Sun Transit: ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం.. ఏ రంగాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం
Sun Transit: గ్రహాల అధిపతి సూర్యుడు త్వరలో ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యభగవానుడి ధనస్సు రాశి సంచారం కొన్ని రంగాల్లో మంచి పురుగతిని తెస్తుంది. కొన్ని రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఏం రంగం వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.
గ్రహాల అధిపతి సూర్యుడు వ్యక్తుల స్వభావం, పరిణామం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాలను సూచిస్తాడు. జీవితంలోని శక్తి, సృజనాత్మకత, ఉద్దేశ్యాన్ని ప్రతిబింబిస్తాడు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు నెలకు ఒకసారి తన స్థానాన్ని మార్చుకుంటాడు. సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటే జీవితం దేదీప్యమానంగా వెలిగిపోతుందని నమ్మిక. సూర్యుడి సంచారంలో మార్పు అన్ని రకాల రాశులపై ప్రభావం చూపుతుంది.డిసెంబర్ 15న సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు.సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పుడు వ్యక్తుల జీవితంలో విశేష మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో ఏ రంగం వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
సూర్యుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నప్పుడు కొందరు వ్యక్తుల జీవితంలో మంచి పురోగతి లభిస్తుంది. ప్రత్యేకంగా బ్యాంకింగ్ రంగం, చట్టం, పరిపాలనా రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది.ఈ సమయంలో చాలా మంది క్రీడలపై ఆసక్తి చూపిస్తారు. శరీరంలో సహజమైన ఆకృతి, శక్తి కలుగుతాయి. వీరి జీవితం గొప్పగా ఉంటుంది.
ఏ రంగం వారికి ఎలా ఉంటుందో చూద్దాం..
రాజకీయాలు, ప్రభుత్వం:
ధనస్సు రాశిలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా రాజకీయవేత్తలు, ప్రభుత్వ రంగంలో పనిచేసే వారు బలంగా తయారవుతారు. ఈ సమయంలో భారత ప్రభుత్వం ప్రజల అంగీకారం పొందగలిగే నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని ప్లాన్ ప్రకారం అమలు చేస్తారు.
శోధన, అభివృద్ధి:
ధనస్సు రాశిలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు శోధన, అభివృద్ధి మెరుగవుతుంది. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఐటీ రంగంలోని వారి జీవితాలు ములుపు తిరుగుతాయి.
స్టాక్ మార్కెట్:
ధనస్సు రాశిలో సూర్యుడి సంచారం స్టాక్ మార్కెట్‌లో కొంత మార్పును కలిగిస్తుంది. సూర్యుడు బలమైన గ్రహం కావడంతొ సెంటిమెంట్ ప్రభావం మార్కెట్ మీద పడుతుంది. మార్కెట్ స్థిరంగా ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు లాభాలను పొందగలుగుతారు.
లాభపడే రాశులు:
మేషం:
ఈ సమయంలో మేష రాశి వారికి సూర్యుడు తొమ్మిదవ స్థానంలో ఉంటాడు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ నిబద్ధత, ఆధ్యాత్మికత పెరిగే అవకాశం ఉంటుంది.ఈ సమయంలో ధర్మం, భోదన, రాజకీయ రంగాలలో ఉన్నవారితో గొప్ప అనుబంధాన్ని పంచుకుంటారు.
సింహం:
సింహ రాశి వారికి సూర్యుడు మొదటి, ఐదవ స్థానంలో సంచరిస్తాడు. ఈ సమయంలో కుటుంబ సంబంధాలు బాగా ఉండవచ్చు. కాని ప్రేమ, సంబంధాలలో కొన్ని అవరోధాలను కూడా ఏర్పడవచ్చు.
వృశ్చికం:
వృశ్చిక రాశికి సూర్యుడి ధనస్సు రాశి సంచారం లాభాలను తెచ్చిపెడుతుంది. మీ కుటుంబంతో అనుబంధం బలపడుతుంది, కానీ కొన్ని ఆర్థిక సంబంధాలు సమస్యలు రావచ్చు.
ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి ఈ సూర్యుడు ప్రథమ స్థానంలో ఉంటాడు. ఇది ఆధ్యాత్మికంగా, ధార్మికంగా మిమ్మల్ని మరింత బలంగా మారుస్తుంది. ఈ సమయంలో మీరు గొప్ప నాయకత్వాన్ని ప్రదర్శించగలుగుతారు.
ప్రతికూల ప్రభావాలు కలిగే రాశులు:
వృషభం:
ఈ సమయంలో, వృషభ రాశి వారికి సూర్యుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సంబంధాలలో ఒత్తిడులు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
మిథునం:
మిథున రాశి వారికి సూర్యుడు ఏడవ స్థానంలో సంచరించడం వల్ల సంబంధాల్లో సమస్యలు, ముఖ్యంగా వివాహ సంబంధాల్లో మనస్సు మార్పులు, అహంకార చర్చలు వస్తాయి.
కర్కాటక:
కర్కాటక రాశి వారికి సూర్యుడు ఆరవ స్థానంలో సంచరిస్తాడు.ఇది ఆర్థిక విషయాలలో వివాదాలకు కారణమవుతుంది.