Om Bheem Bush Day 1 Collections: మంచి ఓపెనింగ్ దక్కించుకున్న క్రేజీ కామెడీ మూవీ.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..
Om Bheem Bush Day 1 Box Office Collections: ఓం భీమ్ బుష్ చిత్రానికి మంచి ఓపెనింగ్ దక్కింది. ఈ క్రేజీ కామెడీ మూవీకి తొలి రోజు వచ్చిన కలెక్షన్లను మూవీ టీమ్ వెల్లడించింది. ఆ వివరాలివే..
Om Bheem Bush Day 1 Collections: ‘ఓం భీమ్ బుష్’ సినిమా టైటిల్ నుంచి ట్రైలర్ వరకు చాలా ఆసక్తిని పెంచింది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబో రిపీట్ అవడం.. ట్రైలర్ క్రేజీగా ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు బాగా ఏర్పడ్డాయి. మంచి హైప్ మధ్య శుక్రవారం (మార్చి 22) ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అంచనాలకు తగ్గట్టే ఓం భీమ్ బుష్ చిత్రానికి మంచి ఓపెనింగ్ దక్కింది. తొలి రోజు వసూళ్ల లెక్కను మూవీ టీమ్ వెల్లడించింది.
ఫస్ట్ డే కలెక్షన్లు ఇవే
ఓం భీమ్ బుష్ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద బాగా పర్ఫార్మ్ చేసింది. ఈ చిత్రానికి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.4.6కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. తక్కువ బడ్జెట్‍తోనే తెరకెక్కిన ఈ మూవీకి ఇది మంచి ఓపెనింగ్. హైప్ నిలబెట్టుకుంటూ ఈ చిత్రం అదిరే ఆరంభం చేసింది.
తొలి రోజు కలెక్షన్ల వివరాలను మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. “బాక్సాఫీస్ వద్ద బ్యాంగ్. తొలి రోజు ఓం భీమ్ బుష్ రూ.4.6కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అమెరికా బాక్సాఫీస్‍లో 1.75లక్షల డాలర్లతో అదిరిపోయే స్టార్స్ అందుకుంది” అని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
జోరు పెరిగే ఛాన్స్
ఓం భీమ్ బుష్ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్‍లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కామెడీతో పాటు హారర్ కూడా ఈ చిత్రం వర్కౌట్ అయింది. అందులోనూ ఈ మూవీకి పెద్దగా పోటీ కూడా లేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ క్రేజీ కామెడీ సినిమా జోరు కొనసాగే ఛాన్స్ బలంగా ఉంది.
ఓం భీమ్ బుష్ చిత్రంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ కామెడీ బాగా పండింది. కామెడీ టైమింగ్‍లో ముగ్గురూ మరోసారి మేజిక్ చేశారు. హారర్ కూడా ఈ చిత్రానికి యాడ్ అయింది. ఈ మూవీకి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కొత్త పాయింట్ ఉంటుందని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ ట్విస్ట్ కూడా బాగానే వర్కౌట్ అయింది.
ఓం భీమ్ బుష్ మూవీలో ప్రీతీ ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ కీలకపాత్రలు పోషించారు. సన్నీ ఎంఆర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ చిత్రానికి ప్లస్ అయింది. వీ సెల్యులాయిడ్, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి విజయ్ వర్దన్ కావూరి ఎడిటింగ్ చేశారు.
ఓం భీమ్ బుష్ స్టోరీ బ్యాక్‍డ్రాప్
నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్‍కు తగ్గట్టే క్రేజీ కామెడీతో ఓం భీమ్ బుష్ స్టోరీ ఉంటుంది. సైంటిస్టులమని చెప్పి భైరవపురం గ్రామానికి వెళతారు క్రిష్ (శ్రీ విష్ణు), మాధవ్ (రాహుల్ రామకృష్ణ), వినయ్ (ప్రియదర్శి). ఆ గ్రామంలో చాలా సమస్యలను పరిష్కరిస్తుంటారు. దీంతో సంపగి మహల్‍లో ఉండే నిధి తీసుకురావాలని వారికి చాలెంజ్ ఎదురవుతుంది. దీంతో దెయ్యం ఉండే ఆ మహల్‍లోకి ఆ ముగ్గురు వెళతారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆ మహల్ వెనుక ఉండే మిస్టరీ ఏంటి.. వారికి నిధి దక్కిందా? అనేది ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటుంది.