Mrunal Thakur: హైదరాబాద్‍లోని ప్రముఖ ఆలయంలో మృణాల్ ఠాకూర్ పూజలు.. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లకు ముందు..-mrunal thakur visited hyderabad balkampet yellamma temple ahead of family star movie promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mrunal Thakur Visited Hyderabad Balkampet Yellamma Temple Ahead Of Family Star Movie Promotions

Mrunal Thakur: హైదరాబాద్‍లోని ప్రముఖ ఆలయంలో మృణాల్ ఠాకూర్ పూజలు.. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లకు ముందు..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 24, 2024 04:32 PM IST

Mrunal Thakur - Balkampet Yellamma Temple: స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హైదరాబాద్‍లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రమోషన్లకు ముందు దేవత ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వివరాలివే..

Mrunal Thakur: హైదరాబాద్‍లోని ప్రముఖ ఆలయంలో మృణాల్ ఠాకూర్ పూజలు
Mrunal Thakur: హైదరాబాద్‍లోని ప్రముఖ ఆలయంలో మృణాల్ ఠాకూర్ పూజలు

Mrunal Thakur: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తక్కువ కాలంలో మంచి క్రేజ్ సంపాదించారు. అందంతో పాటు నటనలోనూ ఆమె మెప్పిస్తున్నారు. తెలుగులో ఆమె నటించిన సీతారామం, హాయ్ నాన్న చిత్రాలు సూపర్ హిట్ అవటంతో ఆమె చాలా పాపులర్ అయ్యారు. బాలీవుడ్‍లో ఎక్కువ సినిమాలు చేసినా.. తెలుగులోనే మృణాల్ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో మృణాల్ ఠాకూర్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఎల్లమ్మ ఆలయంలో..

ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్లను మూవీ టీమ్ వేగవంతం చేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనే ముందు నేడు (మార్చి 24) హైదరాబాద్‍లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి మృణాల్ ఠాకూర్ వెళ్లారు. దేవతను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లకు ముందు ఎల్లమ్మ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు మృణాల్. ఆలయానికి మృణాల్ వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి.

ఫ్యామిలీ స్టార్ గురించి..

ఫ్యామిలీ స్టార్ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండ - పరుశురామ్ కాంబినేషన్‍లో వచ్చిన గీతగోవిందం బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రివీట్ అవుతుండటంతో ఫ్యామిలీ స్టార్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్లింప్స్ నుంచి పాటలు, టీజర్ అన్ని విషయాల్లోనూ ఈ మూవీ మంచి హైప్ తెచ్చుకుంది.

ఫ్యామిలీ స్టార్ చిత్రంలో మిడిల్ క్లాస్ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ నటించారు. ఇటీవలే వచ్చిన ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్ కూడా ఈ మూవీలో ఉండనుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ర్యాప్‍తో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకుంది. మృణాల్ ఠాకూర్ మరోసారి బ్యూటిఫుల్‍గా కనిపించారు. ఈ టీజర్లో పెట్రోల్ డైలాగ్ బాగా వైరల్ అయింది.

పాటలు పాపులర్

ఫ్యామిలీ స్టార్ చిత్రం నుంచి ఇప్పటి వరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన నందనందనా సాంగ్ బాగా హిట్ అయింది. ఈ చిత్రానికి క్రేజ్ తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ హుక్ స్టెప్ పాపులర్ అయింది. ఇటీవలే ఈ మూవీ నుంచి మ్యారేజ్ సాంగ్ వచ్చింది. కల్యాణి వచ్చా.. వచ్చా అంటూ ఈ పాట కూడా ఆకట్టుకుంది. మొత్తంగా రిలీజ్‍కు ముందు కావాల్సిన బజ్ బాగానే క్రియేట్ చేసుకుంది.

ప్రమోషన్లను కూడా జోరుగా చేసేందుకు ‘ఫ్యామిలీ స్టార్’ టీమ్ సిద్ధమవుతోంది. శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో ఏప్రిల్ 5న విడుదల కానుంది.

విజయ్ దేవరకొండ నటించిన గత రెండు సినిమాలు లైగర్, ఖుషి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. భారీ అంచనాలతో వచ్చి బోల్తా కొట్టాయి. దీంతో ఫ్యామిలీ స్టార్ మూవీ విజయ్‍కు చాలా ముఖ్యంగా మారింది. అందుకే ప్రమోషన్లను కూడా ఈ చిత్రానికి మరింత ఎక్కువగా చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

IPL_Entry_Point