IMDb Most Popular Movies 2024: ఈ ఏడాది మోస్ట్ పాపులర్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. టాప్‌లో మళ్లీ ప్రభాసే..
IMDb Most Popular Movies 2024: ఐఎండీబీలో ప్రేక్షకులు ఇచ్చిన రేటింగ్ ప్రకారం 2024లో మోస్ట్ పాపులర్ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేశారు. ఈ జాబితాలో అన్ని హిందీ సినిమాలను వెనక్కి నెట్టి ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ నిలవడం విశేషం.
IMDb Most Popular Movies 2024: ప్రభాస్ మరోసారి సత్తా చాటాడు. ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) మోస్ట్ పాపులర్ మూవీస్ 2024 జాబితాలో అతడు నటించిన కల్కి 2898 ఏడీ మూవీయే అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో ఈ ఏడాది రిలీజైన ఎన్నో హిందీ, తమిళ, మలయాళ భాషల టాప్ సినిమాలను కూడా వెనక్కి నెట్టింది.
ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ 2024
ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ జాబితా బుధవారం (డిసెంబర్ 11) రిలీజైంది. టాప్ 10 పాపులర్ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాను ఇందులో భాగంగా రిలీజ్ చేశారు. సినిమాల్లో ప్రభాస్, దీపికా పదుకోన్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ తొలి స్థానంలో నిలిచింది. ఈ మూవీ తర్వాత హిందీ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ స్త్రీ2 రెండో స్థానంలో ఉంది.
ఇక విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన మంచి థ్రిల్ పంచిన మహారాజా మూవీ మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 25 మధ్య రిలీజై.. ఐఎండీబీలో కనీసం 5, అంతకంటే ఎక్కువ రేటింగ్ సాధించిన సినిమాల నుంచి టాప్ 10 మూవీస్ ను రిలీజ్ చేశారు. వీటిలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ నటించిన మూడు సినిమాలు (కల్కి 2898 ఏడీ, ఫైటర్, సింగం అగైన్) ఉండటం విశేషం.
మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్
కల్కి 2898 ఏడీ
స్త్రీ2
మహారాజా
సైతాన్
ఫైటర్
మంజుమ్మెల్ బాయ్స్
భూల్ భులయ్యా 3
కిల్
సింగం అగైన్
లాపతా లేడీస్
టాప్ 10 మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ఇవే
ఇక 2024లో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వివిధ వెబ్ సిరీస్ ల నుంచి టాప్ 10 మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ జాబితా కూడా రిలీజైంది. ఈ జాబితాలో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ గా పేరుగాంచిన హీరామండి తొలి స్థానంలో నిలిచింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఆ తర్వాత మీర్జాపూర్ సీజన్ 3, పంచాయత్ సీజన్ 3 నిలిచాయి. మొత్తంగా టాప్ 10లో మూడు ప్రైమ్ వీడియో, మూడు నెట్‌ఫ్లిక్స్, రెండు జియో సినిమా, ఒక హాట్‌స్టార్, ఒక జీ5 వెబ్ సిరీస్ ఉన్నాయి.
టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే
హీరామండి: ది డైమండ్ బజార్ (నెట్‌ఫ్లిక్స్)
మీర్జాపూర్ సీజన్ 3 (ప్రైమ్ వీడియో)
పంచాయత్ సీజన్ 3 (ప్రైమ్ వీడియో)
గ్యారా గ్యారా (జీ5 ఓటీటీ)
సిటడెల్: హనీ బన్నీ (ప్రైమ్ వీడియో)
మామ్లా లీగల్ హై (నెట్‌ఫ్లిక్స్)
తాజా ఖబర్ సీజన్ 2 (హాట్‌స్టార్)
మర్డర్ ఇన్ మాహిమ్ (జియో సినిమా)
శేఖర్ హోమ్ (జియో సినిమా)
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (నెట్‌ఫ్లిక్స్)