ETV Win: ఈటీవీ విన్‍ ఓటీటీలో ఈనెల రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే.. తరుణ్ భాస్కర్ సిరీస్‍ కూడా..-movies and web serieses to release in march 2024 on etv win ott valari to tulasivanam ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Etv Win: ఈటీవీ విన్‍ ఓటీటీలో ఈనెల రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే.. తరుణ్ భాస్కర్ సిరీస్‍ కూడా..

ETV Win: ఈటీవీ విన్‍ ఓటీటీలో ఈనెల రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే.. తరుణ్ భాస్కర్ సిరీస్‍ కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 05, 2024 02:12 PM IST

ETV Win OTT Releases March 2024: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈనెల కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రానున్నాయి. తరుణ్ భాస్కర్ సమర్పించిన ఓ సిరీస్ అడుగుపెట్టనుంది.

ETV Win OTT: ఈటీవీ విన్‍ ఓటీటీలో ఈనెల రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే
ETV Win OTT: ఈటీవీ విన్‍ ఓటీటీలో ఈనెల రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఇవే

ETV Win OTT: ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ‘ఈటీవీ విన్’ జోరు పెంచింది. ఇటీవల దూకుడుగా కొత్త కంటెంట్‍ను తీసుకొస్తూనే ఉంది. ఈనెల (మార్చి)లోనూ ఈటీవీ విన్‍లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు రానున్నాయి. ఓ చిత్రం థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఈటీవీ విన్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. స్టార్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సమర్పిస్తున్న ఓ సిరీస్ కూడా అడుగుపెట్టనుంది. ఈనెల ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానున్న ముఖ్యమైన సినిమాలు, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.

వళరి

గురు సినిమా ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్ర పోషించిన ‘వళరి’ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండానే నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మార్చి 6వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ హారర్ థ్రిల్లర్‌ మూవీకి మృతిక సంతోషి దర్శకత్వం వహించారు. రితికతో పాటు శ్రీరామ్, ఉత్తేజ్, సుబ్బరాజు, ప్రిన్స్ సహస్ర వళరి చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. మార్చి 6 నుంచి ఈ చిత్రాన్ని ఈటీవీ విన్‍లో చూసేయవచ్చు.

ఏం చేస్తున్నావ్

విజయ్ రాజ్‍కుమార్, నేహా పఠాన్, అమృత రంగానాథ్ ప్రధాన పాత్రలు పోషించిన ఏం చేస్తున్నావ్ సినిమా గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే పెద్దగా ఆడలేదు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఆమని కూడా కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి మార్చి 14వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఉద్యోగం లేని ఓ యువకుడు ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ ఈ చిత్రం ఉంటుంది. ఏం చేస్తున్నావ్ చిత్రానికి భరత్ మిత్ర దర్శకత్వం వహించారు.

తులసీవనం

వీజీ సైన్మా బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ‘తులసీవనం’ వెబ్ సిరీస్‍ను సమర్పిస్తున్నారు. తండ్రి కోరికను కాదని నటుడు కావాలనుకునే ఓ కొడుకు కథతో ఈ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్‍లో అక్షయ్ లాగుసానీ, ఐశ్వర్య హోలక్కల్ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 21వ తేదీన తులసీవనం వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమటం, విష్ణు ఓయ్ కూడా ఈ సిరీస్‍లో కీలకపాత్రలు పోషించారు. అనిల్ రెడ్డి ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు.

ప్లాట్

ప్లాట్ సినిమా గతేడాది నవంబర్ 5న థియేటర్లలో రిలీజ్ అయింది. వికాస్ ముప్పల, గాయత్రీ గుప్తా, సజీవ్ పసల ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు భాను భావా. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుపెట్టాక ఓ యువకుడు ఎలాంటి సవాళ్లు, కష్టాలు ఎదుర్కొన్నాడనేదే ప్లాట్ సినిమా కథగా ఉంది. ప్లాట్ చిత్రం మార్చి 28న ఈటీవీ విన్‍లోకి రానుంది.

కాగా, రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా మార్చి 1వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీకి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఈగల్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనూ వచ్చింది.

WhatsApp channel