AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - ప్రమాణస్వీకారం వేళ దద్దరిల్లిపోయిన ప్రాంగణం-pawan kalyan took oath as ap deputy cm ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Deputy Cm Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - ప్రమాణస్వీకారం వేళ దద్దరిల్లిపోయిన ప్రాంగణం

AP Deputy CM Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ - ప్రమాణస్వీకారం వేళ దద్దరిల్లిపోయిన ప్రాంగణం

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 12, 2024 12:44 PM IST

AP Deputy CM Pawan Kalyan Oath Ceremony: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. పవన్ ప్రమాణస్వీకారం వేళ ప్రాంగణమంతా కార్యకర్తలు, అభిమానులతో నినాదాలతో దద్దరిల్లిపోయింది.

డిప్యూటీ సీఎంగా పవన్
డిప్యూటీ సీఎంగా పవన్

AP Deputy CM Pawan Kalyan Oath: ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఉదయం 11.30 తర్వాత చంద్రబాబు సీఎంగా ప్రమాణ చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చేయించారు.

‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను’ అని పవన్ అనగానే… వేదిక ప్రాంగణమంతా నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు చిరంజీవి, రజినీకాంత్ హాజరయ్యారు.

జనసేన పార్టీ నుంచి చంద్రబాబు కేబినెట్ లో ముగ్గురికి చోటు దక్కింది. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కు అవకాశం రాగా…. మంత్రిగా నాదెండ్ల మనోహర్ తో పాటు కందుల దుర్గేష్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ఇద్దరు కాపు, ఒకరు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు ఉన్నారు. జనసేన తరపున గెలిచిన కొణ‌తాల రామ‌కృష్ణ (బీసీ), ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి బొలిశెట్టి శ్రీ‌నివాస‌రావు (కాపు) మంత్రి పదవులు ఆశించినప్పటికీ దక్కలేదు.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎన్డీఏ కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. అతిపెద్ద భాగస్వామ్యపక్షంగా టీడీపీ ఉంది. ఇక జనసేన 21కి 21 స్థానాల్లో జెండా ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీ మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందిన సంగతి తెలిసిందే.

ఇక పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే మొత్తం 25 స్థానాలకుగాను టీడీపీ 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది.కూటమిలో ఉన్న జనసేన 2, బీజేపీ 3 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రం నుంచి మెజార్టీ గెలుచుకున్న టీడీపీ…. అటు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ అవతరించింది. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరికి, బీజేపీ నుంచి ఒకరికి కేంద్ర కేబినెట్ లో కూడా చోటు దక్కింది. జనసేన నుంచి కేంద్ర కేబినెట్ లో ఎవరకి అవకాశం రాలేదు.

చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంలో మాత్రం… జనసేన పార్టీకి మూడు మంత్రి పదవులు దక్కాయి. ఇక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో జనసేన ఒకటి ఆశించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జనసేన తరపు గెలిచిన ఎమ్మెల్యేల జాబితా...

  1. పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌
  2. తెనాలి - నాదెండ్ల మనోహర్‌
  3. పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
  4. రాజోలు - దేవ వరప్రసాద్‌
  5. తిరుపతి - అరణి శ్రీనివాసులు
  6. రైల్వే కోడూరు - భాస్కరరావు
  7. అవనిగడ్డ - మండలి బుద్ద ప్రసాద్
  8. పాలకొండ - నిమ్మక కృష్ణ
  9. విశాఖపట్నం దక్షిణం- వంశీ కృష్ణ యాదవ్
  10. అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
  11. నరసాపురం - బొమ్మిడి నాయకర్‌
  12. ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
  13. పోలవరం - చిర్రి బాలరాజు
  14. కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ
  15. నెల్లిమర్ల - లోకం మాధవి
  16. భీమవరం - పులపర్తి ఆంజనేయులు
  17. తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్‌
  18. నిడదవోలు - కందుల దుర్గేష్‌
  19. రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
  20. పెందుర్తి - పంచకర్ల రమేష్‌ బాబు
  21. యలమంచిలి - సుందరపు విజయ్‌ కుమార్‌

Whats_app_banner