The Mystery of Moksha Island Review: ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ రివ్యూ - తెలుగు థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
The Mystery of Moksha Island Review: ప్రియా ఆనంద్, నందు, తేజస్వి మదివాడ, రోషన్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ సిరీస్ ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
The Mystery of Moksha Island Review: ప్రియా ఆనంద్, నందు, అషుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అనీష్ కురివిల్లా దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌ను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
మోక్ష ఐలాండ్ మిస్టరీ...
విశ్వక్‌సేన్ (అషుతోష్ రాణా) ఓ సైంటిస్ట్. పదేళ్లుగా ప్రపంచానికి దూరంగా నికోబర్ దీవుల్లోని మోక్ష ఐలాండ్‌లో సీక్రెట్‌గా ప్రయోగాలు చేస్తుంటాడు. అనుకోకుండా విమాన ప్రమాదంలో విశ్వక్‌సేన్ మరణిస్తాడు. తాను సంపాదించిన వేల కోట్ల ఆస్తిని వారసులందరికి పంచాలని విశ్వక్‌సేన్ నిర్ణయించుకున్నారని, ఆ ఆస్తి కోసం మోక్ష ఐలాండ్‌కు రావల్సిందిగా విక్కీ (నందు), ఝాన్సీ(ప్రియా ఆనంద్), మున్నా(అజయ్ కతుర్వార్)అదితితో (సోనియా అగర్వాల్) పాటు మరికొందరికి ఉత్తరాలు వస్తాయి.
ఆస్తి కోసం అతడి వారసులు అందరూ మోక్ష ఐలాండ్‌కు వస్తారు. వారం రోజులు ఐలాండ్‌లో ఉంటూ తాము పెట్టిన టెస్ట్‌లకు పాసైన వ్యక్తికే విశ్వక్‌సేన్ కంపెనీకి సీఈవో అవుతారని మాయ (అక్షర గౌడ) ప్రకటిస్తుంది. ఐలాండ్‌లో అడుగుపెట్టిన విశ్వక్ సేన్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వారి చావుల వెనుక ఉన్నది ఎవరన్నది అంతుపట్టదు. మరోవైపు వింత ఆకారంతో ఉన్న ఓ వ్యక్తి వారిని వెంటాడుతుంటాడు. ఐలాండ్ మిస్టరీని ఛేదించాలని విక్కీ, ఝాన్సీ నిర్ణయించుకుంటారు.
వారి అన్వేషణలో ఏం తేలింది? ప్రయోగాల పేరుతో విశ్వక్‌సేన్ చేసినఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు? అతడు నిజంగానే చనిపోయాడా? మోక్ష ఐలాండ్‌లో విశ్వక్ చేస్తోన్న ప్రయోగాలు ఏమిటి? అతడి ప్రయోగాల కారణంగా విక్కీ, ఝాన్సీకి ఏమైంది? మాయతో విశ్వక్‌కు ఎలాంటి సంబంధం ఉంది? ఐలాండ్‌లో అడుగుపెట్టిన వారు ఎలా చనిపోయారు? మోక్ష ఐలాండ్ నుంచి ఎంత మంది ప్రాణాలతో బయటపడ్డారు? అన్నదే ఈ సిరీస్ కథ.
బ్రెయిన్ మెమోరీ ట్రాన్స్‌ఫర్...
బ్రెయిన్ మెమోరీ ట్రాన్స్‌ఫర్ అనే కాన్సెప్ట్‌తో తెలుగులో డబుల్ ఇస్మార్ట్‌తో పాటు మరికొన్ని సినిమాలొచ్చాయి. ఈ కాన్సెప్ట్‌తోనే ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. బ్రెయిన్ మెమోరీ కాన్సెప్ట్‌కు మిస్టరీ థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ డైరెక్టర్ అనీష్ కురివిల్లా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
సస్పెన్స్ హోల్డ్...
ఆస్తి కోసం ఐలాండ్‌లో అడుగుపెట్టిన వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయన్నది చివరి వరకు థ్రిల్లింగ్‌గా సిరీస్‌లో చూపించారు. ఓ వైపు పీరియాడికల్ టచ్‌తో విశ్వక్‌సేన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ చూపిస్తూనే...ఐలాండ్‌లో కథను కొనసాగిస్తూ సస్పెన్స్‌తో హోల్డ్ చేశారు.
ఎనిమిది ఎపిసోడ్స్...
మాస్, క్లాస్...ఇలా భిన్న నేపథ్యాలతో సిరీస్‌లోని ప్రతి క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసుకున్నారు దర్శకుడు. ప్రతి క్యారెక్టర్ వెనుక ఓ తెలియని కోణాన్ని చూపించిన తీరు బాగుంది. ఐలాండ్‌లో అడుగుపెట్టిన వారిని హత్యలు ఎవరు చేస్తున్నారు? ఒకరిని మరికొరు అనుమానించే ఎపిసోడ్స్ ఉత్కంఠను పంచుతాయి. ఆరు ఎపిసోడ్స్ వరకు ఐలాండ్ గురించి అనేక ప్రశ్నలు రేకెత్తిస్తూ వచ్చిన దర్శకుడు చివరి రెండు ఎపిసోడ్స్‌లో చిక్కుముడులు మొత్తం విప్పేశాడు.
బోల్డ్...రొమాంటిక్ సీన్స్...
ఈ హత్యలు ఎలా జరిగాయనే రివీలయ్యే సీన్ మాత్రం అంతగా ఆకట్టుకోదు. అరుణ్, అతడి కొడుకు ఆకాష్ ట్రాక్ కథకు సంబంధం లేనట్లుగా అనిపిస్తుంది. లెక్కకు మించిన పాత్రలు స్క్రీన్‌పై కనిపించడంతో కథ కొన్ని చోట్ల గందరగోళంగా మారిన ఫీలింగ్ కలుగుతుంది. . రొమాంటిక్, బోల్డ్ సీన్స్‌ను కథలో కావాలనే పెట్టినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కన్వీన్సింగ్‌గా లేదు
ప్రియా ఆనంద్...నందు...
ఈ వెబ్‌సిరీస్‌లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అయితే అందరిలో ఎక్కువగా ప్రియా ఆనంద్, నందు తో పాటు అషుతోష్ రానా పాత్రలే షైన్ అయ్యాయి. ప్రియా ఆనంద్ పాత్రకు సంబంధించి చివరలో వచ్చే ట్విస్ట్ ఆదరిపోతుంది. ఐలాండ్ మిస్టరీ ఛేదించేందుకు తాపత్రయపడే యువకుడిగా నందు తన పాత్రకు న్యాయం చేశాడు.
కన్నింగ్ సైంటిస్ట్ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు అషుతోష్‌రాణా. తేజస్వి మదివాడ, అక్షర గౌడ గ్లామర్ ఆకట్టుకున్నారు. గే తరహా పాత్రలో రోషన్ కనకాల కనిపించాడు.భానుచందర్, సోనియా అగర్వాల్, అజయ్ కతుర్వార్, సత్యకృష్ణతో పాటు మిగిలిన వారి నటన పర్వాలేదనిపిస్తుంది.
కాన్సెప్ట్...మేకింగ్ వైజ్…
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కాన్సెప్ట్, మేకింగ్‌తో పాటు యాక్టింగ్ పరంగా మెప్పిస్తుంది. థ్రిల్లర్ జానర్స్‌ను ఇష్టపడే వారిని ఈ సిరీస్ మెప్పిస్తుంది.
రేటింగ్:2.75/5