Om Bheem Bush Review: భయపెట్టే హారర్ థ్రిల్లర్, నవ్వించే కామెడీ.. ఓం భీమ్ బుష్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
Om Bheem Bush Movie Review In Telugu: మరోసారి నవ్వించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రోచేవారెవరురా కాంబినేషన్ మూవీ ఓం భీమ్ బుష్. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా నటించిన ఓం భీమ్ బుష్ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
టైటిల్: ఓం భీమ్ బుష్
నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రియా వడ్లమాని, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు
దర్శకత్వం: శ్రీ హర్శ కొనుగంటి
నిర్మాత: సునీల్ బలుసు, వి సెల్యూలాయిడ్స్
సంగీతం: సన్నీ ఎంఆర్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటింగ్: విష్ణు వర్ధన్ కావూరి
విడుదల తేది: మార్చి 22, 2024
Om Bheem Bush Review In Telugu: శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓం భీమ్ బుష్ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
క్రిష్ )శ్రీ విష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. వీరిని బ్యాంగ్ బ్రోస్ అంటుంటారు. కాలేజీలో పీహెచ్‌డీ పేరుతో ఉంటూ నానా రచ్చ చేస్తుంటారు. వాళ్ల చేసే పనులు వేగలేక తానే ఎగ్జామ్స్ రాసి బయటకు పంపిస్తాడు ప్రిన్సిపాల్ రంజిత్ (శ్రీకాంత్ అయ్యంగార్). ఊరికి వెళుతూ మధ్యలో భైరవపురంల దగ్గర ఆగుతారు ఈ ముగ్గురు. ఆ ఊరిలో తాంత్రిక విద్యల పేరుతో డబ్బు సంపాదించడం చూసిన ఈ బ్యాంగ్ బ్రోస్ భైరవపురంలోకి అడుగుపెడతారు.
హైలెట్స్
భైరవపురంలోకి బ్యాంగ్ బ్రోస్ ఎంట్రీ ఇచ్చాక ఏం జరిగింది? ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అక్కడ పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? ఆ గ్రామంలో ఉన్న సంపంగి దెయ్యం ఎవరు? దాని నేపథ్యం ఏంటీ? సంపంగి దెయ్యాన్ని బ్యాంగ్ బ్రోస్ ఎందుకు పట్టుకోవడానికి వెళ్లారు? ఊరిలో క్రిష్ పెట్టిన మూడు కండిషన్స్ ఏంటీ? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఓం భీమ్ బుష్ చూడాల్సిందే.
విశ్లేషణ:
ఓం భీమ్ బుష్ సినిమా క్యాప్షన్ నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్. దానికితగినట్లుగానే సినిమా లాజిక్ లేకుండా బాగా నవ్వించి మ్యాజిక్ చేస్తుంది. సినిమా ఫస్టాఫ్ అంతా కాలేజీ సీన్లతో నవ్వులు పంచాయి. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టారు. అయితే కథ పరంగా కాకుండా కేవలం కామెడీ పరంగా చూస్తే సినిమా హిలేరియస్‌గా ఉంటుంది. నవ్వించడంలో మరోసారి బ్రోచెవారెవరురా కాంబోను రిపీట్ చేశారు.
గ్లామర్ కోసం
ఇక ఊరిలోకి వెళ్లాక సంపంగి దెయ్యం చుట్టూ వచ్చే ట్రాక్. సంపంగి దెయ్యం గురించి శ్రీ విష్ణు తెలుసుకునే నిజాలు బాగా నవ్విస్తాయి. గుప్త నిధులు అంటూ చేసే హంగామా కూడా ఆకట్టుకుంటుంది. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్‌ను గ్లామర్ కోసం అన్నట్లుగా ఉన్నారు. బాగా నటించినప్పటికీ వారి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ప్రియా వడ్లమాని ఒక సాంగ్‌లో అలరిస్తుంది. హీరో హీరోయిన్లకు సంబంధించిన లవ్ ట్రాక్ స్టోరీకి సరైన బలం లేదు.
వర్కౌట్ కానీ క్లైమాక్స్
శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి తమ పాత్రలతో బాగా నవ్వించి నటనతో ఆకట్టుకున్నారు. ఇక శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ నటనతో బాగా నవ్విస్తారు. సామజవరగమనతో పోలిస్తే ఇందులో శ్రీ విష్ణు డైలాగ్ డోస్ పెంచాడు. క్లైమాక్స్ పెద్దగా వర్కౌట్ కాదు. కామెడీ సీన్లతోపాటు ఎమోషనల్ అండ్ బోల్డ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. సాంకేతిక విలువలు బాగున్నాయి. సన్నీ ఎంఆర్ సంగీతం ఆకట్టుకుంది. అది చిత్రానికి బాగా ప్లస్ అయిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
ఓవరాల్‌గా చెప్పాలంటే?
ఫైనల్‌గా చెప్పాలంటే ఓం భీమ్ బుష్ సినిమా ప్రేక్షకులను బాగా నవ్వించి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌కు ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. లాజిక్‌ను పక్కన పెట్టి కేవలం కామెడీని చూస్తే మాత్రం హాయిగా నవ్వుకోవచ్చు.
రేటింగ్: 3/5
టాపిక్