చిరూ, పవన్‍ను ప్రధాని మోదీ అభినందిస్తూ కలిసి అభివాదం చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఈ వీడియో చూసి మెగా అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి కష్టానికి తగిన ప్రతిఫలం ఇది అంటూ రాసుకొస్తున్నారు. అద్భుతమైన దృశ్యం అంటూ ఆనందిస్తున్నారు. ఈ వీడియోను జనసేన పార్టీ కూడా ట్వీట్ చేసింది. తెలుగు రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్భుత ఘట్టం అంటూ పోస్ట్ చేసింది.

మంత్రిగా ప్రమాణం చేసిన పవన్

పిఠాపురం నుంచి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు మంత్రి పదవి దక్కింది. దీంతో మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. ‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను’ అని పవన్ అనగానే ఆ ప్రాంగణం ప్రేక్షకుల హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. ఎప్పటి నుంచో వేచిచూసిన తరుణం కావడంతో పవర్ స్టార్ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.

అన్నకు పాదాభివందనం

ప్రమాణ స్వీకారానికి ముందు చిరంజీవి కాళ్లకు వేదికపైనే నమస్కరించారు పవన్ కల్యాణ్. అన్నపై తనకు ఉన్న గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర విశిష్ట అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. మెగాపవర్ స్టార్, ఆయన కుమారుడు రామ్‍చరణ్‍తో పాటు మెగా కుటుంబ సభ్యులు చాలా మంది ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.

సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రం చేస్తున్నారు. ఈ మూవీకి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ లైనప్‍లో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. ముందుగా ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను పవర్ స్టార్ పూర్తి చేయనున్నారు. మరికొన్ని వారాల్లో ఆయన ఓజీ షూటింగ్‍లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఓజీ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.

WhatsApp channel