ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు-two minor girls were sexually assaulted police registered pocso case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Jun 18, 2024 05:26 PM IST

వేసవి సెలవుల్లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి జరిగింది. ఈ దారుణ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదు నమోదు అయింది. ఈ ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో చోటు చేసుకుంది.

ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి (ప్రతీకాత్మక చిత్రం)
ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి (ప్రతీకాత్మక చిత్రం)

అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులపై లైంగికదాడి జరిగింది.‌ కీచకుడు తన మాయ మాటలతో చిన్నారులను లోబర్చుకున్నాడు. ఒకరి తరువాత మరొకరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారులపై బెదిరింపులకు కూడా దిగాడు. ఈ ఇద్దరు బాలికలపై పాల్పడిన లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి రావడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయింది. ఉదయనగర్ తండాకు చెందిని బొజ్జ నాగమల్కేశ్వరరావు స్థానికంగా కిరాణా షాపు నడుపుతున్నాడు. పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో ఇంటి వద్దే ఆడుకుంటున్న చిన్నారులపై లైంగిక ‌దాడికి పాల్పడ్డాడు.

ఇంటి వద్దే ఉన్న ఒక బాలికకు మాయ మాటలు చెప్పి దాడికి పాల్పడ్డాడు‌. మళ్లీ పది రోజులకు మరో బాలికపైన అదే విధంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే కీచకుడి బెదిరింపుల వల్ల ఆ ఇద్దరు బాలికలు ఇంట్లో చెప్పలేకపోయారు. కానీ ఆ బాలికల ప్రవర్తనలో తేడాలను గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆరా తీశారు. అయినప్పటికీ ఆ ఇద్దరు బాలికలు చెప్పడానికి భయపడ్డారు.

చివరకు బాలికలు అసలు విషయం చెప్పారు. దీంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలికలు కుటుంబ సభ్యులు నకరికల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన సత్తెనపల్లి డీఎస్పీ గురునాథ్ బాబు విచారణ జరుపుతున్నామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు.

  • రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel