TGPSC Group 2 Exam 2024 : తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు మరో అప్డేట్ - జిల్లాల వారీగా ప్రత్యేక నెంబర్లు..!-helpline numbers for hall ticekts related issues of tgpsc group 2 exams 2024 list check here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tgpsc Group 2 Exam 2024 : తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు మరో అప్డేట్ - జిల్లాల వారీగా ప్రత్యేక నెంబర్లు..!

TGPSC Group 2 Exam 2024 : తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు మరో అప్డేట్ - జిల్లాల వారీగా ప్రత్యేక నెంబర్లు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 11, 2024 01:50 PM IST

TGPSC Group 2 Exam Updates : గ్రూప్ 2 పరీక్షలకు టీజీపీఎస్సీ సర్వం సిద్ధం చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే హాల్‌టికెట్ల జారీలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా హెల్ప్‌ లైన్‌ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు
తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు

గ్రూప్‌- 2 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు సిద్ధం చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టనుంది. మరోవైపు ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు టీజీపీఎస్సీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

yearly horoscope entry point

జిల్లాల వారీగా హెల్ప్‌ లైన్‌ నంబర్లు…

అభ్యర్థుల ఇబ్బందులను నివృత్తి చేసేందుకు జిల్లాల వారీగా హెల్ప్‌ లైన్‌ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఫోన్ నెంబర్లతో కూడిన జాబితాను వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక హాల్​టికెట్లు డౌన్​లోడ్​ సమయంలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే 040-23542185 లేదా 040-23542187 నంబర్లకు సంప్రదింవచ్చు. Helpdesk@tspsc.gov.in ఈ-మెయిల్‌ సందేహాలు పంపవచ్చని టీజీపీఎస్సీ పేర్కొంది.

గ్రూప్ 2 పరీక్షలు - టైమ్ టేబ

గ్రూప్-2 ఎగ్జామ్ లో భాగంగా…. మొత్తం 4 పేపర్లు ఉంటాయి. టీజీపీఎస్సీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... పేపర్-1 డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.ఇక డిసెంబరు 16వ తేదీన పేపర్​3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-2 ప్రతి పేపరులో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు.

గ్రూప్ 2 హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  1. తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ పై క్లిక్ చేయాలి.
  2. హోం పేజీలో కనిపించే Download Hall Ticket For Group-II Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఆ తర్వాత ఓపెన్ అయ్యే విండోలో టీజీపీఎస్సీ ఐడీ , పుట్టిన తేదీ వివరాలు ఎంట్రీ చేయాలి.
  4. డౌన్లోడ్ పీడీఎఫ్ పై క్లిక్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం