Eagle OTT Release Date: అఫీషియల్: ఈగల్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు.. రెండు ప్లాట్‍ఫామ్‍ల్లో..
Eagle Movie OTT Release Date: ఈగల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనుంది. స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
Eagle OTT Streaming Date: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినా.. అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను సాధించలేకపోయింది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‍గా నటించగా.. అనుపమ పరమేశ్వరన్ కీలకపాత్ర పోషించారు. ఈగల్ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది.
ఈగల్ సినిమా స్ట్రీమింగ్ తేదీని ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. మార్చి 1వ తేదీన ఈ సినిమాను స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. మాస్ మహారాజ్ ఎంటర్‌టైనర్ మార్చి 1వ తేదీన రానుందంటూ ఈటీవీ విన్ నేడు (ఫిబ్రవరి 28) అనౌన్స్ చేసింది.
అమెజాన్ ప్రైమ్‍లోనూ..
ఈగల్ ఓటీటీ హక్కులను ఈటీవీ విన్‍తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా దక్కించుకుంది. ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనూ ఈ సినిమా మార్చి 1వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రైమ్ వీడియోలో హిందీ వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని సమాచారం.
మూడు వారాల్లోనే..
ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజ్ కాగా.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. మార్చి 1న ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. అంచనాల కంటే ముందుగానే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఈగల్ చిత్రంలో రవితేజ గెటప్, యాక్షన్ సీక్వెన్సులు అభిమానులకు తెగనచ్చేశాయి. మాస్ మహారాజ పర్ఫార్మెన్స్ అందరినీ మెప్పించింది. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా కావ్య థాపర్ నటించగా.. జర్నలిస్టు పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చేశారు. నవ్‍దీప్ కూడా ఓ కీలకమైన క్యారెక్టర్‌లో కనిపించారు.
ఈగల్ సినిమాలో వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధూ, శ్రీనివాస రెడ్డి, అజయ్ ఘోష్ కీరోల్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ డావ్ జండ్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నా.. పాటలు పెద్దగా పాపులర్ కాలేదు. స్టార్ సినిమాటోగ్రాఫర్ అయిన కార్తీక్‍కు డైరెక్టర్‌గా ఈగల్ రెండో సినిమా. అయితే, అతడి స్టైలిష్ టేకింగ్, ఫిల్మ్ మేకింగ్ ఆకట్టుకుంది. అయితే, బాక్సాఫీస్ వద్ద మాత్రం మోస్తరుగానే వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. అంచనాలను అందుకోలేకపోయింది. మొత్తంగా ఈ చిత్రం సుమారు రూ.35 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.
ఈగల్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. పత్తి మిల్లు నిర్వాహకుడిగా.. ఈగల్ నెట్‍వర్క్ మాస్టర్ మైండ్‍గా ఈ చిత్రంలో పర్ఫార్మెన్స్ అదరగొట్టారు రవితేజ. ఈ చిత్రంలో ట్విస్టులు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి.
సుహాస్ మూవీ కూడా మార్చి 1నే..
యంగ్ యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కూడా మార్చి 1వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ యాక్షన్ మూవీగా దర్శకుడు దుష్యంత్ కటిక ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం థియేటర్లలో రిలీజై మంచి విజయం సాధించింది. ఇప్పుడు నెలలోగానే మార్చి 1వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు వస్తోంది.