OTT Malayalam Comedy: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ కామెడీ మూవీ- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!
Malayalam Survival Comedy Movie Grrr OTT Streaming: ఇవాళ ఓటీటీలోకి మలయాళ సర్వైవల్ కామెడీ మూవీ గర్‌ర్‌ర్ వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి ఐదు భాషల్లో గర్‌ర్‌ర్ డిజిటల్ ప్రీమయిర్ అవుతోంది. మరి ఈ గర్‌ర్‌ర్ మూవీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిందో తెలుసుకుందాం.
Grrr OTT Release: మలయాళ చిత్రాలకు ఉండే క్రేజ్ వేరు. ఈ మాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలపై చాలా మంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కొత్త రకమైన కాన్సెప్ట్‌తో సరికొత్త టేకింగ్‌తో ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంటారు. అలాగే రొటీన్ స్టోరీలకు సైతం వాళ్ల ఫ్లేవర్ యాడ్ చేసి భిన్నంగా తెరకెక్కిస్తుంటారని పేరుంది.
క్యూరియాసిటీ పెంచేలా
అలా మరొ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మలయాళం నుంచి ఓ మూవీ వచ్చింది. ఆ మూవీనే గర్‌ర్‌ర్ (Grrr). జూ నుంచి తప్పించుకుపారిపోయిన సింహం నుంచి ఇద్దరు వ్యక్తులు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు అనే సీరియస్ టాపిక్‌ను కామెడీ వేలో తెరకెక్కించిన సినిమానే ఈ గర్‌ర్‌ర్. సింహం గర్జన శబ్దాన్నే టైటిల్‌గా పెట్టి మరింత ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ కలిగించారు.
సింహం బారినుంచి
గర్‌ర్‌ర్ సినిమాలో మలయాళ పాపులర్ నటుడు సూరజ్ వెంజరమూడ్, కుంచాకో బోబన్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. ఈ ఇద్దరే సింహం నుంచి బయటపడే వ్యక్తులుగా నటించారు. అయితే, విభిన్నమైన స్టోరీతో వచ్చిన ఈ గర్‌ర్‌ర్ మూవీ మలయాళంలో జూన్ 14న థియేటర్లలో విడుదలైంది. కానీ, అక్కడ బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.
ఆరు కోట్ల బడ్జెట్
రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గర్‌ర్‌ర్ సినిమా ఐదు రోజుల్లో రూ. 2.85 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. గర్‌ర్‌ర్ మూవీ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మంచి ధరకు దక్కించుకుంది. ఇటీవల ఆగస్ట్ 13న గర్‌ర్‌ర్ ఓటీటీ రిలీజ్‌పై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో
అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ ప్రకారమే ఇవాళ అంటే ఆగస్ట్ 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో గర్‌ర్‌ర్ ఓటీటీ స్టీమింగ్ అవుతోంది. అర్థరాత్రి 12 గంటల నుంచి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అది కూడా ఏకంగా ఐదు భాషల్లో గర్‌ర్‌ర్ సినిమా అందుబాటులోకి వచ్చింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో హాట్‌స్టార్‌లో గర్ర్ ఓటీటీ రిలీజ్ అయింది.
ఇతర నటీనటులు
ఇదిలా ఉంటే, ఈ గర్‌ర్‌ర్ (గర్ర్) చిత్రానికి జై కే దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సూరజ్ వెంజరమూడ్, కుంచాకో బోబన్‌తోపాటు శృతి రామచంద్రన్, అనఘ, రాజేష్ మాధవన్, మంజు పిళ్లై, శోభి తిలకన్, సెంథిల్ కృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు సినిమా బ్యానర్‌పై షాజీ నదేశన్, ఆర్య కలిసి నిర్మించారు.
తిరువనంతపురం జూలో
అలాగే గర్‌ర్‌ర్ సినిమాకు డాన్ విన్సెంట్, కాళిదాస్ మీనన్, టోనీ టార్జ్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి జయేశ్ నాయర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.. వివేక్ హర్షన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తక్కువ బడ్జెట్‌లోనే రూపొందిన గర్‌ర్‌ర్ చిత్రానికి మోస్తరుగానే కలెక్షన్స్ వచ్చాయి. కేరళలోని తిరువనంతపురం జూలో ఈ సినిమా కథ సాగుతుంది.