Suraj Revanna : ప్రజ్వల్​ రేవన్న సోదరుడు అరెస్ట్​- సూరజ్​పైనా లైంగిక దాడి కేసు..-prajwal revannas brother suraj revanna arrested over sexual assault of jd s worker ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Suraj Revanna : ప్రజ్వల్​ రేవన్న సోదరుడు అరెస్ట్​- సూరజ్​పైనా లైంగిక దాడి కేసు..

Suraj Revanna : ప్రజ్వల్​ రేవన్న సోదరుడు అరెస్ట్​- సూరజ్​పైనా లైంగిక దాడి కేసు..

Sharath Chitturi HT Telugu
Jun 23, 2024 09:58 AM IST

Suraj Revanna arrest : ప్రజ్వల్​ రేవన్న సోదరుడు, జేడీఎస్​ ఎమ్మెల్సీ సూరజ్​ రేవన్నను పోలీసులు ఆదివారం అరెస్ట్​ చేశారు. ఆయనపై లైంగిక దాడి కేసు నమోదవ్వడం ఇందుకు కారణం.

ప్రజ్వల్​ రేవన్న సోదరుడు సూరజ్​ రేవన్న..
ప్రజ్వల్​ రేవన్న సోదరుడు సూరజ్​ రేవన్న..

Suraj Revanna arrest : ప్రజ్వల్​ రేవన్న- సెక్స్​ కుంభకోణం కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబానికి మరో షాక్​! లైంగిక దాడి కేసులో ప్రజ్వల్​ రేవన్న సోదరుడు, జేడీఎస్​ ఎమ్మెల్సీ సూరజ్​ రేవన్నని కర్ణాటక పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్​ చేశారు. సూరజ్​ రేవన్న.. తనపై స్వలింగ లైంగిక దాడికి పాల్పడినట్టు ఓ పార్టీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.

సూరజ్​ రేవన్నకు వ్యతిరేకంగా.. శనివారం లైంగిక దాడి కేసు నమోదైనట్టు తెలుస్తోంది. జూన్​ 16న.. హసన్​లోని ఓ ఫామ్​ హౌజ్​లో సూరజ్​ తనపై లైంగిక దాడి చేసినట్టు ఓ జేడీఎస్​ కార్యకర్త ఫిర్యాదు చేశాడు.

ఎఫ్ఐ​ఆర్​ ప్రకారం.. 2024 లోక్​సభ ఎన్నికల సమయంలో సదరు కార్యకర్త పనితీరును చూసి సూరజ్​ రేవన్న ఇంప్రెస్​ అయ్యారు. ఫ్రీ ఉన్నప్పుడు కలవాలని రేవన్న చెప్పాడు. జూన్​ 16న హసన్​లోని గన్నికడ గ్రామంలోని ఫామ్​ హౌజ్​కి ఆ కార్యకర్తని రేవన్న పిలిపించాడు. ఆ వ్యక్తిని గదిలోకి తీసుకెళ్లి, డోర్​ లాక్​ చేశాడు. ఆ తర్వాత.. జేడీఎస్​ కార్యకర్తపై సూరజ్​ రేవన్న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి వ్యతిరేకంచింగా.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని రేవన్న హెచ్చరించారు. సహకరిస్తే.. రాజకీయాల్లో ఎదిగేందుకు మద్దతిస్తానని చెప్పారు.

Prajwal Revanna Suraj Revanna : ఈ విషయాన్ని ప్రజ్వల్​ రేవన్న సన్నిహితుడు శివుకి వివరించాడు ఆ వ్యక్తి. కానీ ఇది బయటపడకూడదని, రూ. 2కోట్ల క్యాష్​, ఉద్యోగం ఇస్తానని శివు తనకి చెప్పినట్టు ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. కానీ ప్రాణ భయంతో జూన్​ 19న హసన్​ నుంచి పారిపోయినట్టు, బెంగళూరుకు వెళ్లి డీజీకి ఫిర్యాదు చేసినట్టు ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.

తనపై వచ్చిన ఆరోపణలను సూరజ్​ రేవన్న ఖండించారు. ఆ వ్యక్తి రూ. 5 కోట్లు డిమాండ్​ చేశాడని, ఇవ్వకపోవడంతో ఇలాంటి తప్పుడు కేసులు వేస్తున్నాడని వెల్లడించారు.

అయితే.. సూరజ్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనా కేసు నమోదైంది.

Suraj Revanna case : "ఉద్యోగం కోసం ఆ జేడీఎస్​ కార్యకర్త ముందు నన్ను సంప్రదించాడు. నేను సూరజ్​ రేవన్న నెంబర్​ ఇచ్చాను. ఆ నెంబర్​ తీసుకుని.. నన్ను, సూరజ్​ని బెదిరించడం మొదలుపెట్టాడు," అని సూరజ్​ స్నేహితుడు శివకుమార్​ తెలిపాడు.

సెక్స్​ కుంభకోణం కేసులో జేడీఎస్​ మాజీ ఎంపీ ప్రజ్వల్​ రేవన్న జ్యుడీషియల్​ కస్టడీకి వెళ్లిన కొన్ని రోజులకే సూరజ్​ రేవన్నపైనా లైంగిక దాడి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

మరి తాజా పరిణామాలపై దేవెగౌడ కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం