OTT Best Telugu Web Series in 2024: ఈ ఏడాది తెలుగులో వచ్చిన టాప్ 8 వెబ్ సిరీస్ ఇవే.. ఎన్ని చూశారు?-ott best telugu web series in 2024 vikkatakavi bench life paruvu bahishkarana brinda on etv win sonyliv zee5 hotstar ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Best Telugu Web Series In 2024: ఈ ఏడాది తెలుగులో వచ్చిన టాప్ 8 వెబ్ సిరీస్ ఇవే.. ఎన్ని చూశారు?

OTT Best Telugu Web Series in 2024: ఈ ఏడాది తెలుగులో వచ్చిన టాప్ 8 వెబ్ సిరీస్ ఇవే.. ఎన్ని చూశారు?

Hari Prasad S HT Telugu
Dec 11, 2024 01:47 PM IST

OTT Best Telugu Web Series in 2024: ఈ ఏడాది తెలుగులో ఎన్నో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. వీటిలో చాలా వరకు ప్రేక్షకులను అలరించాయి. మరి 2024లో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో రిలీజైన టాప్ వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.

ఈ ఏడాది తెలుగులో వచ్చిన టాప్ 8 వెబ్ సిరీస్ ఇవే.. ఎన్ని చూశారు?
ఈ ఏడాది తెలుగులో వచ్చిన టాప్ 8 వెబ్ సిరీస్ ఇవే.. ఎన్ని చూశారు?

OTT Best Telugu Web Series in 2024: ఓటీటీల్లో గత కొన్నేళ్లుగా తెలుగులో రూపొందుతున్న వెబ్ సిరీస్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలా 2024లోనూ చాలా వెబ్ సిరీస్‌లే స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఈటీవీ విన్, ఆహా వీడియో, జీ5, సోనీలివ్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఆసక్తి రేపే వెబ్ సిరీస్ ఉన్నాయి. మరి వీటిలో మీరు చూడాల్సిన బెస్ట్ సిరీస్ ఏవో ఒకసారి చూద్దామా?

బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ 2024

#90's - ఈటీవీ విన్

ఈ ఏడాది వచ్చిన బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్ ఈ #90's అని చెప్పొచ్చు. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ సరదాగా సాగిపోయే ఓ ఫ్యామిలీ డ్రామా. నవ్విస్తూనే ఎమోషనల్ గా మార్చేసే ఈ సిరీస్ ను ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేయగా.. శివాజీ, వాసుకిలాంటి వాళ్లు నవ్వించారు. ఎక్కువ మంది చూసిన తెలుగు వెబ్ సిరీస్ గా కూడా ఇది నిలిచింది.

బెంచ్ లైఫ్ - సోనీలివ్

బెంచ్ లైఫ్ ఓ కార్పొరేట్ కంపెనీలో బెంచ్ నుంచి ప్రాజెక్టులోకి వెళ్లాలని, అలాగే ప్రాజెక్టు నుంచి తప్పించుకొని బెంచ్ కావాలనుకునే కొందరు ఉద్యోగుల చుట్టూ తిరిగే ఓ ఫన్నీ వెబ్ సిరీస్. రాజేంద్ర ప్రసాద్, వైభవ్ రెడ్డిలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్.. ఈ ఏడాది సెప్టెంబర్ లో సోనీలివ్ ఓటీటీలోకి అడుగుపెట్టింది.

వికటకవి - జీ5 ఓటీటీ

వికటకవి ఓ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ మధ్యే జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ కు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఓ ఊళ్లో జ్ఞాపకశక్తి కోల్పోయే వ్యక్తులు, అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు వచ్చే ప్రైవేట్ డిటెక్టివ్ చుట్టూ తిరిగే కథ ఇది. 1970ల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ లో నరేష్ అగస్త్య లీడ్ రోల్లో నటించాడు.

ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో హారర్ జానర్లో వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఓ దీవిలోకి ఆస్తుల పంపకాల కోసం వెళ్లే కొందరు వ్యక్తులు ఎదుర్కొనే భయానక సంఘటనల నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. సెప్టెంబర్ 20 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అశుతోష్ రాణా, తేజస్వి, నందులాంటి వాళ్లు నటించారు.

అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2 - ఆహా వీడియో

కార్పొరేట్ లైఫ్ చుట్టూ తిరిగే మరో వెబ్ సిరీస్ అర్థమయ్యిందా అరుణ్ కుమార్. గతేడాది తొలి సీజన్ రాగా.. ఈ ఏడాది అక్టోబర్ 31న రెండో సీజన్ వచ్చింది. ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు కూడా మంచి రివ్యూలే వచ్చాయి. అమలాపురం నుంచి హైదరాబాద్ కు వచ్చి ఐటీ ఉద్యోగం చేసుకునే అరుణ్ కుమార్ ఎదుర్కొనే సవాళ్లు చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

బహిష్కరణ - జీ5 ఓటీటీ

టాలీవుడ్ హీరోయిన్ అంజలి నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఈ బహిష్కరణ. ఇందులో పుష్ప అనే ఓ వేశ్య పాత్రలో ఆమె కనిపించింది. జీ5 ఓటీటీలో జులై 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 1990ల్లో పెద్దపల్లి అనే ఊళ్లో జరిగిన స్టోరీగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

పరువు - జీ5 ఓటీటీ

నరేష్ అగస్త్య, నివేదా పేతురాజ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పరువు. జీ5 ఓటీటీలోకి జూన్ నెలలో అడుగుపెట్టింది. పరువు హత్య నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. పెద్దోళ్లను ఎదిరించి కులాంతర వివాహం చేసుకునే జంట చాలా రోజుల తర్వాత తిరిగి సొంతూళ్లో అడుగుపెట్టి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారన్నదే ఈ సిరీస్ కథ.

సేవ్ ద టైగర్స్ - సీజన్ 2

సేవ్ ద టైర్స్ రెండో సీజన్ కూడా ఈ ఏడాది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి వచ్చింది. ప్రియదర్శి, చైతన్య, అభినవ్ గోమటంలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ తొలి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కొత్త సీజన్ కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. మూడో సీజన్ కు కూడా ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ సిద్ధమైంది.

Whats_app_banner