Om Bheem Bush Runtime: క్రిస్పీ రన్‍టైమ్‍తో క్రేజీ కామెడీ మూవీ ‘ఓం భీమ్ బుష్’: సెన్సార్ కంప్లీట్-om bheem bush movie runtime locked and censor completed ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Om Bheem Bush Runtime: క్రిస్పీ రన్‍టైమ్‍తో క్రేజీ కామెడీ మూవీ ‘ఓం భీమ్ బుష్’: సెన్సార్ కంప్లీట్

Om Bheem Bush Runtime: క్రిస్పీ రన్‍టైమ్‍తో క్రేజీ కామెడీ మూవీ ‘ఓం భీమ్ బుష్’: సెన్సార్ కంప్లీట్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 19, 2024 03:06 PM IST

Om Bheem Bush Runtime: ఓం భీమ్ బుష్ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. తక్కువ రన్‍టైమ్‍తోనే ఈ కామెడీ ఎంటర్‌టైనర్ థియేటర్లలోకి రానుంది.

Om Bheem Bush Runtime: క్రిస్పీ రన్‍టైమ్‍తో క్రేజీ కామెడీ మూవీ ‘ఓం భీమ్ బుష్’: సెన్సార్ కంప్లీట్
Om Bheem Bush Runtime: క్రిస్పీ రన్‍టైమ్‍తో క్రేజీ కామెడీ మూవీ ‘ఓం భీమ్ బుష్’: సెన్సార్ కంప్లీట్

Om Bheem Bush Runtime: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఓం భీమ్ బుష్ చిత్రంపై మంచి హైప్ ఉంది. ఈ మూవీకి ప్రమోషన్లను కూడా ముగ్గురూ డిఫరెంట్‍గా చేస్తున్నారు. సినిమాకు బజ్ తీసుకొస్తున్నారు. గతంలో ఈ ముగ్గురి కాంబోతో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా బ్లాక్‍బాస్టర్ అయింది. ఇప్పుడు మళ్లీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ కాంబో రిపీట్ అవుతుండటంతో ‘ఓం భీమ్ బుష్’ చిత్రంపై చాలా ఆసక్తి ఉంది. ఈ సినిమా మార్చి 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తయినట్టు సమాచారం బయటికి వచ్చింది.

yearly horoscope entry point

తక్కువ రన్‍టైమ్‍తోనే..

ఓం భీమ్ బుష్ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ తాజాగా ఫినిష్ అయింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సెన్సార్ అవటంతో ఈ మూవీ రన్ టైమ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ చిత్రం రన్‍టైమ్ 2 గంటల 15 నిమిషాలు (135 నిమిషాలు)గా ఉండనుంది. తక్కువ రన్‍టైమ్‍తోనే ఈ మూవీ వస్తోంది. క్రిస్పీ రన్‍టైమ్ ఉండడం ఈ ఎంటర్‌టైన్‍మెంట్ మూవీకి ప్లస్‍గా అయ్యే ఛాన్స్ ఉంది.

ఓం భీమ్ బుష్ చిత్రానికి హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల వచ్చిన ఈ మూవీ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రం కొత్త స్టోరీ పాయింట్‍తో వస్తోందని మూవీ టీమ్ మొదటి నుంచి హైప్ తీసుకొస్తోంది. ట్రైలర్ లాంచ్ సహా మిగిలిన ప్రమోషనల్ ఈవెంట్‍లో ఈ మాటను చెబుతూ వస్తోంది. దీంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓం భీమ్ బుష్ ట్రైలర్‌లో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ డైలాగ్‍లు, కామెడీ టైమింగ్ అదిరిపోయాయి. సైంటిస్టులుగా ఓ గ్రామంలో వెళ్లడం.. అన్ని సమస్యలు తీర్చుతామని అందరికీ చెప్పడం చుట్టూ ఎంటర్‌టైనింగ్‍గా ఈ ట్రైలర్ సాగింది. ఓ పాడుపడిన మహల్‍లో నిధి కోసం ఆ ముగ్గురు వెళ్లడం ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తంగా ట్రైలర్ క్రేజీగా ఉండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ ట్రైలర్‌కు యూట్యూబ్‍లో మూడు మిలియన్లకుపైగా వ్యూస్ కూడా వచ్చేశాయి.

ఓం భీమ్ బుష్ మూవీలో ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సునీల్ బలుసుతో కలిసి వీ సెల్యులాయిడ్‍ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సన్నీ ఎం.ఆర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఈ మూవీకి విజయ్ వర్ధన్ కావూరి ఎడిటింగ్ చేస్తున్నారు.

విభిన్నంగా ప్రమోషనల్ వీడియోలు

ఓం భీమ్ బుష్ సినిమా కోసం శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ ముగ్గురూ కలిసి రకరకాల ప్రమోషనల్ వీడియోలు చేస్తున్నారు. అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుక థీమ్‍లోనూ ఓ సరదా వీడియో చేశారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. పిల్లలను చదువకోండి ముందు అంటూ మరో వీడియో చేశారు. ఏ టూ జెడ్ సొల్యూషన్స్ అంటూ కొన్ని చిత్రమైన ప్రశ్నలకు విచిత్రమైన ఆన్సర్లు ఇస్తూ ఈ ముగ్గురు మరో వీడియో చేశారు. ఇలా వెరైటీ ఐడియాలతో ప్రమోషన్ల మోత మోగిస్తున్నారు.

Whats_app_banner