Family Star Movie: విజయ్ దేవరకొండ ‘దోశ’పై రచ్చ.. స్పందించిన ఫ్యామిలీ స్టార్ మూవీ టీమ్-family star team responded on vijay deverakonda dosa clip in movie teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Family Star Movie: విజయ్ దేవరకొండ ‘దోశ’పై రచ్చ.. స్పందించిన ఫ్యామిలీ స్టార్ మూవీ టీమ్

Family Star Movie: విజయ్ దేవరకొండ ‘దోశ’పై రచ్చ.. స్పందించిన ఫ్యామిలీ స్టార్ మూవీ టీమ్

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 13, 2024 09:06 PM IST

Family Star Dosa Clip - Vijay Deverakoda: ఫ్యామిలీ స్టార్ మూవీ టీజర్‌లోని ఓ క్లిప్‍పై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దీనిపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పందించింది.

Family Star Dosa: విజయ్ దేవరకొండ ‘దోశ’పై రచ్చ
Family Star Dosa: విజయ్ దేవరకొండ ‘దోశ’పై రచ్చ

Family Star Dosa: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీపై మంచి హైప్ ఉంది. పరశురామ్ దర్శకత్వంలో ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా సినిమా రూపొందుతోంది. తనకు గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరుశురాం కాంబోలో విజయ్ మళ్లీ చేస్తుండటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్‌ కూడా అదిరిపోయిందనే రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే, తాజాగా ఫ్యామిలీ స్టార్‌ సినిమాలోని ఓ క్లిప్‍ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘దోశ’పై రచ్చ

ఫ్యామిలీ స్టార్ మూవీ టీజర్లో విజయ్ దేవరకొండ దోశ వేసే సీన్ ఉంది. పెన్నంపై అతడు దోశ వేస్తారు. ఆ తర్వాత అభియన ప్లేట్‍లో దోశను వడ్డిస్తారు. అయితే, దీన్ని నిశితంగా పరిశీలించిన కొందరు అది దోశలా లేదని గుర్తించారు. విజయ్ దేవరకొండ ప్లేట్లో వడ్డించిన ఆ దోశ గుండ్రంగా కాకుండా చతురస్రంగా ఉంది. అందులోనూ చూసేందుకు అది పేపర్‌లా ఉంది. దీంతో అది దోశే కాదని కొందరు నెటిజన్లు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నారు. ఇదేంది.. మిడిల్ క్లాస్ దోశనా అని కామెంట్లు చేస్తున్నారు.

“అన్నో.. ఏం దోశన్నో అది. కొత్త రకం మిడిల్ క్లాస్ దోశనా?” అని రగడి అనే హ్యాండిల్ నుంచి ఓ ట్వీట్ పోస్ట్ అయింది. అలాగే, మరికొందరు కూడా ఈ దోశ క్లిప్‍ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అదేంటని కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పందించింది.

అప్పుడే డౌట్లు క్లియర్

ఏప్రిల్ 5వ తేదీన ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుందని, అప్పుడు డౌట్లు క్లియర్ చేసుకోండనేలా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆ క్లిప్‍కు రిప్లే ఇచ్చింది. “ఏప్రిల్ 5. అన్ని డౌట్లను క్లియర్ చేసుకునేందుకు మీ ఫ్యామిలీతో కలిపి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం” అని రెస్పాండ్ అయింది. అంటే, థియేటర్లో సినిమా చూశాక ఈ దోశ డౌట్ తీరుతుందని స్పష్టం చేసింది. మరి దోశ మిస్టరీ ఏంటో చిత్రంలోనే చూడాలి.

ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి రెండో పాట మంగళవారం (మార్చి 12) రిలీజ్ అయింది. ‘కల్యాణి వచ్చా వచ్చా’ అంటూ వచ్చిన ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మంగ్లీ, కార్తీక్ ఈ గీతాన్ని పాడారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అంతకు ముందు వచ్చిన నందనందన పాట సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది.

ఫ్యామిలీ స్టార్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా నటించారు. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీమ్యాన్‍ పాత్రను విజయ్ పోషించారు. టీజర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రష్మిక మందన్నా క్యామియో రోల్‍లో కనిపిస్తారని రూమర్లు వస్తున్నాయి.