Premalu OTT: సూపర్ హిట్ మూవీ ప్రేమలు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. ఆలస్యంగానే రానుందా?-nelson k gafoor mamitha baiju super hit premalu movie ott rights details disneyplus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nelson K Gafoor Mamitha Baiju Super Hit Premalu Movie Ott Rights Details Disneyplus Hotstar

Premalu OTT: సూపర్ హిట్ మూవీ ప్రేమలు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్.. ఆలస్యంగానే రానుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 28, 2024 08:22 PM IST

Premalu OTT Platform: మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఖరారైంది. త్వరలో తెలుగులోనూ థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ఓటీటీ డీల్ జరిగినట్టు సమచారం బయటికి వచ్చింది.

Premalu OTT: సూపర్ హిట్ మూవీ ప్రేమలు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్
Premalu OTT: సూపర్ హిట్ మూవీ ప్రేమలు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్

Premalu on OTT: మలయాళ సినీ ఇండస్ట్రీలో ‘ప్రేమలు’ సినిమా సెన్సేషన్ హిట్‍గా దూసుకెళుతోంది. లవ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. సుమారు రూ.3కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించిన ప్రేమలు మూవీ ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్లు రూ.63కోట్లను దాటేసింది. ఇంకా జోరు కంటిన్యూ చేస్తోంది. త్వరలో ప్రేమలు మూవీ తెలుగులోనూ థియేటర్లలో విడుదల కానుంది. కాగా, తాజాగా ఈ సినిమా ఓటీటీ ఒప్పందం కూడా జరిగినట్టు తెలుస్తోంది.

ప్రేమలు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ప్లాట్‍ఫామ్ ‘డిస్నీ+ హాట్‍స్టార్’ సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్న ఈ మూవీ ఓటీటీ హక్కుల కోసం డిస్నీ+ హాట్‍స్టార్ భారీగానే వెచ్చించిందని తెలుస్తోంది.

స్ట్రీమింగ్‍కు ఆలస్యంగా..!

ప్రేమలు సినిమా మలయాళంలో రిలీజై ఇప్పటికే నాలుగు వారాలు సమీపిస్తోంది. అయితే, ఈ ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది. అందులో తెలుగులోనూ ఈ చిత్రం డబ్బింగ్ అవుతోంది. తెలుగులో కూడా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రేమలు సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి ఆలస్యంగా స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇటీవలి కాలంలో చాలా సినిమాలు థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తున్నాయి. అయితే, ప్రేమలు సినిమా థియేట్రికల్ రన్ ఇంకా జోరుగా సాగుతుండటంతో స్ట్రీమింగ్‍కు ఆలస్యంగా వస్తుందని అంచనాలు ఉన్నాయి. గతంలో మలయాళ మూవీ కన్నూర్ స్క్వాడ్ సినిమా ఏడు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. మరి ప్రేమలు కూడా ఓటీటీలోకి ఆలస్యంగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి మేకర్ల నుంచి ప్రకటన రాలేదు.

ప్రేమలు సినిమాలో నెల్సన్ కే గఫూర్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించగా… ఏడీ గిరీశ్ దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని గిరీశ్ తెరకెక్కించారు. నెల్సన్, మమితా యాక్టింగ్ ఈ మూవీకి హైలైట్‍గా నిలిచింది. హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ రూపొందింది.

తెలుగులో రిలీజ్ గురించి..

ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్‍లోనూ థియేటర్లలోకి రానుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రేమలు తెలుగు డబ్బింగ్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీ తెలుగు వెర్షన్ గురించి అధికారిక ప్రకటన నేడే వచ్చింది. తెలుగు ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.

అయితే ప్రేమలు తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కార్తికేయ ట్వీట్ చేశారు. మార్చి 8న రిలీజ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్ కావడం, హైదరాబాద్ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందడటంతో ప్రేమలు సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లను సాధించే అవకాశాలు ఉన్నాయి.

ప్రేమలు సినిమా నిర్మాతల్లో ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా ఉన్నారు. దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్‍తో కలిసి ఆయన ఈ మూవీని నిర్మించారు. విష్ణు విజయ్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు.

IPL_Entry_Point