Crime Thriller OTT: నాలుగు ఓటీటీల్లో కాజల్ అగర్వాల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్
Crime Thriller OTT: కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సత్య భామ ఇప్పటికే మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ మూవీ నాలుగో ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం సన్ నెక్స్ట్ ఓటీటీలో సత్యభామ మూవీ రిలీజైంది.
Crime Thriller OTT: కాజల్ అగర్వాల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సత్యభామ ఓటీటీలో అదరగొడుతోంది. ఇప్పటికే మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ తాజాగా నాలుగోఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి సన్ నెక్స్ట్ ద్వారా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది.
నాలుగు ఓటీటీల్లో...
సన్ నెక్స్ట్ కంటే ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్‌తో పాటు జియో సినిమా ఓటీటీలో సత్యభామ మూవీ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోండగా, జియో సినిమా ఓటీటీలో సత్యభామ హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది. తాజాగా సన్ నెక్స్ట్‌లో సత్యభామ తెలుగు, తమిళ వెర్షన్స్ స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
పోలీస్ ఆఫీసర్ పాత్రలో...
మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సత్యభామ మూవీతో సుమన్ చిక్కాల డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గూఢచారి దర్శకుడు శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లేను అందిస్తూనే ఈ మూవీకి ప్రజెంటర్‌గా వ్యవహరించాడు. నవీన్‌చంద్ర, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ థియేటర్లలో మోస్తారు వసూళ్లను రాబట్టింది. సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లతో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.
ట్విస్ట్‌లు ఎక్కువ కావడమే ఒకరకంగా ఈ సినిమాకు మైనస్ అయ్యింది. మర్డర్ మిస్టరీతో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అనేక అంశాలను కథలో చూపించారు డైరెక్టర్. సత్యభామ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ రోల్‌లో కాజల్ అగర్వాల్ కనిపించింది. సత్యభామ మూవీలో అంకిత్ కొయ్య, ప్రజ్వల్ యాద్మ ముఖ్య పాత్రలు పోషించారు
సత్యభామ కథ ఇదే...
సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీమ్‌లో ఏసీపీగా పనిచేస్తుంటుంది. హసీనా అనే యువతిని ఆమె భర్త యాదు చిత్రహింసలకు గురిచేస్తుంటాడు. యాదు (అనిరుధ్ పవిత్రన్) బారి నుంచి హసీనాను కాపాడేందుకు సత్యభామ చేసిన ప్రయత్నాలు ఫెయిలవుతాయి. భర్త చేతిలో హసీనా దారుణ హత్యకు గురువుతుంది.హత్య జరిగిన అనంతరం హసీనా భర్త యాదుతో పాటు ఆమె తమ్ముడు ఇక్భాల్ (ప్రజ్వల్ యాద్మ) కనిపించకుండాపోతారు.
హసీనాను చంపిన యాదును పట్టుకోవడంతో పాటు ఆమె తమ్ముడు ఇక్బాల్ మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఛేదించే క్రమంలో సత్యభామకు ఎలాంటి నిజాలు తెలిశాయి? సత్యభామ ఇన్వేస్టిగేషన్‌లోకి ఎంపీ కొడుకు రిషి (అంకిత్ కొయ్య)ఎందుకొచ్చాడు?సత్యభామకు రచయిత అమర్ (నవీన్ చంద్ర) ఉన్న సంబంధం ఏమిటన్నదే ఈ మూవీ కథ.
మంచు విష్ణు కన్నప్పలో...
సత్యభామ తర్వాత తెలుగులో మంచు విష్ణు కన్నప్పలో గెస్ట్ రోల్ చేస్తోంది కాజల్ అగర్వాల్. కన్నప్పలో కాజల్‌తో పాటు ప్రభాస్, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్ గెస్ట్‌లుగా కనిపించబోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో కన్నప్ప రిలీజ్ కానుంది. కన్నప్ప కంటే ముందే మంచు విష్ణు, కాజల్ కలిసి మోసగాళ్లు అనే సినిమా చేశారు. మరోవైపు బాలీవుడ్‌లో సల్మాన్ హీరోగా నటిస్తోన్న సికందర్‌లో కాజల్ ఓ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు సమాచారం. ఈ మూవీతో దాదాపు మూడేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది కాజల్. సికందర్ మూవీలో రష్మిక మందన్న మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోంది.